సీవీ రాజు ( చింతలపాటి వెంకటపతి రాజు ) కు 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ అత్యున్నత పురస్కారమైన 'పద్మశ్రీ ' పురస్కారం 2023 జనవరి 25వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది[1]. కళలు విభాగంలో సీవీ రాజుకి పద్మశ్రీ పురస్కారం వచ్చింది[2]. చింతలపాటి వెంకటపతి రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామానికి చెందిన ప్రఖ్యాత కళాకారుడు. ఆయన రూపొందించిన ఏటికొప్పాక బొమ్మలు బాగా ప్రాచుర్యం పొందాయి. 1999 సంవత్సరంలో ఏటికొప్పాక నందు హస్తకళ నిలయాన్ని ఏర్పాటు చేసి కళాకారులకు ఆధునిక బొమ్మల తయారీపై శిక్షణ ఇచ్చారు[3]. వారు తయారు చేసిన బొమ్మలకు వారే ధర నిర్ణయించుకునేలా చేశారు. పసుపు, ఇండిగో పిక్కలు, జాప్రా, కరక్కాయ మొదలైన వాటితో ప్రకృతి సిద్ధమైన రంగుల తయారీకి శ్రీకారం చుట్టారు. సీవీ రాజు ఏటికొప్పాక లక్క బొమ్మలకు జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు[4]. మూడు దశాబ్దాలుగా హస్తకళారంగంలో రాణిస్తున్న ఆయన తన కళానైపుణ్యతతో అందరినీ ఆకట్టుకున్నారు[5]. అంకుడు కర్రతో అనేక అద్భుత కళాఖండాలను సృష్టించారు. ఏటికొప్పాక బొమ్మలకు ప్రకృతి సహజ సిద్ధమైన రంగులను అద్ది జీవ కళ ఉట్టిపడేలా రూపొందించారు.

మూలాలు :

  1. ABN (2023-01-26). "ఏటికొప్పాక హస్త కళాకారుడు సీవీ రాజుకు పద్మశ్రీ". Andhrajyothy Telugu News. Retrieved 2023-09-03.
  2. "The President of India conferred Padma Shri to Dr. Sankurathri Chandrasekhar in field of Social Work, Shri ChintalapatiVenkatapathi Raju and Shri Kota SatchidanandaSastry in field of Art from Andhra Pradeshin Civil Investiture Ceremony". pib.gov.in. Retrieved 2023-09-03.
  3. Telugu, TV9 (2023-01-28). "Padma Shri: ఏటికొప్పాక బొమ్మలకు మళ్ళీ ప్రాణం పోసి.. దేశ విదేశాల్లో ప్రాచుర్యం తీసుకొచ్చిన సీవీ రాజుని వరించిన పద్మం." TV9 Telugu. Retrieved 2023-09-03.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "హస్త కళలకు జీవం.. వరించిన పద్మం". EENADU. Retrieved 2023-09-03.
  5. "padma awards 2023: విరబూసిన తెలుగు పద్మాలు". Sakshi Education. Retrieved 2023-09-03.
"https://te.wikipedia.org/w/index.php?title=సీవీ_రాజు&oldid=4079108" నుండి వెలికితీశారు