సూర్యకాంతం (రాగం)
17వ మేళకర్త రాగం
(సూర్యకాంతం రాగం నుండి దారిమార్పు చెందింది)
సూర్యకాంతం కర్ణాటక సంగీతంలోని ఒక రాగము. ఇది కర్ణాటక సంగీత వ్యవస్థలోని 72 మేళకర్త రాగాలలో 17వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాని "ఛాయావతి" అని పిలుస్తారు. [2][3]
రాగ లక్షణాలు
మార్చు- ఆరోహణ : స రిగా మ ప ధని స
- (S R1 G3 M1 P D2 N3 S)
- అవరోహణ : సని ధ ప మగా రి స
- (S N3 D2 P M1 G3 R1 S)
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ ఋషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి ధైవతము, కాకలి నిషాధము). ఇది 53 వ మేళకర్త రాగమైన గమనశ్రమకి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు
మార్చు- ముద్దుమోము ఎలాగో - త్యాగరాజ స్వామి
- శ్రీ సాంబశివయ్య - ముత్తయ్య భాగవతార్
- తక్కువేమి మనకు ... : భద్రాచల రామదాసు
- కనవో నినైవో.... : కోటేశ్వర అయ్యర్
సూర్యకాంతం జన్యరాగాలు
మార్చుసూర్యకాంతం లోని కొన్ని జన్య రాగాలు : వసంత, సౌరాష్ట్రం, భైరవం.