సుజిత్ శంకర్ భారతదేశానికి చెందిన సినీ నటుడు, రంగస్థల నటుడు.[1] ఆయన 2009లో సినీరంగంలోకి అడుగుపెట్టి మలయాళ, తమిళ బాషా సినిమాలలో నటించాడు. సుజిత్ సోపానం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (1999-2002)లో కావలం నారాయణ పనికర్ వద్ద నటనలో శిక్షణ తీసుకొని ఆ తరువాత న్యూ ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (2002-2005)లో శిక్షణ పొందాడు. ఆయన అనురాధ కపూర్, అభిలాష్ పిళ్లై, ఖలేద్ త్యాబ్జీ, రాబిన్ దాస్, కీర్తి జైన్, ఎం.కె రైనా, సి.ఆర్. జాంబే, అనామికా హక్సర్, ఆదిల్ హుస్సేన్ వంటి వారి దగ్గర పని చేశాడు.[2]

సుజిత్ శంకర్
జాతీయత భారతీయుడు
విద్యాసంస్థనేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఢిల్లీ
జీవిత భాగస్వామిఅంజు మోహన్ దాస్
తల్లిదండ్రులు
  • ఈ.ఎం. శ్రీధరన్
  • డా.ఎం.పి. యమునా
బంధువులుఈ.ఎం.ఎస్. నంబూదిరిపద్
(తాత)

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2009 లాడ్లీ లైలా (ది వర్జిన్ మేక) అరంగేట్రం
2014 న్జాన్ స్టీవ్ లోపెజ్ హరి
2016 మహేశింటే ప్రతీకారం జిమ్సన్ అగస్టిన్
2017 ఎజ్రా రబ్బీ మార్క్స్
2017 C/O సైరా బాను సెబాస్టియన్
2017 కామ్రేడ్ ఇన్ అమెరికాలో మనోజ్
2017 హదియ్యా
2017 బంగారు నాణేలు
2018 అంకరాజ్యతే జిమ్మన్మార్ బెంజమిన్ లూకోస్
2018 ఈడ కారిపల్లి దినేశన్
2018 ఆభాసం అపరిచితుడు
2018 ఓరు కుప్రసిద పయ్యన్ ఎస్పీ సైమన్ జార్జ్
2019 నేర్కొండ పార్వై గవాస్కర్ తమిళ అరంగేట్రం
2019 మూతన్ లతీఫ్ ద్విభాషా (హిందీ, మలయాళం) [3]
2020 మహా తమిళం
2020 బగీరా తమిళం

మూలాలు

మార్చు
  1. Veethi (2022). "Sujith Shankar". Archived from the original on 22 July 2022. Retrieved 22 July 2022.
  2. The New Indian Express (17 August 2019). "I aim to haunt, not earn whistles: Actor Sujith Shankar". Archived from the original on 22 July 2022. Retrieved 22 July 2022.
  3. The Times of India (2 June 2017). "Nivin Pauly's Moothon will have Sujith Shankar in a pivotal role" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.