ఉగ్రశ్రవసుడు

(సూతుడు నుండి దారిమార్పు చెందింది)

ఉగ్రశ్రవసుడు రోభారతం మొత్తం సూతుడికి, శౌనకాది మునులకు జరిగిన సంభాషణ లాగా చెప్పబడుతుందిమహర్షణుని కొడుకు. సూతకులజుడు. ఇతఁడు శౌనకాది మహర్షులకు సకలపురాణేతిహాసములు చెప్పినవాడు.

ఇతఁడు నైమిశారణ్యవాసులగు మహామునులవలన బ్రహ్మాసనంబు పడసి పురాణములు చెప్పుచుండఁగా అచ్చటికి తీర్థయాత్రచేయుచు బలరాముడు వచ్చి తన్నుచూచి ప్రత్యుత్థానము చేయక కూర్చుండియున్న యీతనిపై కోపించి తన చేతి దర్భలతో గొంతుకోసి చంపి బ్రహ్మాసనస్థుడు అగుటచేత లేవకున్నవాడు కావున ఇతనిని చంపుట పాతకంబు ఇందులకు ప్రతిక్రియ విచారింపుము అని మునులు తన్ను వేడుకొనఁగా మరల బ్రదికించి వారిచే మన్నన పడిసి చనియెను.

మూలాలుసవరించు

పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య)