సూపర్ స్కెచ్ 2018లో విడుదలైన తెలుగు సినిమా. యు అండ్ ఐ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో ఫిల్మ్ అకాడ‌మీ స‌హ‌కారంతో శ్రీ శుక్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎ. పద్మనాభరెడ్డి , బ‌ల‌రామ్ మ‌క్క‌ల‌ నిర్మించిన ఈ సినిమాకు ర‌విచావ‌లి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా టీజ‌ర్‌ను 6 ఏప్రిల్ 2018న త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ విడుదల చేశాడు.[2] నర్సింగ్ మక్కల, ఇంద్ర, సమీర్ దత్త, కార్తీక్ రెడ్డి, రేయాన్ రాహుల్(సయ్యద్ సోహైల్), చక్రి మాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 29, 2018న విడుదలైంది.[3]

సూపర్ స్కెచ్
దర్శకత్వంర‌విచావ‌లి
రచనర‌విచావ‌లి
నిర్మాతఎ. పద్మనాభరెడ్డి , బ‌ల‌రామ్ మ‌క్క‌ల‌
తారాగణంన‌ర్సింగ్ మ‌క్క‌ల‌, ఇంద్ర‌, స‌మీర్ ద‌త్త‌
ఛాయాగ్రహణంసురేంద్ర రెడ్డి.టి
కూర్పుజునైద్ సిద్ధిఖీ
సంగీతంకార్తీక్ కొడ‌కండ్ల‌
నిర్మాణ
సంస్థ
శ్రీ శుక్ర క్రియేష‌న్స్
విడుదల తేదీ
2018 జూన్ 29 (2018-06-29) [1]
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

ఏడుగురు మిత్రులు కలిసి విదేశీ అమ్మాయి (స్టెల్లా)ను అదే గ్రూప్ కు చెందిన నలుగురు అబ్బాయిలు అత్యాచారం చేసి చంపేయాలనుకుంటారు. ఆ నలుగురిలో వశి దానికి ముందే మర్డర్ వారి మీదకు రాకుండా స్కెచ్ వేస్తాడు. నలుగురు కలిసి స్టెల్లా ను అత్యాచారం చేసే క్రమంలో ఆమె ఎదురు తిరిగుతుంది. దాంతో స్టెల్లా కు డ్రగ్స్ ఇస్తారు అది ఓవర్ డోస్ అయ్యి ఆమె చనిపోతుంది. ఈ సమయంలో ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ లోని మరో అమ్మాయి ప్రగ్య, స్టెల్లా ఇంటికి వస్తుంది . ఆమెను కూడా హత్యా చేయాలని ఆమెను తరుముతుంటే యాక్క్సిడెంట్ అయ్యి ఆమె కోమాలోకి వెళ్ళుతుంది. స్టెల్లా మృతి ఫై అనుమానం తో ఆమె తండ్రి పోలీస్ ఆఫీసర్ అయినా నాయక్ (న‌ర్సింగ్ మ‌క్క‌ల‌) ను ఆశ్రయిస్తాడు. ఆ తరువాత నాయక్ ఆ నలుగురిని ఆధారాలతో ఎలా పట్టుకునాడు అనేదే మిగితా సినిమా కథ.

నటీనటులు మార్చు

  • న‌ర్సింగ్ మ‌క్క‌ల‌
  • ఇంద్రసేనా
  • స‌మీర్ ద‌త్త‌
  • కార్తీక్ రెడ్డి
  • రేయాన్ రాహుల్(సయ్యద్ సోహైల్)
  • చ‌క్రి మాగంటి
  • సోఫియా(కాలిఫోర్నియా)
  • అనిల్‌
  • శుభాంగి
  • గ్యారిటోన్‌ టోను (ఇంగ్లాండు)
  • బంగార్రాజు
  • బాబా

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: శ్రీ శుక్ర క్రియేష‌న్స్
  • నిర్మాత: ఎ. పద్మనాభరెడ్డి , బ‌ల‌రామ్ మ‌క్క‌ల‌
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: ర‌విచావ‌లి
  • సంగీతం: కార్తీక్ కొడ‌కండ్ల‌
  • సినిమాటోగ్రఫీ:సురేంద్ర రెడ్డి.టి
  • ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధిఖీ
  • డాన్స్‌: పోలాకి విజ‌య్‌
  • స్టంట్స్‌: జాషువా, రామ‌కృష్ణ‌

మూలాలు మార్చు

  1. The Times of India (29 June 2018). "Super Sketch Movie: Showtimes". Archived from the original on 20 సెప్టెంబరు 2021. Retrieved 20 September 2021.
  2. IndiaGlitz (6 April 2018). "'సూపర్ స్కెచ్' సినిమా ఘనవిజయం సాధించాలి - తలసాని శ్రీనివాసయాదవ్". Archived from the original on 20 సెప్టెంబరు 2021. Retrieved 20 September 2021.
  3. Zee News Telugu (26 June 2018). "ఫ్రైడే రిలీజ్ - ఒకేరోజు 9 సినిమాలు విడుదల". Archived from the original on 20 సెప్టెంబరు 2021. Retrieved 20 September 2021.