"సుడిగాలి " ఒక జాతీయ స్థాయి తెలుగు పక్ష పత్రిక. 1982 వ సంవత్సరంలో స్థాపించబడిన సుడిగాలి సంపాదక విషయాలు ఇక్కడ చర్చనీయాంశాలు.

సుడిగాలి అనే పేరు పెట్టడంలో గల ఉద్దేశం:

మార్చు

1980-82 సంవత్సరం మధ్య కాలంలో నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట పరిసర ప్రాంతాలు భారి తుఫాన్లు, వర్షాల బీభత్సంతో సుడిగాలులు ఎక్కువగా ఉండేవి. ఇటువంటి సమయంలో ప్రారంభించడం చేత, అదే రీతిలో నిజాన్ని నిర్భయంగా ప్రచురించేలా ఈ పత్రికను సంపాదకులు వాకిచర్ల మాధవరావు సుడిగాలి అని పేరు పెట్టారు.

ప్రారంభపు ఉద్దేశం

మార్చు

1967 వ సంవత్సరం నుండి రాజకీయాలలో నెల్లూరు జిల్లా స్థాయి నాయకునిగా గుర్తింపు పొందిన సంపాదకులు వాకిచర్ల మాధవరావు "రాజకీయాల ద్వారా ప్రజలకు చేసేది శూన్యం" అని తలచి రాజకీయాలకి అతీతంగా, ప్రజలకు చేరువ అవ్వాలని, తగిన రీతిన సేవ కార్యక్రమాలు చేపట్టాలని, తన అభిప్రాయాలను ప్రజలకు నేరుగా తెలపాలని సుడిగాలి పత్రికను ప్రారంభించారు. నాటి నుండి నేటికీ ఉచితంగా, నీతికి నిజాయితీకి మారు పేరైన పత్రికగా ప్రచురిస్తున్నారు.

స్థాపితం

మార్చు

1982 వ సంవత్సరం నవంబరు 1వ తేదిన ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుక రోజున నెల్లూరు జిల్లా, సూళ్ళూరుపేట, బాపూజీ వీధిలో కార్యాలయంను, పత్రికను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిదిగా నాటి మంత్రివర్యులు శ్రీ నల్లప రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీ నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు శ్రీ బెజవాడ పాపి రెడ్డి విచ్చేసి సుడిగాలి ఆవిర్భావంలో పాలు పంచుకున్నారు.

ప్రధమ వార్షికోత్సవం

మార్చు

అప్పటి మద్రాస్ నగరం (నేటి చెన్నై) లో సుడిగాలి పత్రిక ప్రథమ వార్షికోత్సవ సంచికను ప్రముఖ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణగారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది.

ప్రస్తుతం

మార్చు

ఇలా ఆవిర్భవించిన సుడిగాలి పత్రిక నేటి వరకు ఎటువంటి రాజకీయ వత్తిళ్ళకు తలొగ్గక, నిజాయితిగా, నిరాటంకంగా, అందరి పత్రికగా ఉచితంగా ప్రచురించబడుతోంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కూడా ఉపయోగపడే విభిన్న శీర్షికలతో సుడిగాలిని ప్రచురిస్తున్నారు.

కవిత హృదయమే కాక సుడిగాలి సేవాతత్పరతతో విద్యార్థులకు కావలసిన పుస్తకాలు, స్కాలర్ షిప్లు అందించి ఎందరికో ఆపన్నహస్తం అందించేరు. కులమత భేదం లేకుండా విద్య బుద్ధి గల పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. అంతేకాక కళాకారులను, మరెన్నో రంగాలలోని ప్రముఖులను వారి వారి నైపుణ్యాన్ని గుర్తించి సుడిగాలి అవార్డులతో సత్కరించడం జరిగింది.

ఇవేకాక దేవాలయాలకు, అనేక పాఠశాలలకు, అనేక సంస్థలకు విరాళాలు, స్థలాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది.

మరెన్నో కార్యక్రమాలలో ప్రజల చెంతన నిలచిన సుడిగాలి సేవలకు పత్రిక సంపాదకులు వాకిచర్ల మాధవరావుగారికి 1997 వ సంవత్సరంలో బెంగుళూరులో కర్ణాటక గవర్నర్ చే ఇందిరా సత్భావనా అవార్డును, 2000 వ సంవత్సరంలో ఆర్యవైశ్య మహాసభవారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిజేటి రోశయ్యగారిచే దానశీలా బిరుదును అందించారు. వీటితోపాటు స్థానికంగా, జిల్లా స్థాయిలో అనేక అవార్డులు, సత్కారాలు అందుకున్నారు.

ఇంతేకాక సుడిగాలి నిజాయితీని గుర్తించి నందున "ఆవేశం" సినిమాలో ప్రాణాలకు సైతం లెక్క చేయని విధంగా పోరాడే జర్నలిస్టు (రాజశేఖర్ హీరో) ప్రచురించే పత్రిక పేరు సుడిగాలి. ఈ విధంగా సినీస్థాయిలో గుర్తింపును కూడా సుడిగాలి పొందింది. ఈ చిత్రం అచ్చం సుడిగాలి సంపాదకవర్గ మనోభావాలను వ్యక్తపరచడం విశేషం.

"https://te.wikipedia.org/w/index.php?title=సుడిగాలి&oldid=2885907" నుండి వెలికితీశారు