సూర్య నమస్కారాలు


యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారములు. బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తారు. ఈ శ్లోకాలను వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో పఠించ వచ్చు.

సూర్య నమస్కారాలలోని 12 ఆసనాల శిల్పం, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూఢిల్లీ.
హస్త ఉత్తానాసనం: సూర్య నమస్కారాలలో

మంత్రాలు

మార్చు

సూర్య నమస్కారాలలో 12 మంత్రాలు ఉన్నాయి.

మంత్రం చక్రం
బీజం వందనం
1 ఓం హ్రాం (ॐ ह्रां) ఓం మిత్రాయ నమ: (ॐ मित्रा नमः) అనహత
2 ఓం హ్రీం (ॐ ह्रीं) ఓం రవయే నమః (ॐ रवये नमः) విశుద్ది
3 ఓం హృం (ॐ ह्रूं) ఓం సూర్యాయ నమః (ॐ सूर्याय नमः) స్వాదిష్టాన
4 ఓం హ్రైం (ॐ ह्रैं) ఓం భానవే నమః (ॐ wभानवे नमः) ఆజ్ఞ
5 ఓం హ్రౌం (ॐ ह्रौं) ఓం ఖగాయ నమః (ॐ खगाय नमः) విశుద్ది
6 ఓం హ్రా: (ॐ ह्रः) ఓం పూష్ణే నమః (ॐ पूष्णे नमः) మణిపుర
7 ఓం హ్రాం (ॐ ह्रां) ఓం హిరణ్యగర్భాయ నమః (ॐ हिरण्यगर्भाय नमः) స్వాదిష్టాన
8 ఓం హ్రీం (ॐ ह्रीं) ఓం మరీచయే నమః (ॐ मरीचये नमः) విశుద్ది
9 ఓం హృం (ॐ ह्रूं) ఓం ఆదిత్యాయ నమః (ॐ आदित्याय नमः) ఆజ్ఞ
10 ఓం హ్రైం (ॐ ह्रैं) ఓం సవిత్రే నమః (ॐ सवित्रे नमः) స్వాదిష్టాన
11 ఓం హ్రౌం (ॐ ह्रौं) ఓం అర్కాయ నమః (ॐ अर्काय नमः) విశుద్ది
12 ఓం హ్రా: (ॐ ह्रः) ఓం భాస్కరాయ నమః (ॐ भास्कराय नमः) అనహత

సూర్యోదయం వేళలో సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చెయ్యాలి.

ఉపయోగాలు

మార్చు

సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది. నడుం సన్నబడుతుంది. ఛాతీ వికసిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. శ్వాస పై ధ్యాస,వేదాత్మక ప్రార్థనలు వంటి వాటితో ఈ ప్రక్రియలను జోడించాలి. శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజ సిద్ధంగా తొలగించగల ప్రక్రియలివి [1]

పద్ధతి

మార్చు
ఆసనం శ్వాస చిత్రం
1 నమస్కారాసనం
సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి. సూర్య నమస్కారాలు నిటారుగా ప్రార్థనా భంగిమలో నిలుచుని ఉండాలి. రెండు పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి. కొద్ది నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసలను ( inhale – exhale) చేయాలి.
నిశ్వాస  
2 హస్త ఉత్తానాసనం
శ్వాస లోనికి పీలుస్తూ రెండు చేతులను పైకెత్తి వీపు వైపుకు వెనుకకు వంచాలి. ప్రారంభదశలో ఉన్న సాధకులైతే కొద్దిగాను, చాలాకాలంగా అభ్యసిస్తున్న వారైతే గాఢంగాను ఊపిరి పీల్చుకోవాలి కాళ్ళు వంచకూడదు.
ఉఛ్ఛ్వాశ  
3 పాదహస్తాసనం
శ్వాసను వదులుతూ ముందుకు వంగి రెండు చేతులను నేలపై ఆన్చాలి. రెండు చేతులను నేలపై ఆన్చలేని పక్షంలో మోకాళ్ళను వంచి చేతులను పాదాలకు ఇరుపక్కలా ఉంచాలి. తల తొడలను చూస్తున్నట్లు ఉండాలిమెడ కింద వైపు వేలాడేలాగా ఉంచాలి. పైకి చూడకూడదు .అలా కానిచో మెడ పట్టేసే ప్రమాదముంది.
నిశ్వాస  
4 ఆంజనేయాసనం
ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.
ఉఛ్ఛ్వాశ దస్త్రం:Students doing yoga.jpg
5 పర్వతాసనం
కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.
నిశ్వాస
6 సాష్టాంగ నమస్కారం
ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి 'అష్టాంగ నమస్కారం' అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము, గడ్డం - ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.
శ్వాస పట్టి ఉంచాలి  
7 సర్పాసనం
శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.
ఉఛ్ఛ్వాశ  
8 పర్వతాసనం
ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.
నిశ్వాస  
9 ఆంజనేయాసనం
నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి
ఉఛ్ఛ్వాశ దస్త్రం:Students doing yoga.jpg
10 పాదహస్తాసనం
మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.(Standing Forward Bend pose)
నిశ్వాస  
11 హస్త ఉత్తానాసనం
రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.
ఉఛ్ఛ్వాశ  
12 నమస్కారాసనం
నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి
నిశ్వాస  

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-19. Retrieved 2015-02-02.