సుభాష్ చంద్ర గోయెంకా

సుభాష్ చంద్ర గోయెంకా (ఆగ్లం: Subhash Chandra Goenka) ఒక భారతీయ బిలియనీర్ మీడియా బారన్. ప్రముఖ మీడియా సంస్థ జీ నెట్ వర్క్, ఎస్సెల్ గ్రూప్ అధినేత.[3]

సుభాష్ చంద్ర
పార్లమెంటు సభ్యుడు (భారతదేశం)
2018లో సుభాష్ చంద్ర
రాజ్యసభ సభ్యుడు[2]
Assumed office
2016 ఆగస్టు 2[1]
అంతకు ముందు వారుసురేష్ ప్రభు
నియోజకవర్గంహర్యానా
వ్యక్తిగత వివరాలు
జననం (1950-11-30) 1950 నవంబరు 30 (వయసు 74)
ఆడంపూర్, తూర్పు పంజాబ్, భారతదేశం ప్రస్తుతం ఆడంపూర్, హిసార్, హర్యానా, భారతదేశం
జాతీయతభారతీయుడు
జీవిత భాగస్వామిసుశీలా దేవి
సంతానంపునీత్ గోయెంకా
అమిత్ గోయెంకా
పూజా దీక్షిత్
నివాసంముంబయి, మహారాష్ట్ర
వృత్తిఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్
వెబ్‌సైట్

రాజస్థాన్ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు 2022 జూన్ 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుభాష్ చంద్ర భారతీయ జనతా పార్టీ నుండి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన 2016లో హర్యానా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.[4]

జీవిత ప్రస్థానం

మార్చు

హర్యానాలోని హిసార్ జిల్లా అడంపూర్‌లో 1950 నవంబరు 30న సుభాష్ చంద్ర జన్మించారు.[5] అతని కుటుంబానికి ₹ 3.5 లక్షల అప్పు ఉండేది, అతను తిరిగి చెల్లించాల్సి వచ్చింది. సుభాష్ చంద్ర ఉన్నత విద్యను అభ్యసించడానికి అతని కుటుంబానికి అర్దిక స్తోమత లేదు. 1965లో పాఠశాల చదువు మధ్యలో ఆపేసి కుటుంబ వ్యాపారంలో చేరాడు. కమీషన్ ఏజెంట్ గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు బియ్యం సేకరించి సరఫరా చేసేవాడు. 1980లలో సుభాష్ చంద్ర ఎస్సెల్ ప్యాకేజింగ్ బ్రాండ్ పేరుతో టూత్‌పేస్ట్ వంటి వేగంగా కదిలే వినియోగ వస్తువుల సౌకర్యవంతమైన ప్యాకేజింగ్ కోసమై ప్లాస్టిక్ ట్యూబ్‌లు తయారు చేయడం ప్రారంభించాడు. 1992లో సుభాష్ చంద్ర హాంకాంగ్‌లోని స్టార్ టీవీతో కలిసి దేశంలో రెండవ ప్రైవేట్ వాణిజ్య టెలివిజన్ ఛానెల్ అయిన జీ టీవీని ప్రారంభించాడు. 2003లో భారతదేశంలో మొదటి ఉపగ్రహ టెలివిజన్ ప్రొవైడర్ అయిన డిష్ టీవీని సుభాష్ చంద్ర ప్రారంభించాడు.[6][7]

గుర్తింపు

మార్చు
  • అంతర్జాతీయ ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డు (2011)[8]
  • కెనడా ఇండియా ఫౌండేషన్, చంచ్లానీ గ్లోబల్ ఇండియన్ అవార్డు[9]

మూలాలు

మార్చు
  1. "Dr Subhash Chandra takes oath as Rajya Sabha member". dnaindia.com. 4 August 2016.
  2. "Subhash Chandra wins RS seat as 12 Cong votes were rejected due to 'wrong pen'". Hindustan Times. 12 June 2016. Retrieved 13 June 2016.
  3. "Subhash Chandra steps down as Zee Media chairman". indiatimes.com. Archived from the original on 2016-08-19. Retrieved 2022-06-01.
  4. Mohan, Archis (June 2016). "Subhash Chandra bets on BJP support for Rajya Sabha entry". Business Standard India.
  5. "How Some Gather Silver In The Fog". Retrieved 27 February 2019.
  6. Khandekar, Vanitha Kohli (25 March 2015). "40 Years Ago... And now: Subhash Chandra's chutzpah shaped his media business". Business Standard. Retrieved 4 August 2015.
  7. "At The Zee Group, Son Punit Has Taken the Baton From Subhash Chandra". Forbes India.
  8. "Zee TV's Subhash Chandra to Receive Emmy Honor". The Hollywood Reporter. 6 January 2011. Retrieved 14 September 2013.
  9. "Dr Subhash Chandra to receive Canada India Foundation (CIF) Chanchlani Global Indian Award". Zee News. 3 February 2016. Retrieved 13 June 2016.