సంజ్ఞ

(సైగ నుండి దారిమార్పు చెందింది)

సంజ్ఞ లేదా సైగ (Gesture) అనేది ఒక విధమైన భాషారహిత భావవ్యక్తీకరణ (Non-verbal communication). ఇవి మన శరీరంలోని ఏ భాగంతోనైనా, కొన్ని సార్లు మాటలతో కలిపి ఉపయోగించే పద్ధతి. వీటితో తన మనసులోని భావాల్ని, ఆలోచనల్ని ఇతరులకు తెలియజేస్తారు. కొన్ని సంజ్ఞలు వివిధ దేశాలలో, సంస్కృతులలో విభిన్నమైన భావాల్ని తెలియజేస్తే, కొన్ని ప్రపంచమంతటా ఒకే అర్ధాన్నిస్తాయి.

Pointing with an extended finger is offensive in many cultures.

చేతి సంజ్ఞలు

మార్చు
 
నమస్కారం ముద్ర

చేతి సంజ్ఞలు ఒకటి లేదా రెండు చేతులను ఉపయోగించి తెలియజేసే సంజ్ఞలు. చెముడు, మూగ వారు ఇతరులతో చేతి వేళ్ళను ఉపయోగించి మాట్లాడతారు.

నమస్కారం

మార్చు

నమస్కారం (Namaste) లో " నమః " అనగా "మనిషిలో గల ఆత్మ"ను గౌరవించుట. ఈ సంప్రదాయము దక్షిణాసియాలో ఎక్కువగా కానవస్తుంది. ప్రత్యేకంగా హిందూ, జైన, బౌద్ధ మతావలంబీకులలో సాధారణంగా కానవస్తుంది. గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని ప్రకటించుకొనే ప్రక్రియ.

వందనం

మార్చు
 
A U.S. Navy officer performing a military hand salute.

వందనం లేదా సెల్యూట్ (salute) ఇతరుల మీద గౌరవాన్ని తెలియజేసే చేతి సంజ్ఞ. ఇవి పోలీసు లేదా మిలటరీ వ్యక్తులలో ఎక్కువగా కనిపించినా ఇతరులు కూడా సామాన్యంగా ఉపయోగిస్తారు.

అక్షరమాల

మార్చు

చేతి వేళ్ళతో ఆంగ్ల అక్షరమాల (Fingerspelling) ముఖ్యంగా బధిరుల కోసం వివిధ దేశాలలో అభివృద్ధిచేశారు. వాటిలో అమెరికన్ సంజ్ఞా భాష (Americal Sign Language) బహుళ ప్రచారంలో ఉంది. దీనిని ఉపయోగించేందుకు తర్ఫీదు పొందిన మూగవారు మాట్లాడుకొనే అవకాశం ఉంది.

తల సంజ్ఞలు

మార్చు

తల ఊపడం

మార్చు

తల ఊపడం (Nodding) మన సామాన్యంగా ఉపయోగించే సంజ్ఞ. తల అడ్డంగా ఊపితే వద్దు, లేదు, కాదు అని అర్ధం వస్తుంది. తల నిలువుగా ఊపితే అవును, కావాలి అని అర్ధం. కొన్ని రకాల వందనాలలో తలను కొద్దిగా ముందుకు వంచుతారు.

ముఖ కదలికలు

మార్చు

కళ్ళతో, పెదవులతో, కనుబొమ్మలు, కనురెప్పలు, నుదురు ఇలా ముఖంలోని అన్ని భాగాలతో వివిధ సంజ్ఞలు చేయవచ్చును. కన్నుకొట్టడం ఒక విధమైన సంజ్ఞ.

శరీరంతో సంజ్ఞలు

మార్చు

శరీరంలోని ఇతర భాగాలైన ఛాతీ, ఉదరం, పిరుదులు మొదలైన భాగాలతో చేసే సంజ్ఞలు.

"https://te.wikipedia.org/w/index.php?title=సంజ్ఞ&oldid=2885655" నుండి వెలికితీశారు