సొలారిస్ (నిర్వాహక వ్యవస్థ)
సొలారిస్ అనేది నిజానికి సన్ మైక్రోసిస్టమ్స్ చే అభివృద్ధి చేయబడిన ఒక యునిక్స్ నిర్వాహక వ్యవస్థ. ఇంతకు ముందు సన్ఒయస్ పేరుతో ఉన్న దీనిని 1993లో సొలారిస్ గా పేరుమార్చారు.
అభివృద్ధికారులు | ఒరాకిల్ కార్పోరేషన్ |
---|---|
ప్రోగ్రామింగ్ భాష | సీ, సీ++ |
నిర్వహణవ్యవస్థ కుటుంబం | యునిక్స్ (System V Release 4) |
పనిచేయు స్థితి | ప్రస్తుతం |
మూల కోడ్ విధానం | మిశ్రమం ఓపెన్ సోర్స్ / closed source |
తొలి విడుదల | జూన్ 1992 |
ఇటీవల విడుదల | 11.3[1] / అక్టోబరు 26, 2015 |
Marketing target | వర్క్‌స్టేషన్, సేవకం |
విడుదలైన భాషలు | ఆంగ్లము |
ప్లాట్ ఫారములు | SPARC, IA-32 (except Solaris 11), x86-64, PowerPC (Solaris 2.5.1 only) |
Kernel విధము | మోనోలిథిక్ with dynamically loadable modules |
అప్రమేయ అంతర్వర్తి | జావా డెస్క్‌టాప్ ఎన్విరాన్మెంట్ లేదా కామన్ డెస్క్‌టాప్ ఎన్విరాన్మెంట్ లేదా గ్నోమ్ |
లైెసెన్స్ | వివిధం |
చారిత్రాత్మక పరంగా, సొలారిస్ ఒక యాజమాన్య సాఫ్ట్‌వేరుగా అభివృద్ధి చేయబడింది. కాని జూన్ 2005లో, సన్ మైక్రోసిస్టమ్స్ చాలా వరకూ కోడును కామన్ డెవలప్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ క్రింద విడుదల చేసి, ఓపెన్‌సొలారిస్ ఓపెన్ సోర్స్ ప్రోజెక్టును స్థాపించింది.
ఓపెన్ సోలారిస్ పరియోజనతో, సాఫ్ట్‌వేర్ చుట్టూ డెవలపర్, వాడుకరుల సమాజాన్ని సన్ నిర్మించాలనుకుంది. జనవరి 2010లో, సన్ మైక్రోసిస్టమ్సును అధికారికంగా స్వాధీనం చేసుకున్న తరువాత, ఓపెన్ సొలారిస్ పంపిణీని, దాని అభివృద్ధి నమూనాను నిలిపివేయాలని ఒరాకిల్ నిర్ణయించుకుంది. ఆగస్టు 2010లో, సొలారిస్ కెర్నెల్ సోర్సు కోడుకు బహిరంగ నవీకరణలను అందించడం ఒరాకిల్ నిలిపివేసింది. తరువాత సొలారిస్ 11ను క్లోజుడ్ సోర్స్ యాజమాన్య నిర్వాహక వ్యవస్థగా మార్చివేసింది.
చరిత్ర
మార్చు1987లో, విపణిలో అత్యంత ప్రజాదరణ పొందిన యునిక్స్ రూపాలను(బీయస్డీ, సిస్టం ఫైవ్, క్సెనిక్స్) విలీనం చేయుటకు పరస్పర సహకారంతో ఒక పరియోజనపై పనిచేస్తున్నట్లు ఎటి & టి కార్పోరేషన్, సన్ సంస్థలు వారు ప్రకటించాయి. ఈ పరియోజన ఫలితమే యునిక్స్ సిస్టమ్ V రిలీజ్ (ఎస్‌వీఆర్4).
References
మార్చు- ↑ "Oracle Announces Availability of Oracle Solaris 11.3". October 26, 2015. Retrieved October 28, 2015.