సైకో 2013లో విడుదలైన తెలుగు సినిమా. కాలిబెర్ ఫిల్మ్ బ్యానర్‌పై వివేకానంద అహుజా. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు కిషోర్ భార్గవ్ దర్శకత్వం వహించాడు.[1] రాజ్ ష్రాఫ్, నిషా కొఠారి, మిలింద్ గుణాజీ, నకుల్ వైద్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2013 జూన్ 21న విడుదలైంది.[2]

సైకో
దర్శకత్వంకిషోర్ భార్గవ్
రచనరామ్ గోపాల్ వర్మ
నిర్మాతవివేకానంద అహుజా, రామ్ గోపాల్ వర్మ
తారాగణంరాజ్ ష్రాఫ్, నిషా కొఠారి, మిలింద్ గుణాజీ, నకుల్ వైద్య
సంగీతంప్రదీప్ ముఖోపాధ్యాయ్
పంపిణీదార్లుకాలిబెర్ ఫిల్మ్
విడుదల తేదీ
2013 జూన్ 21 (2013-06-21)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

మీరా (నిషా కొఠారి) ఓ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఇలా సాఫీగా సాగిపోతున్న మీరా జీవితంలోకి నిఖిల్ ( (రాజ్ ష్రాఫ్)) ప్రవేశిస్తాడు. మొదట మీరాతో పరిచయిస్తుడుగా మారి ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. మీరా అతడి నుండి ఎంత తప్పించుకోవాలనుకుంటుందో అతను అంత సైకోలా మారుతాడు. చివరికి ఆ సైకో వల్ల మీరాకి ఏమన్నా అయ్యిందా ? లేక చివరికి సైకోనే చనిపోయాడా? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు సవరించు

 • రాజ్ ష్రాఫ్
 • నిషా కొఠారి
 • మిలింద్ గునాజ్
 • నకుల్ వైద్య
 • విజయ్ కశ్యప్

సాంకేతిక నిపుణులు సవరించు

 • బ్యానర్: కాలిబెర్ ఫిల్మ్
 • నిర్మాతలు: వివేకానంద అహుజా. రామ్ గోపాల్ వర్మ
 • కథ, స్క్రీన్‌ప్లే: రామ్ గోపాల్ వర్మ
 • దర్శకత్వం: కిషోర్ భార్గవ్
 • సంగీతం: ప్రదీప్ ముఖోపాధ్యాయ్
 • సినిమాటోగ్రఫీ:

మూలాలు సవరించు

 1. Telugu Filmi Beat (3 April 2013). "రామ్ గోపాల్ వర్మ తర్వాతి చిత్రం 'సైకో'". Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.
 2. Go Telugu (21 June 2013). "Movie Review - Psycho | Gotelugu.com". Archived from the original on 3 December 2013. Retrieved 31 October 2021.
 3. 123 Telugu (21 June 2013). "సమీక్ష : సైకో – సైకోయిజంకి అద్దం పట్టే సినిమా.. |". Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.