సూది
సూది (ఆంగ్లం: Needle) ఒక చిన్న పరికరం. ఇవి సన్నగా మొనదేలి, వివిధ పరిమాణాలలో ఉంటాయి. కుట్టుపనిలోను, శస్త్రచికిత్సలో ఉపయోగించే సూదులకు ఒకవైపు దారం ఎక్కించడానికి చిన్న రంధ్రం ఉంటుంది.
సూదులలో రకాలు
మార్చు- తిన్నటి సూది
- వంపు తిరిగిన సూది
- పెద్ద సూది
- పలక సూది
- గుండు సూది
- పిన్నీసు
- దబ్బలం
ఉపయోగాలు
మార్చుకుట్టుపనిలో
మార్చు- బట్టలు, తోలు మొదలైనవి కుట్టడానికి ప్రత్యేకమైన కుట్టుమిషను ఉపయోగించి సూదులతో కుడతారు.
- చాలా పదార్ధాలను రవాణా చెయ్యడానికి సంచులలో వేసి దబ్బలం (పెద్ద సూది) తో కుడతారు.
వైద్యంలో
మార్చు- ఆకుపంక్చర్, ఒకరకమైన నొప్పిని తగ్గించే చైనా వైద్య చికిత్సలో సూదులుపయోగిస్తారు.
- ఇంజక్షన్ ద్వారా మన శరీరంలోనికి మందులు ఎక్కించడాన్ని సూదిమందు అంటారు.
- శస్త్రచికిత్సలో కోసిన శరీర భాగాల్ని తిరిగి కుట్టడానికి వివిధ రకాల సూదుల్ని వాడతారు.
నొప్పించని సూది
మార్చుచర్మంలో కలిసిపోయే సూదులు శాస్త్రవేత్తలు రూపొందించారు. దీన్ని చర్మానికి అతికించుకుంటే చాలు ఔషధం లోనికి వెళ్తుంది. దీంట్లో సూదులు కొన్ని వందలుంటాయి. అవన్నీ అత్యంత సూక్ష్మంగా శరీరంలో గుచ్చుకున్నా నొప్పి తెలియని విధంగా ఉంటాయి. ఔషధంతోపాటు ఈ సూదులు కూడా చర్మంలో కరిగిపోతాయి.
ఇతరత్రా
మార్చు- పువ్వులు, ఆకులు, పూసలు, మొదలైనవి హారంగా గుచ్చడానికి సూది, దారం వాడతారు.
- పచ్చబొట్లు పొడవడానికి ప్రత్యేకమైన సూదులు ఉపయోగిస్తారు.
- శరీరంలోని వివిధ భాగాలకు సూదులతో రంధ్రాలు చేసి ముక్కుపుడక, చెవిరింగులు వంటి కొన్ని ఆభరణాలు ధరిస్తారు.
- గ్రామోఫోన్ రికార్డుల్ని ఉపయోగించడానికి కొన్ని సూదుల్ని వాడేవారు.