సోడియం హైపోక్లోరైట్
సోడియం హైపోక్లోరైట్ అనేది ఒక రసాయన సమ్మేళనం దీనిని NaOCl లేదా NaClO సూత్రంతో నిర్వచిస్తారు . దీనిని హైపోక్లోరస్ ఆమ్లం యొక్క సోడియం ఉప్పుగా కూడా చూడవచ్చు. ఈ అన్‌హైడ్రస్ సమ్మేళనం అస్థిరంగా ఉంటుంది . ఇది పెంటహైడ్రేట్ NaOCl · 5H2O, లేత ఆకుపచ్చ- పసుపు ఘనపదార్థం, ఇది పేలుడు రహితం , రిఫ్రిజిరేటెడ్ ( శీతల ప్రదేశం) లో ఉంచితే స్థిరంగా ఉంటుంది. సోడియం హైపోక్లోరైట్ అనేది క్లోరిన్ సమ్మేళనం తరచుగా క్రిమిసంహారక లేదా బ్లీచింగ్ ఏజెంట్ గా ఉపయోగించబడుతుంది. 0.5% w/v ద్రావణంలో సోడియం హైపోక్లోరైట్ ని డాకన్స్ ద్రావణం అని అంటారు[1],సోడియం హైపోక్లోరైట్ సాధారణంగా వివిధ సాంద్రతలలో నీటిలో కరిగిపోతుంది. సోడియం హైపోక్లోరైట్ ద్రవము గృహ బ్లీచ్ యొక్క దుర్వాసనతో కూడిన రంగురహిత లేదా కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది. అలాగే ఘాటైన క్లోరిన్ వాసనను కలిగి ఉంటుంది. ఈ సమ్మేళనం వాతావరణంలో సహజంగా సంభవించదు. సోడియం, కాల్షియం హైపోక్లోరైట్ లు ప్రాథమికంగా బ్లీచింగ్ ఏజెంట్ లు లేదా నిర్జలీకరణలు వలే ఉపయోగించబడతాయి. ఇవి వాణిజ్య బ్లీచ్ లు, క్లీనింగ్ సొల్యూషన్స్, త్రాగునీరు వ్యర్థ జల శుద్దీకరణ వ్యవస్థలు, ఈత కొలనుల కోసం క్రిమిసంహారకాలుగా దీనిని ఉపయోగిస్తారు. ఇది సూక్ష్మక్రిములను చంపడానికి, తెల్లని బట్టలు మరింత తెల్లగా చేయడానికి లాండ్రీకి జోడించబడుతుంది. సోడియం హైపోక్లోరైట్ విస్తృత అనువర్తనాలయిన క్లోరిన్ వాయువు (Cl2) ఘన కాల్షియం హైపోక్లోరైట్ [Ca (OCl) 2] లు రెండు కలిగి ఉన్న ప్రభావవంతమైన క్రిమిసంహారక మందుగా పరిశోధనలు పేర్కొన్నాయి.[2]
సోడియం హైపోక్లోరైట్ యొక్క ఉపయోగాలు
మార్చులాండ్రీ బ్లీచ్‌లో సోడియం హైపోక్లోరైట్ ప్రధాన పదార్థం గా ఉంటుంది , ఇది వస్త్ర, డిటర్జెంట్లు ,కాగితం , గుజ్జు పరిశ్రమలలో బ్లీచింగ్ ఏజెంట్‌గా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. సేంద్రీయ ఉత్పత్తులకు ఇది ఆక్సీకరణ కారకంగా కూడా ఉపయోగించబడుతుంది. పెట్రోకెమికల్ పరిశ్రమలో, పెట్రోలియం ఉత్పత్తులను శుద్ధి చేయడంలో సోడియం హైపోక్లోరైట్ ఉపయోగించబడుతుంది. నీరు మురుగునీటి శుద్ధి, శానిటరీ పరికరాలలో క్రిమిసంహారక మందుగా పెద్ద పరిమాణాలలో ఉపయోగిస్తారు. ఆహార ప్రాసెసింగ్‌లో, పండ్ల, కూరగాయల ప్రాసెసింగ్, పుట్టగొడుగుల ఉత్పత్తి, హాగ్, గొడ్డు మాంసం పౌల్ట్రీ ఉత్పత్తి, మాపుల్ సిరప్ ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్‌లో ఆహార తయారీ పరికరాలను శుభ్రపరచడానికి సోడియం హైపోక్లోరైట్ ఉపయోగించబడుతుంది.
కరోనా వైరస్ నివారణకు వీధులు, రహదారులు, భవనాలపై సోడియం హైపోక్లోరైడ్ లాంటి రసాయనాలను చల్లుతున్నారు
ఆరోగ్య సంరక్షణ
మార్చుదీనిని సాంప్రదాయకంగా క్రిమినాశక (యాంటీసెప్టిక్) మందుగా అంటే సంక్రమణను నివారించడానికి, గాయాలను శుభ్రపరచడానికి వాడతారు.కానీ నోటిద్వారా సోడియం హైపోక్లోరైట్ తీసుకోవద్దు చర్మంపై మాత్రమే వాడాలి [3]ఇది చర్మ పూతల చికిత్సకు ఉపయోగపడుతుంది.ఇది చర్మ సంక్రామ్యతలకు నివారించడం లేదా చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది.
సోడియం హైపోక్లోరైట్ బ్లీచ్ తయారీ, ఉపయోగించే విధానాలు
మార్చుఇది తయారు చేస్తున్నప్పుడు ముసుగు, రబ్బరు చేతి తొడుగులు జలనిరోధిత ఆప్రాన్ ఉపయోగించండి; కళ్ళను రక్షించడానికి కళ్లద్దాలు వాడండి బాగా వెంటిలేషన్ చేసిన ప్రదేశాలలో బ్లీచ్ సొల్యూషన్స్ కలపండి, వాడండి చల్లటి నీటితో బ్లీచ్ కలపండి (వేడి నీరు సోడియం హైపోక్లోరైట్ శిథిలమై, పనికిరానిదిగా చేస్తుంది).కరోనా వైరస్ నిరోధానికి సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేయటానికి ఉపయోగిస్తే 17 గ్రాముల పొడి సోడియం హైపోక్లోరైట్ లో అరవై శాతం క్లోరిన్ ఉంటుంది కాబట్టి ఒక శాతము సాంద్రత గల ద్రావణానికి ఒక లీటర్ నీటిని కలపాలి.లేదా మార్కెట్ లో లభించే సాధారణ బ్లీచింగ్ పొడి లో డెబ్బయ్ శాతం క్లోరిన్ ఉంటే ప్రతి ఏడు గ్రాములకు లీటర్ నీటిని కలపాలి. నీటిలో కలపటానికి 5% సోడియం హైపోక్లోరైట్ కలిగిన బ్లీచ్ ఉపయోగిస్తే, దానిని సాంద్రత 0.05% వరకు చేరేనా తగిన నీటిని కలపండి ఎక్కువ ఘాడత కలిగిన ద్రావణం ప్రమాదకరం[4].కరోనా వైరస్ కోసం ఒక శాతము గల సోడియం హైపోక్లోరైట్ మాత్రమే వాడాలి, ఇంకా వివరాలకు బారత ప్రభుత్వ దస్త్రం చూడండి
బ్లీచ్ వాడకం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు
మార్చుబ్లీచ్ మెటల్స్ ని తుప్పు పట్టిన లోహాలు పెయింట్ చేసిన ఉపరితలాలను డ్యామేజీ చేయగలదు. కళ్లకు తాకకుండా చూసుకోవాలి. ఒకవేళ బ్లీచ్ కళ్లలోనికి వస్తే, వెంటనే కనీసం 15 నిమిషాలపాటు నీటితో కడగండి, తక్షణం వైద్యుడిని సంప్రదించండి.ఇతర గృహ డిటర్జెంట్లతో కలిసి సోడియం హైపోక్లోరైట్ను ఉపయోగించవద్దు, ఎందుకంటే ఇది దాని ప్రభావాన్ని తగ్గిస్తుంది ప్రమాదకరమైన రసాయన ప్రతిచర్యలకు కారణమవుతుంది. ఉదాహరణకు, టాయిలెట్ శుభ్రపరచడానికి ఉపయోగించే ఆమ్ల డిటర్జెంట్లతో సోడియం హైపోక్లోరైట్ కలిపినప్పుడు ఒక విష వాయువు ఉత్పత్తి అవుతుంది, ఈ వాయువు మరణం లేదా గాయానికి కారణమవుతుంది. అవసరమైతే, మొదట డిటర్జెంట్లను వాడండి ఆ తరువాత క్రిమిసంహారక కోసం బ్లీచ్ ఉపయోగించే ముందు నీటితో బాగా కడగాలి. సూర్యరశ్మికి గురైనప్పుడు ఘాడత గల సోడియం హైపోక్లోరైట్ ఒక విష వాయువును విడుదల చేస్తుంది; అందువల్ల, సోడియం హైపోక్లోరైట్‌ను పిల్లలకు అందుబాటులో లేకుండా చల్లని, నీడ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయండి. సోడియం హైపోక్లోరైట్ కాలంతో క్షీణింస్తుంది . దాని ప్రభావాన్ని నిర్ధారించడానికి, ఇటీవల ఉత్పత్తి చేసిన బ్లీచ్‌ను కొనుగోలు చేయండి వాడకుండా అధిక నిల్వలను ఉంచుకోవద్దు. సాధ్యమైనంత వరకూ తయారు చేసిన ద్రావణాన్ని ఇరవై నాలుగు గంటలలోపే వాడడండి.
ఆరోగ్యం మీద ప్రభావం
మార్చుఎక్కువగా వాడటం వలన చర్మ, కంటి సంబంధి సమస్యలు, బ్రాంకోస్పాస్మ్, జీర్ణాశయంపై తీవ్ర ప్రభావం ఉంటుంది.సోడియం హైపోక్లోరైట్ రసాయనం స్ప్రే చేస్తే భౌతికంగా, మానసికంగా హాని కలుగుతుంది . వ్యక్తులపై స్ప్రే చేస్తే కళ్లు, చర్మం మండుతాయని, జీర్ణసంబంధ సమస్యలు పీలిస్తే గొంతు, ముక్కు శ్వాస నాళం లోని పొరల్లో మంట పుడుతుంది. వీధులు, మార్కెట్లు తదితర ఔట్ డోర్ ప్రాంతాల్లో రసాయనాలు చల్లడం, పొగపెట్టడం వంటి చర్యలను WHO సిఫార్సు చేయలేదు ఇది కోవిడ్-19 వైరస్ ఇతర పాథోజన్‌లను సంహరించదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించినది. కరోనా నివారణ ముందు జాగ్రత్త చర్యల కోసం వ్యాధి కారక బ్యాక్టీరియాను నాశనం చేసే సోడియం హైపోక్లోరైట్ వంటి రసాయనాల (డిస్‌ఇన్‌ఫెక్టంట్స్)ను మనుషులపై స్ప్రే చేయరాదని భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. కరోనా అనుమానితులు లేదా కరోనా నిర్ధారణ రోగులు తరచుగా స్పర్శించే ఉపరితలాలు, ప్రాంతాలను పరిశుభ్రం చేయడానికి మాత్రమే ఈ రసాయనాలను ఉపయోగించాలని సిఫార్సు చేసింది[5]
మూలాలు
మార్చు- ↑ PubChem. "Sodium hypochlorite". pubchem.ncbi.nlm.nih.gov (in ఇంగ్లీష్). Retrieved 2020-06-08.
- ↑ "Frequently Asked Questions (FAQs) about Sodium Hypochlorite (SH) | The Safe Water System". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-02-25. Retrieved 2020-06-08.
- ↑ "Sodium Hypochlorite: Indications, Side Effects, Warnings". Drugs.com (in ఇంగ్లీష్). Retrieved 2020-06-08.
- ↑ Information, National Center for Biotechnology; Pike, U. S. National Library of Medicine 8600 Rockville; MD, Bethesda; Usa, 20894 (2014). Use of disinfectants: alcohol and bleach (in ఇంగ్లీష్). World Health Organization.
{{cite book}}
:|first4=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "డిసిన్ఫెక్షన్ టన్నెల్స్ తో ఎలాంటి ప్రయోజనం లేదు, ఆ రసాయనంతో కరోనా చావదు, పైగా హానికరం". www.10tv.in (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.