సురేష్ కడలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. చిత్రకారుడు, సినీ పోస్టర్ డిజైనర్.

సురేష్ కడలి
సురేష్ కడలి చిత్రకారుడు
జననం1964
నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా
ప్రసిద్ధిచిత్రకారుడు
భార్య / భర్తవిజయ
పిల్లలువిజయ దుర్గ, శివరామ కృష్ణ
తండ్రిముసలయ్య
తల్లివెంకట నరసమ్మ

ఇతను 1964లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి ముసలయ్య, తల్లి వెంకట నరసమ్మ.

చిత్రకళా ప్రస్థానం

మార్చు

పుట్టుకతోనే చిత్రకళను వరంగా పొందిన సురేష్ ఒకటవ తరగతి నుండే బొమ్మలు గీయడం ప్రారంభించాడు. కొడుకు ఆశక్తిని గుర్తించిన తల్లి నరసమ్మ స్థానిక కమర్షియల్ ఆర్టిస్ట్ మూర్తి దగ్గర పనిలో పెట్టింది. సినీరంగంలో ఎస్.ఎం. కేతా గారి దగ్గర కెరీర్ ప్రారంభించి, ఈశ్వర్, గంగాధర్ గార్ల శిష్యరికంలో సినీ పోస్టర్ డిజైనింగ్ లో మెళకువలు నేర్చుకొని సుమారు 300 సినిమాలకు సినీ పోస్టర్స్ డిజైన్ చేశారు. బాపు గారి దగ్గర 'శ్రీరామరాజ్యం' సినిమాకు కళాదర్శకత్వంలో పనిచేశారు. వేలాది పత్రికలకు, పుస్తకాలకు ముఖచిత్రాలు; కథలకు చిత్రాలు గీశారు.

పురస్కారాలు

మార్చు

ఇప్పటివరకు దాదాపుగా 500లకు పైగా పెయింటింగ్స్ వేసిన సురేష్ అనేక పురస్కారాలు అందుకున్నాడు.


ఇతర విషయాలు

మార్చు

చిన్నతనం నుంచే సామాజిక అంశాలపై అవగాహనతో పెరిగిన జగన్ బ్యాంక్ ఉద్యోగిగా ట్రైబల్ ఏరియాల్లో పనిచేసే సమయంలో గిరిజనుల జీవితాలను దగ్గర నుండి చూసి, స్పూర్తిని పొంది… ఒక చిత్రకారుడిగా తనకున్న ప్రతిభను ప్రాయోజిత చిత్రాలుగా మరల్చి జన జాగృతం చేశాడు. గిరిజనుల జీవితాలపై చిత్రకారులు, ఔత్సాహిక చిత్రకారులు చిత్రాలు గీయాలని, తద్వారా వారి జీవితాలను నాగరీకులకు అర్ధం అయ్యేలా చేసి గిరిజనుల సంక్షేమానికి పాటుపడ్డాడు.


మూలాలు

మార్చు

https://64kalalu.com/traibal-artist-bonda-jaganmohanrao/

వెలుపలి లంకెలు

మార్చు