సూక్ష్మజీవుల ప్రవేశం


అంటు వ్యాధులలో కొన్ని ఒకరి నొకరు తాకుట చేతగాని, వ్యాధి గ్రస్తులుండు చోట్ల నివసించుట చేతగాని కలుగ వచ్చును. ఇందు కొన్నివ్యాధులను కలిగించు సూక్ష్మ జీవులు గల ద్రవమును రోగి నుండి ఎత్తి గాయము గుండ నైనను మరి ఏవిధము చేతనయినను మరియొకరి శరీరములోని కెక్కించిన యెడల రెండవ వారి కావ్యాధి పరిణమించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగు లుపయోగ పరచిన నీళ్ళు మొదలగు పదార్థముల మూలమున ఒకరి నుండి మరియొకరిని జేరును. అదేవిధంగా కొన్ని జంతువుల వలన కూడా అంటు వ్వాధులు వ్యాపించును. వీటినే అంటు వ్యాధులు అని అంటారు.

సూక్ష్మజీవు లెట్లు ప్రవేశించును? ఏట్లు విడుచును. మార్చు

అంటు వ్యాధులలో కొన్ని ఒకరి నొకరు తాకుట చేతగాని, వ్యాధి గ్రస్తులుండు చోట్ల సహవాసముగా నివసించుట చేతగాని కలుగ వచ్చును. ఇందు కొన్నివ్యాధులను కలిగించు సూక్ష్మ జీవులు గల ద్రవమును రోగి నుండి ఎత్తి గాయము గుండ నైనను మరి ఏవిధము చేతనయినను మరియొకరి శరీరములోని కెక్కించిన యెడల రెండవ వారి కావ్యాధి పరిణమించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగు లుపయోగ పరచిన నీళ్ళు మొదలగు పదార్థముల మూలమున ఒకరి నుండి మరియొకరిని జేరును. రోగులు విసర్జించు ఆహార పదార్థములు, మల మూత్రాదులు తట్టలును, రోగులు తాకిన చెంబులు మొదలగు పదార్థములును, రోగుల వద్ద నుండి సూక్ష్మ జీవులను వాని గ్రుడ్లను ఇతర స్థలములకు జేర వేయుటకు సహాయ పడును. ఇవి గాక కండ్ల కలక మొదలగు మరికొన్ని అంటు వ్యాధులు దోమలు ఈగలు నుసమలు మొదలగు జంతువుల మూలమున మన శరీరములో ప్రవేశించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగులు గల చోట్ల నివసించి నంత మాత్రముననే అంటు కొనును. మన శరీరములోని రక్తపైని వివరించిన అంటు వ్వాధులలో కొన్ని ఒకరి నొకరు తాకుట చేతగాని, వ్యాధి గ్రస్తులుండు చోట్ల సహవాసముగా నివసించుట చేతగాని కలుగ వచ్చును. ఇందు కొన్నివ్యాధులను కలిగించు సూక్ష్మ జీవులు గల ద్రవమును రోగి నుండి ఎత్తి గాయము గుండ నైనను మరి ఏవిధము చేతనయినను మరియొకరి శరీరములోని కెక్కించిన యెడల రెండవ వారి కావ్యాధి పరిణమించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగు లుపయోగ పరచిన నీళ్ళు మొదలగు పదార్థముల మూలమున ఒకరి నుండి మరియొకరిని జేరును. రోగులు విసర్జించు ఆహార పదార్థములు, మల మూత్రాదులు తట్టలును, రోగులు తాకిన చెంబులు మొదలగు పదార్థములును, రోగుల వద్ద నుండి సూక్ష్మ జీవులను వాని గ్రుడ్లను ఇతర స్థలములకు జేర వేయుటకు సహాయ పడును. ఇవి గాక కండ్ల కలక మొదలగు మరికొన్ని అంటు వ్యాధులు దోమలు ఈగలు నుసమలు మొదలగు జంతువుల మూలమున మన శరీరములో ప్రవేశించును. మరికొన్ని అంటు వ్యాధులు రోగులు గల చోట్ల నివసించి నంత మాత్రముననే అంటు కొనును. మన శరీరములోని రక్తములోనికి గాని, ఇతర ద్రవముల లోనికి గాని సూక్ష్మ జీవులు దిగువ నాలుగు

  • విధముల ప్రవేశ మగునని చెప్పవచ్చును.
  • గాయము గుండ ప్రవేశించుట (Inoculation)
  • పలుచని పొరల గుండ ఊరుట ( Absorbtion)
  • ఊపిరితో పీల్చుట (Inhalation )
  • మ్రింగుట (Ingestion )

కొన్ని వ్యాధులిందొక మార్గముననే ప్రవేశించును. మరి కొన్ని వ్యాధులు పైని చెప్పిన మార్గములలో రెండు మూడు మార్గముల ప్రవేశింప వచ్చును.

గాయము గుండ ప్రవేశించుట మార్చు

కుక్క కాటు వలన కలుగు వెర్రి, సుఖ వ్యాధులనబడు పచ్చ సెగ, అడ్డ గర్రల సంబంధమైన పుండు, కొరుకు లేక సవాయి, మేహము ఇవి యన్నియు శరీరము మీద నేర్పడు నేదో యొక గాయము మూలముననే తరుచుగ అంటుకొనును. చలి జ్వరపు పురుగులు దోమ కాటు వలన కలిగెడు గాయము గుండ నెత్తురులో ప్రవేశించును. దొమ్మ మొదలగు కొన్ని పశు రోగములును, క్షయము మొదలగు వ్వాధులు కూడా అరుదుగ గాయముల మార్గమున మన శరీరములో ప్రవేశము గనుట ఉంది. ధనుర్వాయువు అనగా దవడలు దగ్గరగా కరుచుకొని పోయి అతి శీఘ్ర కాలములో చంపు నొక వ్యాధియు నొక జాతి సూక్ష్మ జీవులు గాయములోనికి మన్నుతో కూడా జేరుటచే గలుగు చున్నది. కురుపులలో చీము పుట్టించు సూక్ష్మ జీవులు తరుచుగా గాయముల మూలముననే మన శరీరములో ప్రవేశించును.

పలుచని పొరల గుండ ఊరుట. మార్చు

పైని చెప్పిన పచ్చ సెగ మొదలగు సుఖ వ్యాధులు ఒకానొకప్పుడు రోగుల అంగముల మీద గాయములు లేక పోయినను ఆ యంగముల పైనుండు మృదువైన పలుచని పొరగుండ శరీరములోనికి సూక్ష్మ జీవులు ఊరుట వలన కలుగవచ్చును. చీము పుట్టించు సూక్ష్మ జీవులు గర్భ కుహరము లోనికి ప్రవేశించి నెత్తురు లోనికి చేరుట చేతనే ప్రసవమైన స్త్రీలకు సూతిక జ్వరము గలుగు చున్నది. ఇదే ప్రకారము కన్నుల నావరించి యుండు పలుచని సూక్ష్మ జీవులు ప్రవేశించి యవి కంటి నాశ్రయించి యుండుట చే కండ్ల కలక కలుగు చున్నది. ముక్కు లోని పొరను సూక్ష్మ జీవులంటినపుడు పడిశమును, గొంతుక లోనికి గాని ఊపిరి తిత్తులలోని గాని పొరలను సూక్ష్మ జీవు లంటి నపుడు దగ్గును కఫమును కలుగు చున్నవి.

ఊపిరితో పీల్చుట: మార్చు

ఆటలమ్మ, మశూచకము, వేప పువ్వు లేక చిన్నమ్మ, గవదలు, కోరింత దగ్గు, ఈ వ్యాధులు గాలితో పాటు ఆయా జాతుల సూక్ష్మ జీవులను పీల్చుట చేతనే కలుగు చున్నవి. పుట్టించు న్యూమోనియా (poneumonia ) ఇట్లే ప్రవేశించు చున్నది. దగ్గు పడిశము, కండలలోనూ కీళ్ళ లోను నొప్పులు మొదలగు వానితో కూడి వచ్చు ఇంప్లూయంజా, డెంగ్యూ యను జ్వరములును ఆయా జాతి సూక్ష్మ జీవులను మనము ఆఘ్రాణించుట చేతనే కలుగుచున్నవి. కలరా, సన్ని పాత జ్వరము, ఇవి యెన్నడో కాని, గాలి మూలమున వచ్చినట్లు కాన రాదు. ఇంత వరకు చలి జ్వరము కూడా మన్యపు గాలిని పీల్చుట వలన వచ్చునని తలచిరి గాని ఈ వ్యాధి దోమ కాటు మూలమున వ్యాపిత మగు చున్నదని ఇప్పుడందరి వైద్యులకు నమ్మకము.

మ్రింగుట. మార్చు

కలరా, సన్ని పాత జ్వరము, (28 దినముల జ్వరము) రక్త గ్రహిణి, ఇవి మనము తిను ఆహారము నందును నీరు నందును గల సూక్ష్మ జీవులచే కలుగు చున్నవని చెప్పవచ్చును. అతిసార విరేచనములలో గూడ కొన్ని జాతులు ఆహారము లోని సూక్ష్మ జీవుల కారణముననే కలుగు చున్నవి. రోగులను తాకిన చేతులలో అన్నము తినుట చేత గాని, రోగుల మల మూత్రములతో కల్మషమైన చెరువులలోని నీటిని త్రాగుట చేత గాని ఈ వ్యాధులు వ్యాపించు చున్నవి. క్షయ వ్యాధిగల ఆవుల పాల గుండ చిన్న బిడ్డలకా క్షయ వ్యాధి అంటు చుండును. దీని వలన క్షయ సంబందమైన అతి సార విరేచనములు మొదలగునవి కలుగును. సూక్ష్మ జీవులు చక్కగ పెరుగుటకు పాలకంటె వానికి తగిన ఆహారము లేదు. పాలలో పడిన సూక్ష్మ జీవులు మిక్కిలి త్వరితముగను యదేచ్ఛముగను వృద్ధి పొందును. సన్ని పాత జ్వరము, కలరా వ్వాధులు కూడా పాల మూలమున తరుచుగ వృద్ధి జెందును. క్షయ వ్యాధి మొదలగు మరి కొన్ని వ్యాధులు చక్కగ నుడకని జబ్బు మాంసము మూలమున కూడా వ్యాపింప వచ్చును.

జంతువుల వలన. మార్చు

ఈగలు అంటు వ్యాధులను వ్యాపింప జేయుటలో ఎంత సహకారులగునో అందరకు తెలియదు. అవి చేయు అపకారమున కింతింతని మితి లేదు. దోమల మూలమున చలి జ్వరము ఎంత విచ్చల విడిగ మనదేశములో వ్వాపించు చున్నదో మీకందరకు విదితమే. మన దుస్తులతో నొక యింటి నుండి మరి యొక యింటికి మనమెట్లు అంటు వ్యాధులను జేర వేయుదుమో అంత కంటే అనేక రెట్లు కుక్కలను, పిల్లులును అంటు వ్యాధులను ఇంటింటికి వాని శరీరముల నుండి జేరవేయును.

సూక్ష్మ జీవులెట్లు మనలను విడచును? మార్చు

అంటు వ్యాధులను కలుగ జేయు సూక్ష్మ జీవులు మన శరీరము నుండి బయటకు ఎట్లు పోవునో కూడా నిప్పుడు సంగ్రహముగ తెలిసికొనుట యుక్తము. 1. నోరు, కండ్లు, ముక్కు, ఊపిరి తిత్తులు వీనిలో నుండి బయట బడు ఉమ్మి, పుసి, చీమిడి, కఫము వీని మూలమునను, 2. విరేచనముల మూలమునను, 3. మూత్రము మూలమునను, 4. పుండ్లు, కురుపులు, మొదలగు వాని నుండి బయలు వెడలు రసి, చీము మూలమునను, వాని నుండి ఎండి పడిపోవు పక్కుల మూలమునను, సూక్ష్మ జీవులు మన శరీరములను విడిచి బయలు వెడలును. ముఖ్యముగా ఆటలమ్మను కలిగించు సూక్ష్మ జీవులు కొంచెము జలుబు తగ్గిన తరువాత వెడలు కఫము గుండ బయలు వెడలి గాలిలో పోయి ఇతరులకు అంటుకొనునని జ్ఞాపక ముంచుకొనదగినది. అంటు వ్యాధులచే బాధింప బడు రోగులు విడుచు ఊపిరి గుండ కూడా సూక్ష్మ జీవులు బయలు వెడలి, ఇతరులకు వ్యాధి కలిగించు నేమోయను సందేహము ఉంది. కాని ఆవిషయము నిశ్చయముగా తెలియదు.

మూలాలు మార్చు

అంటువ్యాధులు రచయిత ఆచంట లక్ష్మీపతి అను గ్రంథమునుండి గ్రహింప బడినది