సుజాత మోహన్

భారతీయ నేపధ్య గాయకురాలు

సుజాత మోహన్, భారతీయ సినీ నేపధ్య గాయిని. ఆమె ఎక్కువగా మలయాళం, తమిళ సినిమాల్లో పాటలు పాడింది. కానీ ఆమె తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా పాటలు పాడింది. ఆమె దాదాపుగా 10,000కు పైగా పాటలు పాడింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5000 లైవ్ షోల్లో పాటలు పాడిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించింది సుజాత. మలయాళ సినిమాల్లో ఎక్కువగా పాటలు పాడటంతో మలయాళంలో మంచి గాయినిగా పేరొందింది.

సుజాత మోహన్

వ్యక్తిగత జీవితంసవరించు

భారతదేశ స్వతంత్రానంతరం ఏర్పాటైన ట్రావెన్ కోర్-కొచిన్ రాష్ట్ర ప్రధమ ముఖ్యమంత్రి పరూర్ టి.కె.నారాయణపిళ్ళే మనవరాలు సుజాత. 1981 మే 9న డాక్టర్ కృష్ణమోహన్ ను వివాహం చేసుకుంది ఆమె.[1] ఆమె ఏకైక కుమార్తె శ్వేత మోహన్ కూడా గాయిని కావడం విశేషం.

కెరీర్సవరించు

సుజాత తన 17వ ఏట నుంచీ, చదువుకుంటూనే కె.జె.ఏసుదాసు వంటి గాయకులతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్టేజిలపై షోలు చేసింది. ఆమె 6వ తరగతి చదివే సమయంలోనే కన్నెళుతీ పొట్టుతట్టు అనే సినిమా పాట పాడింది. 1975లో విడుదలైన మలయాళ సినిమా టూరిస్ట్ బంగ్లాలోని ఈ పాటకు ఎం.కె. అర్జునన్ సంగీత దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు శ్యాం చేసిన కామం క్రోధం మోహం, సలీల్ చౌదరీ స్వరపరిచిన అపరాధీ సినిమాల్లోని పాటలు పాడింది ఆమె. ఆ సమయంలోనే ఎం.జి.రాధాకృష్ణన్ ఎన్నో పాటలు పాడించాడు సుజాత చేత. అవన్నీ సినిమాలకు చెందని పాటలే. వాటిలో ఒడక్కుళల్ విలి అనే ఆల్బం అతి పెద్ద హిట్ అయింది.

మూలాలుసవరించు

  1. "Married to a singer". www.newindianexpress.com. 28 May 2012. Retrieved 2020-06-16.