సోన్ మండలం

తెలంగాణ, నిర్మల్ జిల్లా లోని మండలం


సోన్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] సోన్, ఈ మండలానికి కేంద్రం. ఇది నిర్మల్ పట్టణం నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం నిర్మల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  14  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

సోన్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, సోన్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, సోన్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, సోన్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°00′29″N 78°22′53″E / 19.007999°N 78.381314°E / 19.007999; 78.381314
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండల కేంద్రం సోన్
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 83 km² (32 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 27,338
 - పురుషులు 12,847
 - స్త్రీలు 14,491
పిన్‌కోడ్ 504102

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు

మార్చు

ఇంతకుముందు సోన్  గ్రామం అదిలాబాదు జిల్లా,నిర్మల్ రెవెన్యూ డివిజను పరిధిలోని నిర్మల్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సోన్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా, నిర్మల్ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+13 (పద్నాలగు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4] పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 83 చ.కి.మీ. కాగా, జనాభా 27,338. జనాభాలో పురుషులు 12,847 కాగా, స్త్రీల సంఖ్య 14,491. మండలంలో 6,918 గృహాలున్నాయి.[5]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. కడ్తాల్
  2. కూచన్‌పల్లి
  3. కొత్త వెల్మల్
  4. కొత్త బొప్పారం
  5. గంజల్
  6. జాఫ్రాపూర్
  7. పాక్పట్ల
  8. పాత పోచంపాడ్
  9. మాదాపూర్
  10. షాకారి
  11. సిద్దంకుంట (కొత్త)
  12. సోన్
  13. వెల్మెల్
  14. సంగంపేట్

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-28.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.