సునీల్ చంద్రకాంత్ భూసార

సునీల్ చంద్రకాంత్ భూసార మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 మహారాష్ట్ర ఎన్నికలలో విక్రమ్‌గడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

సునీల్ చంద్రకాంత్ భూసార

పదవీ కాలం
2019 అక్టోబర్ 24 – 2024 నవంబర్ 23
ముందు విష్ణు సవారా
తరువాత భోయే హరిశ్చంద్ర సఖారం
నియోజకవర్గం విక్రమ్‌గడ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

సునీల్ చంద్రకాంత్ భూసార నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009, 2014 మహారాష్ట్ర ఎన్నికలలో విక్రమ్‌గడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2019 మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి విష్ణు సవారాపై 21399 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 88,425 ఓట్లతో విజేతగా నిలవగా, విష్ణు సవారాకు 67,026 ఓట్లు వచ్చాయి.[2]

సునీల్ చంద్రకాంత్ భూసార 2024 మహారాష్ట్ర ఎన్నికలలో విక్రమ్‌గడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భోయే హరిశ్చంద్ర సఖారం చేతిలో 41,408 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in English). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. "Maharastra Assembly Election Results 2024 - Vikramgad". Election Commission of India. 23 November 2024. Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  4. The Times of India (23 November 2024). "Vikramgad Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.