సురేష్ గోర్
సురేష్ నామ్‌దేయో గోర్ (1965 - 10 అక్టోబర్ 2020) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఖేడ్ అలండి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
సురేష్ గోర్ | |||
పదవీ కాలం 2014 – 2019 అక్టోబర్ 24 | |||
ముందు | దిలీప్ మోహితే | ||
---|---|---|---|
తరువాత | దిలీప్ మోహితే | ||
నియోజకవర్గం | ఖేడ్ అలండి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1965 మహారాష్ట్ర | ||
మరణం | 2020 అక్టోబర్ 10 | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
ఇతర రాజకీయ పార్టీలు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | నామ్‌దేవ్ సోపానా గోరే | ||
జీవిత భాగస్వామి | మణిశతాయ్ గోర్ | ||
పూర్వ విద్యార్థి | బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ (B.com) నెస్ వాడియా కళాశాల | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుసురేష్ గోర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి చకన్ నుండి మూడుసార్లు పూణే జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎన్నికై పూణే జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన అనంతరం శివసేన పార్టీలో చేరి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఖేడ్ అలండి శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి దిలీప్ మోహితే పై 32718 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]
సురేష్ గోర్ 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఖేడ్ అలండి శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి దిలీప్ మోహితే చేతిలో 33,242 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మరణం
మార్చుసురేష్ గోర్ కోవిడ్-19 సోకి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తుల వ్యాధితో అనారోగ్యానికి గురై రూబీ ఆసుపత్రిలో 21 రోజులు చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2020 అక్టోబర్ 10న మరణించాడు. [4][5][6][7]
మూలాలు
మార్చు- ↑ "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ Abhay Khairnar (10 October 2020). "Former Sena MLA Suresh Gore passes away due to Covid-19". Hindustan Times. Archived from the original on 10 October 2020.
- ↑ TV9 Marathi (15 March 2023). "मोठा धक्का, माजी आमदाराच्या कुटुंबाने ठाकरे गटाची साथ सोडली; एकनाथ शिंदे यांच्यावर विश्वास" (in మరాఠీ). Archived from the original on 2 January 2025. Retrieved 2 January 2025.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Punemirror (10 October 2020). "Former Shiv Sena MLA Suresh Gore passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 2 January 2025. Retrieved 2 January 2025.
- ↑ "Former MLA dies of multi-organ failure". The Times of India. 11 October 2020. Archived from the original on 2 January 2025. Retrieved 2 January 2025.