సొకొట్రా హిందూ మహాసముద్రం లోని ఒక ఒక వింత దీవి. దీన్నంతా 'ఏలియన్ ల్యాండ్' అని పిలుస్తారు. అంటే గ్రహాంతర నేల అని అర్థం. ఎందుకంటే ఈ దీవిలో రక్తం కక్కే చెట్లు ఉంటాయి. భూమిపై మరెక్కడా కనిపించని జంతువులు, వాతావరణం అంతా భలే వింతగా ఏదో వేరే గ్రహం మీద ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి.ఈ దీవి 132 కిలోమీటర్ల పొడవు, సుమారు 50 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది 'యెమెన్' దేశ భూభాగం కిందకు వస్తుంది.
- ఈ దీవిలో 840 జాతుల వృక్షజాతులు ఉన్నాయి. అందులో దాదాపు 307 జాతులు భూమిపైన మరెక్కడా కనిపించవు. ఇక వీటిల్లో మరింత ఆశ్చర్యం కలిగించేది గొడుగు చెట్టు. ఇది పనిగట్టుకుని కత్తిరించిన గొడుగులా ఉంటుంది. దీన్నంతా 'డ్రాగన్స్ బ్లడ్ ట్రీ' అంటారు. ఎందుకంటే ఈ చెట్టు కొమ్మలను విరిచినపుడు అందులో నుంచి రక్తం రంగులో ఉండే ఎర్రని ద్రవం బయట కొస్తుంది. అయితే ఈ ద్రవాన్ని ఎన్నో ఔషధాల్లో వాడుతారట. ఈ దీవిలో ఎక్కువగా కనిపించే మరో వింత చెట్టు 'డెసర్ట్ రోజ్' దీని కింది కాండం ఉబ్బెత్తుగా, ఏనుగు కాలులా తమాషాగా ఉంటుంది.
- ఈ దీవిలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ వాతావరణాన్ని తట్టుకోవడానికే ఇక్కడి చెట్లు అలా పరిణామం చెందాయి.
- ఇక్కడ 140 జాతుల పక్షులు, 30 సరీసృప జాతులు అబ్బురపరుస్తాయి. అందులో కాళ్లులేని బల్లి విచిత్రంగా ఉంటుంది. ఓ ఊసరవెల్లి జాతితో పాటు ఓ రకం గబ్బిలం ఇక్కడ మాత్రమే జీవిస్తాయి.
- ఇక్కడ సుమారు 40,000 జనాభా ఉంది. వీళ్ల ప్రధాన వృత్తి చేపలు పట్టడం, ఖర్జూరాలు పండించడం, పాడి పరిశ్రమను నడపడం. ఇప్పుడిప్పుడే పర్యాటకులు కూడా బాగా పెరుగుతున్నారు.
- ఇక్కడ మూడు రకాల నేలలున్నాయి. పర్వత ప్రాంతాలు, ఇసుకతో నిండిన ఎడారులు, సున్నపురాయి నేలలు.
- దీవిలో సున్నపురాయితో ఏర్పడిన ఎన్నో గుహలు ప్రత్యేక ఆకర్షణ. అంతేకాదు ఇక్కడ దాదాపు 4500 అడుగుల ఎత్తుతో ఉన్న ఓ పర్వతం యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు పొందింది.
- ↑ Schurhammer, Georg (1982). Francis Xavier; His Life, His Times: India, 1541–1544. Vol. 2. Jesuit Historical Institute. p. 122.
Wikimedia Commons has media related to Socotra. |
వికీవాయేజ్ కోసం ఒక ట్రావెల్ గైడ్ ఉంది Socotra. |