స్కేటర్ గళ్ సినిమా
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
స్కేటర్ గళ్ సినిమా 2021 లో హిదీ,ఇంగ్షీషు భాషలలొ విడుదలైంది. Netflix ఈ సినిమాను తీసింది. మంజరి మఖీజాని దర్శకురాలు.రాజస్థాన్.లో, ఉదయపూరుకు సమీపంలోని ఖేమ్.పూర్.లో సినిమా జరిగినట్లు చూపించారు. పాత సాంప్రదాయాలు, గ్రామపెద్దల వెనుకబాటుతనం, స్టీలపట్ల వివక్ష, అవిద్య, బాలికలకు క్రీడలు, ఏ అవకాశాలు ఇవ్వని తల్లిదండ్రులు- అనేక అంశాలు సినిమాలో ప్రస్తావనకు వస్తాయి. ఖేమ్.పూర్ కుగ్రామానికి 34ఏళ్ల జస్సికా అనే యువతి లండన్ నుంచి వచ్చి, అక్కడి చిన్న పిల్లతో స్నేహం చేస్తుంది. ప్రభుత్వ పాఠశాల తప్ప ఆవూళ్ళో మరేమీ ఉండదు. చిన్న పిల్లవాడు అంకుశ్ చెక్కకు చక్రాలు తగిలించి లాగుతూ ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఆబాలుడి 13 సంవత్సరాల అక్క ప్రేరణకు బడికిపోను సరైన గుడ్డలు కూడా ఉండవు. ఆమె తండ్రి చిన్న అంగడి పెట్టుకొని జీవిస్తూ, కుమార్తెను ఇంటిపనుల్లో పెట్తాడు, ప్రేరణ ఈడువాళ్ళంతా బడికి వెళుతూంటే. ఆ అమ్మాయి నిస్పృహతో ఇంటిపనుల్లో నిమగ్నమై ఉంటుంది.
జెస్సికా ఆవూరి పిల్లకు స్కేటింగ్ బోర్డులు తెచ్చి ఉచితంగా పంచుతుంది. పిల్లలందరూ బడిమానుకొని వాటితో ఆడుకొంటారు. స్కూలు మాస్టర్, కొందరు గ్రామీణులు జెస్సికా మీద పోలీసులకు కంప్లైంట్ చేస్తారు. ఆమె ఎలాగైనా పిల్లలు స్కేటింగ్ ప్రాక్టీస్ చెయ్యడానికి ఒక రింక్ ఏర్పాటు చేయాలని సంకల్పించి, మానవతాగుణం కలిగిన సంపన్నురాలి ఔదార్యంతో గ్రామంలో స్కేటింగ్ రింక్ కట్టించింది. పల్లెలో పిల్లలంతా అక్కడ విరామ సమయంలో ప్రాక్టీస్ చేస్తూ గడుపుతారు. పల్లెలో భయంకరమైన కులతత్వం, వివక్ష ఉన్నా, పిల్లలు దాన్ని మరచిపోయి అక్కడ కలిసి ఆడుతారు. జెస్సికా మిత్రుడు ఎరిక్ స్కేటింగ్ పిచ్తోళ్ళను, మిత్రులను ఆవూరికి రప్పిస్తాడు. వాళ్లు పిల్లలకు స్కేటింగ్.లో శిక్షణ ఇస్తొరు.
అంకుశ్ అక్క ప్రేరణకు స్కేటింగ్ పిచ్చి, పాషన్ అవుతుంది. ఆ గ్రామంలో ఆడపిల్లలమీద ఉన్న కఠిన నిబంధనల మధ్యనే ప్రేరణ తండ్రికి తెలియకుండా ప్రాక్టీస్ చేస్తుంటుంది. స్కూల్లో పైకులానికి చెందిన ఒక విద్యార్థి ప్రేరణకు సహకరిస్తుంటాడు. ప్రేరణ ఎరిక్ స్కేటింగ్ బోర్డు పాడుచేసి, తండ్రి దాచుకున్న డబ్బులో కొంత మొత్తం దొంగలించి ఎరిక్ కి ఇస్తే, అతను నిరాకరిస్తాడు. ప్రేరణ నిజాయతిని జెస్సికా మెచ్చుకొంటుంది. ప్రేరణ డబ్బు తండ్రి పెట్టెలో పెడుతుండగా ఆమె తండ్రి గమనించి ఆమె దొంగతనం చేస్తున్నట్లు అపోహపడి, ఆమెకు పెళ్ళిచేస్తేగాని ఆమెు స్కేటింగ్ పిచ్చి వదలదని ఆమెపెళ్ళి నిశ్చయిస్తాడు, భార్య మాట కూడా వినకుండా.
పెళ్ళి తతంగం ఆరంభమౌతుంది. ప్రేరణను పెళ్ళికూతుర్నిచేస్తారు. ఆరోజే ఊళ్ళో జాతీస్థాయిలో స్కేటింగ్ పోటీ జరుగుతుంది. ప్రేరణ చివరకు తమ్ముడి సహాయంతో పెళ్లి ఇంట్లోంచి పారిపోయి పోటీలో పాల్గొని విజేతగా నిలుస్తుంది.
జెస్సికాకూ ఒక కథ ఉంది. ఎన్నో ఏళ్ళక్రితం అగ్నిప్రమాదంలో ఆవూరి వాళ్ళలో ఒకదంపతులు చనిపోయారు. వారి ఏడేళ్ళ కుమారుడు అనాథను ఒక ఇంగ్లీషు కుటుంబం తమతోపాటు లండన్ తీసుకుని పోతారు. ఆ బాలుడు పెరిగి పెద్దై ఇంగ్లీషుస్రీని వివాహం చేసుకుంటాడు. జస్సికా తండ్రి స్మృతుల జాడలు పట్టుకుని ఆవూరికి వస్తుంది.
గోండ్ బాలిక ఒకరు స్కేటింగ్.లో సాధించిన విజయాన్నే సినిమాగా తీశారని అంటారు. దర్శకురాలు మంజరీమఖీజాని ఆ కుగ్రామంలో కులవివక్ష, స్త్రీలపట్ల తక్కువచూపు, ఆడపిల్లలకు బాల్యంలోనే పెళ్ళిచెయ్యడం, ఊరిపెత్తందార్లు, ప్రభుత్వం బాలికావిద్య, గ్రామీణపేదలపట్ల చూపే నిర్లక్ష్యం వంటి అనేక అంశాలను మాటల్లో ఏమీ చెప్పకుండానే చెప్పారు. జెస్సికా తనతండ్రి జన్మించిన ఊరికి ఏదైనా చేయాలనే కాంక్ష కూడా ఇందులో ఇమిడి ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని దర్శకురాలు బాగా పట్టుకున్నారు. వహీదా రెహమాన్ జెస్సికాకు సహకరించిన ధనికురాలుగా చాలా హుందాగా కనిపించారు. సినిమా చాలా బాగుంది.