సుచరిత్ర రాగం
67వ మేళకర్త రాగం
సుచరిత్ర రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగము.[1][2] ఇది కర్ణాటక సంగీతంలోణి 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 67వ మేళకర్త రాగం. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "సంతాన మంజరి" అని పిలుస్తారు.[3][4]
రాగ లక్షణాలు
మార్చు- ఆరోహణ:స రి గ మ ప ధ ని స
- (S R3 G3 M2 P D1 N1 S)
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
- (S N1 D1 P M2 G3 R3 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : షట్‍శృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, శుద్ధ నిషాధం. ఈ సంపూర్ణ రాగం 31వ మేళకర్త రాగమైన యాగప్రియ రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు
మార్చు- చింతయామి సంతతం - బాలమురళికృష్ణ
- వేలు మాయీ - కోటేశ్వర అయ్యరు
- సంతాన మంజరి - ముత్తుస్వామి దీక్షితులు
మూలాలు
మార్చు- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
- ↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras