సి.ఎస్‌. లక్ష్మి భారతదేశానికి చెందిన తమిళ రచయిత్రి. ఆమె 2021లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైంది.[1]

సి.ఎస్‌. లక్ష్మి
అంబై
పుట్టిన తేదీ, స్థలం1944
కోయంబత్తూరు, తమిళనాడు రాష్ట్రం, భారతదేశం
కలం పేరుఅంబై
వృత్తిరచయిత, రిసెర్చ్‌ర్ అఫ్ వుమెన్‌ స్టడీస్
భాషతమిళ్, ఇంగ్లీష్
జాతీయత భారతదేశం
విద్యపి.హెచ్.డి
పూర్వవిద్యార్థిజవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ, న్యూఢిల్లీ
కాలం1962 - ప్రస్తుతం
రచనా రంగంకథానిక, నవల
విషయంమహిళలు
గుర్తింపునిచ్చిన రచనలుసిరకుకల్‌ మురియమ్‌
వీతిన్ ముళైయిల్ ఓరు సమైయాలరై
కాటిళ్ ఓరు మాన్
పురస్కారాలుకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ (2021)
జీవిత భాగస్వామివిష్ణు మాథుర్

జననం, విద్యాభాస్యం

మార్చు

సి.ఎస్‌. లక్ష్మి తమిళనాడు రాష్ట్రం, కోయంబత్తూరులో 1944లో జన్మించింది. ఆమె ముంబై, బెంగళూరులో పెరిగింది. లక్ష్మి మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజిలో పోస్ట్‌–గ్రాడ్యుయేషన్‌ (చరిత్ర) చేసి, ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో పీహెచ్‌డి పూర్తి చేసి తమిళనాడులో స్కూల్‌ టీచర్‌గా, లెక్చరర్‌గా పని చేసింది.

రచయిత్రిగా

మార్చు

సి.ఎస్. లక్ష్మి పందొమ్మిది సంవత్సరాల వయసులోనే కథలు రాయడం మొదలుపెట్టి తమిళ పత్రిక ‘ ఆనంద్‌ వికటన్‌’ లో ఆమె రాసిన ఎన్నో కథలు ప్రచురితమై ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆమె 1967లో రాసిన ‘సిరకుకల్‌ మురియమ్‌’ ఆమెకు మంచి గుర్తింపునందించింది. సీ.ఎస్. లక్ష్మి మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యక్ష, పరోక్ష సమస్యలు అనేక కధలు రాసింది. ఆమె రాసిన కథా సంకలనం ‘శివప్పు కళత్తుడన్‌ ఒరు పట్చయ్‌ పరవై’ (ఎర్రటిమెడ ఉన్న పచ్చటిపక్షి) కు 2021లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైంది.[2][3]

మూలాలు

మార్చు
  1. Sakshi (7 January 2022). "పురస్కారం... ఎర్రని రెక్కల పచ్చని పక్షి". Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.
  2. The Hindu (30 December 2021). "Sahitya Akademi award for Tamil writer Ambai" (in Indian English). Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.
  3. The Times of India (31 December 2021). "sahitya akademi: Tamil writer Ambai wins Sahitya Akademi award" (in ఇంగ్లీష్). Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.