సుశాంత సింగ్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భట్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి, కార్మిక & ఉద్యోగుల, రాష్ట్ర ఇన్సూరెన్స్ శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

సుశాంత సింగ్
సుశాంత సింగ్
జననం (1973-03-17) 1973 మార్చి 17 (వయసు 51)
బౌసెన్‌మోరా, ఒడిషా, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిరాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

సుశాంత సింగ్ భట్లీ నియోజకవర్గం నుండి 2009లో తొలిసారి బిజూ జనతా దళ్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో రెండోసారి, 2019లో మూడోసారి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] సుశాంత సింగ్ నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 29 మే 2019 న గ్రామీణాభివృద్ధి, కార్మిక & ఉద్యోగుల, రాష్ట్ర ఇన్సూరెన్స్ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.

మూలాలు మార్చు

  1. The Hindu (29 May 2019). "List of Ministers and their portfolios in Naveen Patnaik's Cabinet" (in Indian English). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. "Susanta Singh scores a hat-trick in Bhatli". 24 May 2019. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.