స్టిల్ లైఫ్ ఫోటోగ్రఫీ
నిశ్చల వస్తువులని (ప్రకృతిసిద్ధమైనవి, కృత్రిమమైనవి లేదా మానవుడు సృష్టించినవి) విషయాలనిగా ఎంచుకొని, వాటిని ఒక గుంపుగా పేర్చి ఛాయాచిత్రకళతో అందంగా చిత్రీకరించటమే నిశ్చల సజీవ ఛాయాచిత్రకళ (ఆంగ్లం: Still Life Photography). ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ లేదా పోర్ట్రేయిట్ ఫోటోగ్రఫీ లతో పోలిస్తే స్టిల్ లైఫ్ ఫోటోగ్రఫీలో అంశాల యొక్క రూపకల్పన, వాటి కూర్పులో ఫోటోగ్రఫర్ కి ఎక్కువ వెసులుబాటుని కల్పిస్తుంది. ఇతర రకాల ఫోటోగ్రఫీతో పోలిస్తే స్టిల్ లైఫ్ ఫోటోగ్రఫీ సులభం. ఒక్క సారి విషయాలని అమర్చుకొనగలిగితే, కాంతి అమరిక, కెమెరా సెట్టింగులని మార్చుకొనటానికి కావలసినంత సమయం ఉంటుంది. స్టిల్ లైఫ్ ఫోటోగ్రఫీలో అంతిమ ఫలితాన్ని పొందటం కూడా కష్టతరం/అసాధ్యం కాదు. విషయాన్ని సాధ్యమైనంత క్లుప్తంగా, సున్నితంగా, సరళంగా చిత్రీకరించగలిగితే చాలు.
చిత్రీకరిస్తున్న విషయంపై ఫోటోగ్రఫర్లు కాంతి ప్రసరణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపటంతో బాటుగా కూర్పులో పనితనాన్ని కనబరచవలసిన అవసరం ఉంటుంది. దీని వలనే స్టిల్ లైఫ్ ఫోటోగ్రఫీ అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకొన్నది. ప్రసరిస్తున్న కాంతి సహజ సిద్ధమైనది అయి ఉండవచ్చును, లేదా ఫ్ల్యాష్ లైట్ల/స్టూడియో లైట్ల ద్వారా కృత్రిమంగా అమర్చబడి ఉండవచ్చును. ఈ రకమైన ఛాయాచిత్రకళలో ఫోటోగ్రఫర్ ఛాయాచిత్రాన్ని యథాతథంగా తీయటం కన్నా, దాన్ని కంటికి ఇంపుగా కనబడేటట్లు చేయటం, వాస్తవదూరంగా, ఊహాజనితంగా చిత్రీకరించగలగటమే ఎక్కువగా ఉంటుంది. ఉపరితలాలని ఎంచుకోవటం, దానిపై వస్తువులని పేర్చటంలో నైపుణ్యం కూడా ఇందులో ప్రత్యేక పాత్రని పోషిస్తుంది.
పుష్పాలు, తాజా పళ్ళు, కూరగాయలు, పూల కుండీలు వంటివే స్టిల్ లైఫ్ లో అధికంగా చిత్రీకరించబడిననూ, కొందరు ఛాయాచిత్రకారులు విభిన్న అంశాలని కూడా ఎంచుకోకుండా పోలేదు. కదలకుండా ఉండే అంశాలకి తగినట్లుగా కాంతిని అమర్చుకోవటం వాటి ద్వారా తాము కలిగించదలచుకొన్న భావాలని కలిగించేలా చిత్రీకరించగలగటంలోనే స్టిల్ లైఫ్ ఫోటోగ్రఫీ యొక్క రహస్యం దాగి ఉంది.
రకాలు
మార్చు- సాంప్రదాయికం - ఒకే రకమైన విషయాన్ని చిత్రీకరించటం. ఉదా: యాపిళ్ళు, నారింజలు. లేదా ఒకే యాపిల్, ఒకే నారింజ.
- అధునాతనం - అధునాతన వస్తువులని విషయాలని ఎంచుకోవటం. కూర్పులో అధునాతన పద్ధతులని పాటించటం
- చిహ్నాత్మకం - చూపబడిన వస్తువులు చిహ్నాత్మకంగా ఉంటాయి
- స్థాపన - అమరిక మరీ ఎక్కువ పాళ్ళలో ఉండకుండా
విషయాలు
మార్చుఆసక్తిని బట్టి ఒక్కొక్క ఫోటోగ్రఫర్ ఒక్కొక్క విషయాన్ని ఎంచుకొంటాడు
ప్రకృతి సిద్ధాలు
మార్చు- అగ్ని
- పొగ
- పుష్పాలు
- శాకాహారం/మాంసాహారం
- రాయి
- ఫలాలు
- మొదలగునవి.
మానవ సృష్టి
మార్చు- పుస్తకాలు
- నగలు
- విద్యా ఉపకరణాలు
- అద్దం/గాజు
- పైపులు/ట్యూబులు
- శిల్పాలు
- కత్తులు, స్పూనులు, కప్పులు, గిన్నెలు, సీసాలు, కుండలు వంటి వంట సామాను
- మొదలగునవి.
మెళకువలు
మార్చు- కాంతి లభ్యతని బట్టి, ఫిలిం లేదా ఇమేజ్ సెన్సర్ యొక్క ఐ ఎస్ ఓ స్పీడ్ని బట్టి బహిర్గతం కావలసినంత సుదీర్ఘంగా ఉండాలి. దీని వలన రంగులు స్పష్టంగా నమోదవుతాయి.
- కాంతి ప్రసరణ విస్తారంగా, సమంగా ఉండేలా చూసుకోవాలి. కాంతి వలన ఏర్పడే నీడలు మరీ నలుపుగా ఉండకూడదు.
- స్థిరంగా ఉండకపోవటం వలన ఫ్ల్యాష్-లైట్లు, సమంగా ఉండకపోవటం వలన (వర్షాకాలంలో) సూర్యకాంతి స్టిల్ లైఫ్ ఫోటోగ్రఫీకి అనుకూలించవు. స్టూడియో లైట్లే సరియైనవి.
- నేపథ్యం దృష్టిని మరల్చేలా, ఎత్తికొట్టే రంగులతో, ఎంచుకొన్న విషయం కన్నా ఎక్కువ ఆకర్షణీయంగా ఉండకూడదు. మృదువుగా, లీలగా ఉన్నట్లయితే ఎంచుకొన్న విషయం పై దృష్టి కేంద్రీకరించబడుతుంది.
ఉపయోగాలు
మార్చు- గ్రీటింగు కార్డులు (పూల కుండీలు, పుష్పాలు, పళ్ళు)
- వ్యాపార ప్రకటనలు (ఫ్రిజ్ లో పళ్ళు, కూరగాయలు తాజాగా ఉంటాయని ప్రకటిస్తూ)
- ఉత్పత్తుల ప్యాకింగ్ ల పై
- కేవలం ఛాయాచిత్రకారుని ప్రతిభని చూపించుకొనుటకు
చిత్రమాలిక
మార్చుకలర్
మార్చు-
ఒక గాజు పాత్రలో పేర్చిన పుష్పాలతో స్టిల్ లైఫ్ ఫోటో
-
క్రిస్మస్ పండుగని సూచించే స్టిల్ లైఫ్ ఫోటో
-
పెరటి సన్నివేశాన్ని చిత్రీకరించబడ్డ ఒక స్టిల్ లైఫ్ ఫోటో
-
గింజలు, కాఫీ కప్పు గల స్టిల్ లైఫ్ ఫోటో
బ్లాక్ అండ్ వైట్
మార్చు-
బ్లాక్ అండ్ వైట్ లో లేత కొబ్బరి యొక్క స్టిల్ లైఫ్ ఫోటో
-
తెల్లని కోడిగుడ్లు, వాటి నల్లని నీడలతో అందంగా తీయబడిన బ్లాక్ అండ్ వైట్ స్టిల్ లైఫ్ ఫోటో
-
అల్లబడిన బుట్టలు, పాత్రలు, జాడీల బ్లాక్ అండ్ వైట్ స్టిల్ లైఫ్ ఫోటో
-
బ్లాక్ అండ్ వైట్ లో ఒక పూలకుండీ
-
అస్థిపంజరం, పుర్రె, శిలువ, ఇసుక గడియారంతో ఒక బ్లాక్ అండ్ వైట్ స్టిల్ లైఫ్ ఫోటో
-
ఒక ఉద్యానవనంలో పాలరాతితో చెక్కబడిన శిల్పాలతో బ్లాక్ అండ్ వైట్ స్టిల్ లైఫ్ ఫోటో
-
కత్తులు, సంగీత వాయిద్యాలతో ఒక బ్లాక్ అండ్ వైట్ స్టిల్ ఫోటో