సెట్టి ఈశ్వరరావు
సెట్టి ఈశ్వరరావు అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకుడు. రాచమళ్ల సత్యవతీదేవి సంపాదకత్వంలో వెలువడిన "తెనుగు తల్లి" సాహిత్యమాసపత్రికకు సహాయ సంపాదకుడిగా పనిచేశాడు. ఇతడు విశాలాంధ్ర అనే పక్షపత్రికను ప్రారంభించి, ప్రగతిశీలసాహిత్యానికి విశాలమైన నేపథ్యాన్ని కల్పించాడు. త్వమేవాహం, నయాగరా, వజ్రాయుధం, సంఘర్షణ కావ్యాల తొలి విపుల విమర్శలతోపాటు రష్యన్ జానపద బాలసాహిత్యాన్ని ప్రకటించిన ఘనత ఇతడిదే. ఆ రోజులలో రీడర్స్ డైజెస్ట్ వంటి పత్రికల ద్వారా వెలువడుతుండిన రష్యన్ వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకొని, సాధక్ అన్న పేరుతో ఇతడు విమర్శవ్యాసాలను వ్రాసేవాడు. ఆ తర్వాత విశాలాంధ్ర టైటిల్ ను కమ్యూనిస్టు పార్టీకి వారి దినపత్రికకోసం ఇచ్చివేశాడు. విశాలాంధ్ర ప్రచురణాలయం కోసం ఇతడు గురజాడ రచించిన కథానికల సంపుటి, కవితల సంపుటి, కన్యాశుల్కము మొదలైన పుస్తకాలకు సంపాదకత్వం వహించాడు. అమెరికన్ నీగ్రో కవుల గీతాలు అనే పుస్తకాన్ని అనువదించాడు. మహాకవి మహాపురుషుడు గురజాడ అప్పారావు అనే పుస్తకాన్ని వ్రాశాడు.
సెట్టి ఈశ్వరరావు | |
---|---|
సెట్టి ఈశ్వరరావు | |
జననం | సెట్టి ఈశ్వరరావు 1964 జూలై 1 |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | సాధక్ |
వృత్తి | సంపాదకుడు |
రచనలు
మార్చుమూలాలు
మార్చు- ↑ రచనా వ్యాసాంగం, కథానికల సంపుటి ,డి.ఎల్.ఐ బార్ కోడ్:2990100071325 ప్రచురణ:2004
- ↑ సంపాదకుడు:సెట్టి ఈశ్వరరావు ,రచనా వ్యాసాంగం, నవల,డి.ఎల్.ఐ బార్ కోడ్: 2990100071324 సంవత్సర:2004
- ↑ గురజాడ అప్పారావు, సంపాదకుడు:సెట్టి ఈశ్వరరావు ,రచనా వ్యాసాంగం, కవితల సంపుటి, 2990100071326 , 2005
- ↑ సంపాదకుడు:సెట్టి ఈశ్వరరావు ,రచనా వ్యాసాంగం, 2990100051659, 2000