సున్నంలో సూక్ష్మం

సున్నంలో సూక్ష్మం లేక సూక్ష్మంలో మోక్షం అనే పదాలను తరచుగా ఉపయోగిస్తుంటారు. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి మెతుకులన్నింటిని చూడనవసరం లేదు ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. అలాగే ఒకరి యొక్క గుణగణాలను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నపు పరీక్షనే సున్నంలో సూక్షం అని, ఒక పని సులభంగా వేగంగా చేయడానికి కనిపెట్టిన ఉపాయాన్ని సూక్ష్మంలో మోక్షం అని అంటారు.

సున్నంలో సూక్ష్మం పద ఉద్భవ కథ

మార్చు

అమ్మాయి ఇంటికి పెళ్ళి చూపులకు వెళ్ళిన పెళ్ళి పెద్దలు భోజనాలు చేసినాక ఆకు వక్క తీసుకొని సున్నం పూయమని అమ్మాయిని అడుగుతారు. సున్నం తక్కువ పూసిన అమ్మాయి పొదుపు చేయగల అమ్మాయి అని కుటుంబాన్ని సాఫీగా నడపగలదని ఈ అమ్మాయి పెళ్ళికి యోగితురాలని, ఎక్కువ సున్నం పూసిన అమ్మాయి దుబారా చేస్తుందని పెళ్ళయిన తరువాత అతిగా దానధర్మాలు చేసి ఇంటిని గుల్ల చేస్తుందని తద్వారా కుటుంబం ఆధోగతి పాలవుతుందని అభిప్రాయపడేవారు.