సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిబిఐ) Central Bank of India (CBI) ఒక భారతీయ జాతీయ బ్యాంకు. భారతదేశంలో 1911 సంవత్సరంలో , దేశ స్వాతంత్ర్య పూర్వ, అతిపెద్ద జాతీయ వాణిజ్య బ్యాంకులలో ఒకటి. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో ఉంది. బ్యాంకు ప్రధాన కార్యాలయం ముంబై , మహారాష్ట్ర లో ఉన్నది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -ధరణికోట శాఖ

చరిత్ర

మార్చు

1911 లో స్థాపించబడిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పూర్తిగా భారతీయుల నిర్వహణలో ఉన్న మొదటి భారతీయ వాణిజ్య బ్యాంకు. బ్యాంక్ స్థాపించిన వారు సర్ సొరాబ్జీ పోచ్ఖానావాలా. బ్యాంక్ మొదటి చైర్మన్ సర్ ఫెరోజేషా మెహతా. భారతదేశంలో 27 రాష్ట్రాలలో, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో బ్యాంక్ శాఖలతో విస్తరించింది. . సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4336 శాఖలు, 9 అసెట్ రికవరీ బ్రాంచీలు (ARB) , 15 రిటైల్ అసెట్ బ్రాంచీలు (RAB), 26 ఎక్స్ టెన్షన్ కౌంటర్ లతో ఉంది.[1]

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రకంజాతీయ బ్యాంక్
బి.ఎస్.ఇ: 532885
NSECENTRALBK
పరిశ్రమబ్యాంకింగ్
ఆర్ధిక సేవలు
స్థాపన21 డిసెంబరు 1911; 112 సంవత్సరాల క్రితం (1911-12-21)
ప్రధాన కార్యాలయంముంబై, మహారాష్ట్ర, భారతదేశం
కీలక వ్యక్తులు
  • తపన్ రే
    (Non-Exe Chairman)[2]
  • Matam Venkata Rao
    (MD & CEO)[3]
రెవెన్యూ  25,897.44 crore (US$3.2 billion)(2021)[4]
  4,630 crore (US$580 million) (2021)[4]
  −888 crore (US$−110 million) (2021)[4]
Total assets 3,69,214.99 crore (US$46 billion) (2021) [4]
Total equity 5,875.56 crore (US$740 million) (2020–21) [4]
యజమానిభారత ప్రభుత్వం (93.08%) [5]
ఉద్యోగుల సంఖ్య
32,335 (2021)[5]
మాతృ సంస్థఆర్ధిక మంత్రిత్వ శాఖ , భారత ప్రభుత్వ
మూలధన నిష్పత్తి14.81% (2021)[5]
వెబ్‌సైట్www.centralbankofindia.co.in  

సేవలు

మార్చు

బ్యాంకు ప్రధాన వ్యాపారం డిపాజిట్లు తీసుకోవడం, వినియోగ దారులకు అప్పుగా ఇవ్వడం, పెట్టుబడులు పెట్టడం. క్రెడిట్ కార్డుల డెబిట్ కార్డుల క్యాష్ మేనేజ్ మెంట్, రెమిటెన్స్ సర్వీసులు, కలెక్షన్ సర్వీస్ లతో సహా వినియోగదారులకు విస్త్రృత శ్రేణి సాధారణ బ్యాంకింగ్ సేవలను, బ్యాంకు తృతీయపక్ష జీవిత( థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్), జీవితేతర బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్ లను ఏజెన్సీ ప్రాతిపదికన పంపిణీ చేస్తుంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల వసూలు, పెన్షన్ల చెల్లింపుతో సహా అనేక విషయాలలో సేవలు చేయడం, ప్రయాణీకుల చెక్కులు( ట్రావెల్సర్లు చెక్స్), బహుమతి చెక్కుల(గిఫ్ట్ చెక్స్) అందచేయడం జరుగుతుంది.బ్యాంకు 31 మార్చి 2018 వరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 4685 బ్రాంచీల నెట్ వర్క్, గ్రామీణ,సెమీ అర్బన్ ప్రాంతాల్లో 63%, 4886 ఎటిఎమ్ లతో విస్తరించింది. బ్యాంకు డిపాజిట్స్ తీసుకోవడం, రిటైల్ అగ్రికల్చ, కార్పొరేట్ అనే మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించబడింది. రిటైల్ వ్యాపారం లో రిటైల్ కస్టమర్ లకు హౌసింగ్, రిటైల్ ట్రేడ్ ఆటోమొబైల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, విద్య ఇతర వ్యక్తిగత రుణాలు వంటి రుణాలు, అడ్వాన్స్ లు వంటి సేవలను అందిస్తుంది. వ్యవసాయ బ్యాంకింగ్ వ్యాపారంలో పెట్టుబడి కోసం రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయ పనిముట్లు (ఇన్పుట్స్) సరఫరాదారులకు రుణానికి పరోక్ష ఫైనాన్సింగ్ అందిస్తుంది. ఈ బ్యాంకు మధ్య-పరిమాణ, చిన్న వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలతో సహా కార్పొరేట్, వాణిజ్య వినియోగదారులకు వాణిజ్య బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 7 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్పాన్సర్ చేస్తుంది.[6]

అభివృద్ధి

మార్చు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1918 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రము హైదరాబాదులో ఒక శాఖను ప్రారంభించింది. 1925 సంవత్సరంలో సికింద్రాబాద్ లో ఒక శాఖ ప్రారంభించబడింది.

1923 సంవత్సరంలో అలయన్స్ బ్యాంక్ ఆఫ్ సిమ్లా దివాలా తీసిన తరువాత, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాటా ఇండస్ట్రియల్ బ్యాంక్ ను కొనుగోలు చేసింది. 1917సంవత్సరంలో స్థాపించబడిన టాటా బ్యాంకు 1920 సంవత్సరంలో మద్రాసులో ఒక శాఖను ప్రారంభించింది. ఆ శాఖ మద్రాసులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది.

1936 సంవత్సరంలో లండన్ లో ప్రారంభమైన సెంట్రల్ ఎక్స్ఛేంజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషించింది. అయితే, 1938లో బార్క్లేస్ బ్యాంక్ సెంట్రల్ ఎక్స్ఛేంజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కొనుగోలు చేసింది.[7]

మూలాలు

మార్చు
  1. chcom (2013-06-28). "Central Bank of India". CompaniesHistory.com - The largest companies and brands in the world (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-08.
  2. "Dena Bank, Punjab & Sindh Bank, Central Bank of India get new chairpersons". The Economic Times. 24 May 2018. Retrieved 3 September 2018.
  3. "canara-banks-executive-director-matam-venkata-rao-appointed-as-new-md--ceo-of-central-bank". newindianexpress.com. Retrieved 3 March 2021.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 "Annual Report of Central Bank of India" (PDF).
  5. 5.0 5.1 5.2 "Annual Report of Central Bank of India" (PDF).
  6. "Central Bank of India". Business Standard India. Retrieved 2022-07-08.
  7. "Central Bank of India". Unacademy (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-08.