సైయిన్ (పూజారిణి)
సైయిన్ లేదా ఇట్సుకి నో ఇన్ (Saiin or Itsuki no In (斎院)) లు జపనీస్ చక్రవర్తి కి మహిళా బంధు వర్గంగా సైయో (saiō) అని పిలుస్తారు) ఉంటూ, కామో పుణ్యక్షేత్రం లో అధిష్టాన పూజారిణులుగా సేవలందిస్తారు. సైయిన్ యువ రాణులను సాధారణంగా రాజ కుటుంబ సభ్యుల (内親王, నైషిన్నో) నుండి, లేదా యువరాణుల(女王, జోయో) నుండి ఎన్నుకుంటారు. సూత్రప్రాయంగా వారు అవివాహితులై ఉండాలి. కానీ, కొన్ని మినహాయింపులున్నాయి. కొంతమంది సైయిన్ లు చక్రవర్తుల భార్యలుగా మారారు, జపాన్ లో వారిని న్యోగో(Nyōgo)అని పిలుస్తారు. ఈ సైయిన్ పూజారిణీ వర్గ క్రమం, హీయాన్ (Heian), కామకురా (Kamakura ) కాలాల్లో కొనసాగింది.
సైయిన్ పూజారిణులు షింటో దేవతలకు సేవలు చేస్తూ, నివసించే భవనాలకు కూడా సైయిన్ అనే పేరే పెట్టారు.
సాహిత్యంలో సైయిన్
మార్చుజపనీస్ సాహిత్యంలో ప్రసిద్ధ రచన గా పేరొందిన ది టేల్ ఆఫ్ జెంజీ లో, అసగావో అనే సైన్ యువరాణి కోసం ఆరాటపడిన హికారు జెంజీ అనే వ్యక్తి గురించిన కథ ఉంది, అయితే అసగావో, జెంజీతో అలైంగిక ప్రేమను మాత్రమే కొనసాగిస్తుంది. 11వ శతాబ్దపు చెందిన మరో కథ, సగోరోమో మోనోగటారి అనే కథానాయకుడికి, జెంజి నో మియా కు మధ్య సాగిన అవ్యక్త ప్రేమను, ఆ తర్వాత ఆమె కామో సైయిన్‌గా మారిన ఉదంతాన్ని చెబుతుంది.
చారిత్రక సైయిన్
మార్చుయువరాణి షికిషి
మార్చుయువరాణి షికిషి (షికిషి నైషిన్నే), చక్రవర్తి గో-షిరికావా, ఫుజివారా నో సీషీల 3వ కుమార్తె. ఆమె, 1159లో ఆరేళ్ల వయసులోనే కామో మందిరానికి ప్రధాన పూజారిణిగా నియుక్తురాలైంది. అయితే, 1169 లో అనారోగ్య కారణాలతో ఆమె తన పదవికి రాజీనామా చేసింది. రాజీనామా తర్వాత షికిషి ఒక నిష్ణాతురాలైన కవయిత్రిగా మారింది. ఆమె రచించిన 399 కవితలు నేటికీ ఉనికిలో ఉన్నాయి.
సైయిన్ జాబితా
మార్చు- 810-831 యువరాణి ఉచికో(有智子内親王) (807-847), సాగా చక్రవర్తి కుమార్తె [1]
- 831-833 యువరాణి టోకికో(時子内親王) (?-847), చక్రవర్తి నిన్మియో కుమార్తె
- 833-850 యువరాణి తకైకో(高子内親王) (?-866), చక్రవర్తి నిన్మియో కుమార్తె
- 850-857 యువరాణి అకిరాకీకో(慧子内親王) (?-881), మోంటోకు చక్రవర్తి కుమార్తె
- 857-858 యువరాణి జుట్సుషి (述子内親王) (?-897), మోంటోకు చక్రవర్తి కుమార్తె
- 859-876 యువరాణి గిషి (儀子内親王) (?-879), మోంటోకు చక్రవర్తి కుమార్తె కుమార్తె
- 877-880 ప్రిన్సెస్ అట్సుకో(敦子内親王) (?-930), సీవా చక్రవర్తి కుమార్తె
- 882-887 యువరాణి బోకుషి (穆子内親王) (?-903), కోకో చక్రవర్తి కుమార్తె
- 889-892 ప్రిన్సెస్ నవోయికో(直子女王) (?-892), ప్రిన్స్ కొరెహికో కుమార్తె
- 893-902 యువరాణి కిమికో(君子内親王) (?-902), ఉడా చక్రవర్తి కుమార్తె
- 903-915 ప్రిన్సెస్ క్యోషి (恭子内親王) (902-915), డైగో చక్రవర్తి కుమార్తె
- 915-920 ప్రిన్సెస్ నోబుకో(宣子内親王) (902-920), డైగో చక్రవర్తి కుమార్తె
- 921-930 ప్రిన్సెస్ షో షి (韶子内親王) (918-980), డైగో చక్రవర్తి కుమార్తె
- 931-967 యువరాణి ఎన్షి (婉子内親王) (904-969), డైగో చక్రవర్తి కుమార్తె
- 968-975 ప్రిన్సెస్ సోన్షి (尊子内親王) (966-985), రీజీ చక్రవర్తి కుమార్తె
- 975-1031 యువరాణి సెన్షి (選子内親王) (964-1035), మురకామి చక్రవర్తి కుమార్తె
- 1031-1036 యువరాణి కౌరుకో (馨子内親王) (1029-1093), చక్రవర్తి గో-ఇచిజో కుమార్తె
- 1036-1045 యువరాణి కెన్షి (娟子内親王) (1032-1103), చక్రవర్తి గో-సుజాకు కుమార్తె
- 1046-1058 ప్రిన్సెస్ బైషి (禖子内親王) (1039-1096), చక్రవర్తి గో-షో షిసుజుకు కుమార్తె
- 1058-1069 ప్రిన్సెస్ షో షి (正子内親王) (1045-1114), చక్రవర్తి గో-సుజుకు కుమార్తె
- 1069-1072 యువరాణి యోషికో(佳子内親王) (1057-1130), చక్రవర్తి గో-సంజో కుమార్తె
- 1073 యువరాణి అట్సుకో(篤子内親王) (1060-1114), చక్రవర్తి గో-సంజో కుమార్తె
- 1074-1089 ప్రిన్సెస్ సైషి (斉子内親王), కో-ఇచిజో ఇన్ (ప్రిన్స్ అట్సుకిర) కుమార్తె
- 1089-1099 ప్రిన్సెస్ రైషి (令子内親王) (1078-1144), చక్రవర్తి షిరికావా కుమార్తె
- 1099-1107 యువరాణి షిన్షి (禛子内親王) (1081-1156), చక్రవర్తి శిరకావా కుమార్తె
- 1108-1123 యువరాణి కాన్షి (官子内親王) (1090-?), చక్రవర్తి శిరకావా కుమార్తె
- 1123-1126 ప్రిన్సెస్ సోషి (悰子内親王) (1099-1162), చక్రవర్తి హోరీకావ కుమార్తె
- 1127-1132 యువరాణి మునెకో (統子内親王) (1126-1189), టోబా చక్రవర్తి కుమార్తె [2]
- 1132-1133 యువరాణి యోషికో(禧子内親王) (1122-1133), తోబా చక్రవర్తి కుమార్తె
- 1133-1159 ప్రిన్సెస్ ఇషి (怡子女王), ప్రిన్స్ సుకేహిటో కుమార్తె
- 1159-1169 యువరాణి షికిషి (式子内親王) (1149-1201), చక్రవర్తి గో-షిరకావా కుమార్తె
- 1169-1171 యువరాణి జెన్షి (僐子内親王) (1159-1171), నిజో చక్రవర్తి కుమార్తె
- 1171 యువరాణి షాషి (頌子内親王) (1145-1208), తోబా చక్రవర్తి కుమార్తె
- 1178-1181 ప్రిన్సెస్ నోరికో(範子内親王) (1177-1210), చక్రవర్తి టకాకురా 1171 యువరాణి షాషి (頌子内親王) (1145-1208), తోబా చక్రవర్తి కుమార్తెకుమార్తె [3]
- 1204-1212 ప్రిన్సెస్ రైషి (礼子内親王) (1200-1272), చక్రవర్తి గో-టోబా కుమార్తె. [4]
ఇది కూడ చూడు
మార్చుగమనికలు
మార్చు
ప్రస్తావనలు
మార్చు- పోన్సన్బై-ఫేన్, రిచర్డ్ ఆర్థర్ బ్రబాజోన్. (1962) స్టడీస్ ఇన్ షింటో అండ్ శ్రయిన్స్. క్యోటో: పోన్సన్బై మెమోరియల్ సొసైటీ. OCLC 399449
- (1963) విసిసిట్యూడ్స్ ఆఫ్ షింటో . క్యోటో: పోన్సన్బై మెమోరియల్ సొసైటీ. OCLC 36655