సుమిత్ ఆంటిల్‌ భారతదేశానికి చెందిన పారా అథ్లెట్స్‌ క్రీడాకారుడు. ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో బంగారు పతకం గెలిచాడు. పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన సుమిత్ ఆంటిల్‌కు హ‌ర్యానా ప్ర‌భుత్వం రూ .6 కోట్ల రివార్డుతో పాటు ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు హ‌ర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ ప్రకటించాడు.[2]

సుమిత్ ఆంటిల్
వ్యక్తిగత సమాచారం
జననం (1998-07-06) 1998 జూలై 6 (వయసు 26)
నివాసంహర్యానా
క్రీడ
దేశం భారతదేశం
క్రీడపారా -అథ్లెటిక్స్
వైకల్యం తరగతిటి 64
సాధించినవి, పతకాలు
పారాలింపిక్ ఫైనళ్ళుటోక్యో పారాలింపిక్స్‌
వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన(లు)WR 68.55 m (2021)[1]

క్రీడా జీవితం

మార్చు

సుమిత్‌ హర్యానా రాష్ట్రం సోన్‌పేట్‌ నిర్మల దేవి, రామ్ కుమార్ దంపతులకు జన్మించాడు. ఆయన 2015లో జరిగిన ఓ బైక్ ప్రమాదంలో ఎడమ కాలులో మోకాలు కింది భాగం పూర్తిగా కోల్పోయాడు. ఈ ప్రమాదం తర్వాత కొన్నాళ్లకు కోలుకున్న సుమిత్‌ , సోనేపట్‌లో ఒక పారా అథ్లెట్‌ను చూసిన అతనికి అథ్లెటిక్స్ పైన ఆసక్తి పెరిగింది. 2018 నుంచి జావెలిన్ త్రోను సీరియస్‌గా తీసుకొని 2019లో దుబాయ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో ఎఫ్-64 విభాగంలో రజత పతకం సాధించాడు. 2021లో పాటియాలాలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రీ సిరీస్ పోటీల్లో 66.43 మీట్ల దూరం విసిరి 7వ స్థానంలో నిలిచాడు.

వరల్డ్ రికార్డ్‌

మార్చు

సుమిత్ ఆంటిల్‌ టోక్యో పారాలింపిక్స్ లో 68.55 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్ లోనే మూడు ప్రపంచ రికార్డ్ లు సాధించాడు . మొదట 66.95 మీటర్ల దూరం విసిరి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. F64 కేటగిరీ మెన్స్‌ జావెలిన్ త్రో ఫైనల్‌లో మొత్తం ఐదు రౌండ్లలో మూడు సార్లు అందరి కంటే ఎక్కువ దూరం విసిరి ఒకే గేమ్ లో మూడు సార్లు వరల్డ్ రికార్డ్ సాధించాడు.[3][4]

అవార్డులు

మార్చు

సుమిత్‌ అంటిల్‌ 13 నవంబర్ 2021న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులమీదుగా ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డును అందుకున్నాడు.[5]

మూలాలు

మార్చు
  1. "Tokyo Paralympics: Sumit Antil Wins Javelin (F64) Gold, Sets New World Record". sports.ndtv.com. Retrieved 30 August 2021.
  2. Sakshi (4 September 2021). "పారాలింపిక్స్‌ పతకధారులకు రూ.10 కోట్ల భారీ నజరాన". Sakshi. Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  3. Eenadu (30 August 2021). "Tokyo Paralympics: భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం.. సుమిత్‌ మూడుసార్లు ప్రపంచ రికార్డు". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  4. V6 Velugu (30 August 2021). "పారాలింపిక్స్‌లో మరో గోల్డ్ మెడల్.. వరల్డ్ రికార్డ్‌ సృష్టించిన సుమిత్" (in ఇంగ్లీష్). Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Andrajyothy (14 November 2021). "'ఖేల్‌రత్న'లు నీరజ్‌, మిథాలీ". Archived from the original on 14 నవంబరు 2021. Retrieved 14 November 2021.