సూరి సీతారాం గోవా విముక్తికై ప్రాణాలర్పించిన ఆధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి. భారతదేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వచ్చినప్పటికీ, గోవా, డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీ వంటి కొన్ని ప్రాంతాలు పోర్చుగీసువారి అధీనంలో ఉండేవి. 1961 డిసెంబరు 19న ఆ ప్రాంతాలను పోర్చుగీసువారి నుండి విముక్తి లభించింది. తన 18 యేళ్ల వయస్సులో అతను గోవా స్వాతంత్ర్యం కోసం పోరాడి దేశం కోసం తన ప్రాణాలర్పించాడు.[1]

జీవిత విశేషాలు మార్చు

సూరి సీతారాం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన ఉయ్యూరులో 1937 జూలై 10న జన్మించాడు. ఇంటర్మీటియట్ వరకు స్థానికంగా చదివాడు[2].

స్వాతంత్ర్య పోరాటంలో మార్చు

భారతదేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వచ్చినప్పటికీ నిజంగా భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం రాలేదు. అనేక ప్రాంతాలు మన అధీనంలోకి రాలేదు. జాం బానిసత్వంలో ఉన్న హైదరాబాదు సంస్థానం సర్దార్ పటేల్ వలన 1948 సెప్టెంబరు 17న విలీనం అయింది. 1960 వరకు పాండిచ్చేరి, మాహె, యానాం, కరైకాల్, బెంగాల్ లోని చందానగర్ లు ఫ్రెంచి వారి ఆధీనంలో ఉండేవి. కొన్ని ఒప్పందాలతో విలీనం చేసుకోవడం జరిగింది, అలాగే గోవా, డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీ ప్రాంతాలు పోర్చుగీసు వారి ఆధీనంలో ఉండేవి. 1961 డిసెంబరు 19 లో వీటికి పోర్చుగీస్ వారి నుండి విముక్తి లభించింది. ప్రెంచి వారు ఎదోరకంగా విలీనం చేసినప్పటికీ పోర్చుగీసు వారు మాత్రం  గోవా ప్రజలను బానిసత్వంలో ఉంచి నరక యాతనలు పెట్టేవారు. అలాంటి సమయంలో ఒక సత్యాగ్రహం మొదలయ్యింది. 1954 జూన్ లో కొంత మంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అలాగే అనేక మంది దేశ భక్తులు ఎలాగైనా సరే గోవాని భారతమాత దాస్య శృంఖలాల నుండి విముక్తి సాధించడానికి ఒక కవాతు నిర్వహించాలి అని నిర్ణయించారు. ఆ కవాతు 1955 1955 ఆగస్టు నాటికి పూర్తయి గోవా విముక్తి సాధించడం దాని లక్ష్యం.

ఈ విషయం తెలిసిన అనేకమంది దేశ భక్తులు గోవాకి పయనమయ్యారు, అదే సమయంలో 18యేండ్ల సూరి సీతారాం కూడా తన 15మంది మిత్రులతో పాటు బయలుదేరాడు. ఆ కాలంలో విజయవాడ నుండి గోవాకి ఒక రైలు ఉండేది. గోవా విముక్తికై సీతారాం, వారి మిత్రులు తమ తల్లిదండ్రులకు సమాచారమివ్వకుండా ఆ రైలులో దేశ భక్తి గీతాలు పాడుకుంటూ బయలుదేరారు. ఈ బృందానికి సీతారాం నాయకత్వం వహించాడు. గోవాలో సత్యా గ్రహం మొదలయ్యింది. అప్పటికే ఎక్కడికక్కడ పోర్చూగీస్ సైన్యం దేశ భక్తులను చల్లా చెదురు చేసే పనిలో బస్సులను, రైళ్ళను గోవా వైపు రాకుండా ఆపేశారు. అలాగే గోవా ప్రజలను భయ బ్రాంతులకు గురిచేశారు. ఆ దుర్మార్గానికి జడిసి కొంతమంది మద్యలోనే ఆగిపోయారు. కానీ సూరి సీతారాం, తన మిత్రులు మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. మధ్యలో కొంత మంది దేశ భక్తులు వారికి జతయ్యారు. కానీ రైళ్ళు ఆపడం వలన రైలు పట్టాలనే మార్గంగా ఎంచుకుని ఒక నూటయాబై మంది పైబడి యువకులు పట్టాల మీద వేగంగా నడుస్తూ ఆగస్టు 15 కి గోవా దగ్గరకు చేరుకున్నారు.

ప్రాణ త్యాగం మార్చు

రైళ్ళ పట్టాల వెంట నడిచి కాళ్ళు పగిలి అలాగే అలసటకు గురైన సూరి సీతారాం మిత్ర బృందం ఒకచోట పోర్చుగీస్ సైన్యం కంటపడ్డారు. వాళ్ళు వెంటనే తుపాకులతో కాల్చడం మొదలు పెట్టారు. అప్పటి వరకు ఉన్న చాలా మంది మిత్రులు భయ భ్రాంతికి గురై పక్కకు వెళ్ళిపోయారు, దాక్కుకున్నారు. కానీ వారి కాల్పులను నిరసిస్తూ చాతీని చూపిస్తూ మన సూరి ముందుకెళ్ళాడు. కాని ఆ దుర్మార్గులు తూటా మీద తూటా ఎక్కుపెట్టి సీతారాం గుండెల్లో పదుల్లో బుల్లెట్లు కాల్చారు. కాల్పులలో సీతారాం మరణించాడు. అధికారిక లెక్కల ప్రకారం ఈ పోరాటంలో 20మంది మాత్రమే మరణించినట్లు పోర్చుగీసు వాళ్లు చెబుతున్నప్పటికీ, 150 మంది పోరాట యోధులు మరణించారు. జలియన్ వాలా భాగ్ మారణాకాండ తరువాత స్వాతంత్ర్యం కోసం అత్యధిక మంది చనిపోవడం ఇదే.[3]

సూరి సీతారాంని చనిపోయిన తరువాత ఆ శవం దొరికితే పెద్ద దావానలంలా ఉధ్యమం పెరిగిపోతుందని, కిరోసినతో కాల్చి కనీసం శరీరం కూడా దొరకకుండా చేశారు. ఇది కళ్ళారా చూసిన సీతారం మిత్రులు తండ్రి సూరి శోభనా చలపతికి, అలాగే గోవా స్వాతంత్ర్య విముక్తి సమితికి వెల్లడించారు.

స్మారకం మార్చు

ఉయ్యూరులో సూరి జ్ఞాపకార్దం ఒక ట్రస్టు ఎర్ఫాటు చేశారు. సూరి ట్రస్టు సభ్యులు అతని విగ్రహం కట్టించారు. గోవా స్వాతంత్ర్య వీరుల మ్యుజియంలో, ఎర్రకొటలో కూడా సూరి చిత్రపటం ఉంది.

మూలాలు మార్చు

  1. "గోవా విముక్తి కై ప్రాణలర్పించిన 18 ఏళ్ళ ఆంధ్రా యువ కిషోరం - సూరి సీతారం - About Suuri Seetaaram - Suri Sitaram Uyyuru". Retrieved 2020-04-02.
  2. Srikrishan 'Sarala' (1999-01-01). Indian Revolutionaries 1757-1961 (Vol-5): A Comprehensive Study, 1757-1961 (in ఇంగ్లీష్). Prabhat Prakashan. ISBN 978-81-87100-20-1.
  3. MANNAMweb. "గోవా విముక్తి కై ప్రాణలర్పించిన 18 ఏళ్ళ ఆంధ్రా యువ కిషోరం - సూరి సీతారం - About Suuri Seetaaram - Suri Sitaram Uyyuru". Archived from the original on 2021-08-01. Retrieved 2020-04-02.

బాహ్య లంకెలు మార్చు