సెకండు

సమయాన్ని కొలిచే ప్రమాణం
(సెకండ్ నుండి దారిమార్పు చెందింది)

సెకను అనగా అంతర్జాతీయ వ్యవస్థ ప్రమాణికాలలో (SI) సమయం యొక్క మూల ప్రమాణం, ఇతర కొలత వ్యవస్థలలో సమయ ప్రమాణం కూడా, గంట సమయాన్ని 60 ద్వారా భాగిస్తే వచ్చే సమయాన్ని నిమిషము అంటారు, మళ్ళీ నిమిషాన్ని 60 తో భాగించగా వచ్చే సమయాన్ని సెకను అంటారు. సెకన్ను ఆంగ్లంలో సెకండ్ (second) అంటారు. సెకను చిహ్నం: s, సంక్షిప్తంగా s లేదా sec తో సూచిస్తారు. సెకన్లను యాంత్రిక, విద్యుత్ లేదా అటామిక్ గడియారములను ఉపయోగించి లెక్కిస్తారు.

A light flashing approximately once per second (సుమారుగా ప్రతి సెకనుకు ఈ దీపం ఒకసారి వెలుగుతుంది)

సెకను యొక్క ఉపవిభాగాలను సూచించడానికి సెకను పదంతో అంతర్జాతీయ వ్యవస్థ ప్రమాణిక పూర్వపదాలను (SI prefixes) తరచుగా కలుపుతారు. ఉదాహరణకు మిల్లీసెకను (సెకను యొక్క వెయ్యివ భాగము), మైక్రోసెకను (సెకను యొక్క పదిలక్షో వంతు), నానోసెకను (సెకను యొక్క వందకోట్లో వంతు).

అలాగే SI పూర్వపదాలు సెకను యొక్క గుణిజాలు ఏర్పాటు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు కిలోసెకను (వెయ్యి సెకన్లు) వంటివి, అయితే ఇటువంటి యూనిట్లు ఆచరణలో చాలా అరుదుగా ఉపయోగిస్తారు.

సాధారణంగా సమయం యొక్క ప్రమాణాలు SI ప్రమాణాలు సూచించే పది యొక్క శక్తులుగా ఏర్పడి ఉండవు, దానికి బదులుగా సెకండ్ ను 60 చే గుణించగా నిమిషము రూపము, దీనిని 60 చే గుణించగా ఒక గంట, దీనిని 24 చే గుణించగా ఒక రోజు అవుతుంది.

లిప్తపాటు కాలాన్ని క్షణము అంటారు. ఐదు క్షణాలు ఒక సెకను.

ఇతర కాలమానలతో సమానమైన పోలిక

మార్చు

ఒక అంతర్జాతీయ సెకను ఈ క్రింది వానికి సమానం :

SI గుణిజాలు

మార్చు

SI పూర్వపదాలను సాధారణంగా సెకను కంటే తక్కువ సమయాన్ని కొలిచేందుకు, అరుదుగా సెకను యొక్క గుణిజాలుగా (దీనిని మెట్రిక్ సమయం అని పిలుస్తారు) ఉపయోగిస్తారు. దీనికి బదులుగా non-SI units నిమిషాలు, గంటలు, రోజులు, జూలియన్ సంవత్సరాలు, జూలియన్ శతాబ్దాలు, జూలియన్ సహస్రాబ్దాలుగా ఉపయోగిస్తారు.

SI multiples for second (s)
Submultiples Multiples
Value Symbol Name Value Symbol Name
10−1 s ds decisecond 101 s das decasecond
10−2 s cs centisecond 102 s hs hectosecond
10−3 s ms millisecond 103 s ks kilosecond
10−6 s µs microsecond 106 s Ms megasecond
10−9 s ns nanosecond 109 s Gs gigasecond
10−12 s ps picosecond 1012 s Ts terasecond
10−15 s fs femtosecond 1015 s Ps petasecond
10−18 s as attosecond 1018 s Es exasecond
10−21 s zs zeptosecond 1021 s Zs zettasecond
10−24 s ys yoctosecond 1024 s Ys yottasecond
Common prefixes are in bold

ఇవి కూడా చూడండి

మార్చు

క్షణము
కాలము
కాలమానము

"https://te.wikipedia.org/w/index.php?title=సెకండు&oldid=3709304" నుండి వెలికితీశారు