సోదె మఠ
సోదె మఠం గొప్ప గొప్ప మహాత్ములైన ద్వైత స్వాములు పీఠాధిపత్యం వహించిన మఠం [1]. ఈ మఠం ప్రధాన శాఖ, ఉడుపికి 224 కిలోమీటర్ల దూరంలో సిరిసి తాలూకా సోదె గ్రామంలో వుంది. పూర్వపు రోజులలో కుంభాషి అను ప్రాంతంలో సోదె మఠం వుండేదట. అందువలన దీనికి కుంభాషి మఠమని మరొక పేరు కలదు. గొప్ప హయగ్రీవోపాసకులయిన వాదిరాజస్వామి సోదె మఠ పీఠాధిపతులలో ఒకడు. అతను సంస్కృతంలో ద్వైతమత సిద్ధాంతములకు సంబంధించిన అనేక గ్రంథములు రచించాడు. శ్రీమధ్వాచార్యుని సోదరులయిన శ్రీవిష్ణుతీర్థులు సోదె మఠమునకు ప్రధమ పీఠాధిపతి. భూవరాహస్వామి విగ్రహమును సోదె మఠ ప్రధానార్చన కొరకు శ్రీమధ్వాచార్యులు నియోగించారు. శ్రీవిష్ణుతీర్థులు తరువాత అనిరుద్ధ తీర్థులవారికి పీఠాధిపత్య భాద్యతలు అప్పగించి, కుక్కె క్షేత్రంలో, కుమార పర్వత సమీప సిద్ధ పర్వతంపై నేటికీ తపమాచరిస్తూ వున్నారని ప్రాంతీయ ప్రజలు, మాధ్వులు విశ్వసిస్తున్నారు. శ్రీవిశ్వ వల్లభతీర్థులు సోదెమఠమునకు ప్రస్తుత మఠాధిపతి.[2]
మూలాలు
మార్చు- ↑ Vidwan. P. Srinivasa Tantri (2015). Sri Sode Vadiraja Matha.
- ↑ "Sode Mutt - Krishna Temple Udupi". www.udipikrishnamutt.com. Retrieved 2022-05-31.