జానపద సాహిత్యంలో స్త్రీల పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. పేరు తెలియని ఎందరో అజ్ఞాత రచయిత్రులు/రచయితలు ఈ జానపద గేయాలకు కర్తలు. స్త్రీలు వివిధ సందర్భాల్లో ఆలపించే ఈ గీతాల్లో ప్రధాన పాత్రలు సీతారామ లక్ష్మణాదులు, పాండవ కృష్ణాదులు ఐనా కథలన్నీ ఆనాటి కుటుంబాల్లోని వివిధ ఆచారాలు, వ్యవహారాలు, జీవనవిధానం వంటివి కనిపిస్తాయి. ఒకనాటి సామాజిక వ్యవస్థలకు ఇవన్నీ ప్రతీకలుగా నిలుస్తాయి. ఈ గ్రంథంలోని వేయి పైచిలుకు పుటల్లో శ్రీకృష్ణజననము, లక్ష్మణదేవరనవ్వు, శ్రావణమంగళవారం పాట, సీతసమర్త, సీతాదేవి ఆనవాలు, చిలుకముగ్గుల పాట, ధర్మరాజు జూదము, పారుజాత పల్లవి, శ్రీరామ దండములు, పెండ్లి గోవింద నామాలు, తలుపు దగ్గర పాటలు (సంవాదము), మంగళహారతులు, సీతాదేవి వేవిళ్లు, మేలుకొలుపులు, గజేంద్రమోక్షము, లక్ష్మీదేవి సొగటాలాట, గంగాదేవి సంవాదము, లంకాయాగము మొదలైన ఎన్నో స్త్రీల గేయాలు ఉన్నాయి.

వీనిని కాళహస్తి తమ్మారావు సన్సు, రాజమండ్రి వారు 1946 లో ప్రచురించారు.

పాటలు

మార్చు
  1. శ్రీకృష్ణుని జననము
  2. ఊర్మిళాదేవి నిద్ర
  3. శ్రావణమంగళవారపు పాట
  4. సీత సమర్త
  5. సీతాదేవి ఆనవాలు
  6. మదనద్వాదశి అనే చిలుకుముగ్గుల పాట
  7. ధర్మరాజు జూదము
  8. పారుజాత పల్లవి
  9. త్రిపురాసుర సంహారము
  10. శ్రీరామ దండములు
  11. గోవుపాట
  12. శ్రీరామస్తుతి
  13. పెండ్లిగోవిందనామములు
  14. కుమార్తెను అత్తవారింటికి పంపెడు పాట
  15. లక్ష్మీదేవి వర్ణనము
  16. ఈశ్వర భృంగి వాదము
  17. మేనకకు పార్వతికి వాదము
  18. అప్పగింతల పాటలు
  19. తలుపు దగ్గర పాటలు
  20. మంగళ హారతులు
  21. సీతాదేవి వేవిళ్ళు
  22. సీతాదేవి వామనగుంటలాడు పాట
  23. మేలుకొలుపులు
  24. గజేంద్రమోక్షము
  25. తిరుమంత్రపు కీర్తన
  26. లక్ష్మీదేవి సొగటాలాట
  27. యశోదకొంగ పాట
  28. గంగాగౌరీ సంవాదము
  29. భ్రమరాంబికాష్టకము
  30. తులసీ గోవిందనామములు
  31. రామమానస పూజ
  32. ప్రయాగధవళం
  33. సుభద్ర సారె
  34. లంకా యాగము
  35. బాలనాగమ్మ కథ
  36. ఆత్మబోధామృత తత్త్వములు
  37. ఆరు మరాటీల కథలు
  38. కోలాట కీర్తనలు
  39. నాగమ్మ
  40. వరహావతార చరిత్రము
  41. కుశలాయకము
  42. సన్యాసమ్మ కథ
  43. మైరావణ చరిత్రము
  44. కాలజ్ఞాన తత్వములు
  45. గంగా వివాహము
  46. లక్ష్ముమమ్మ కథ
  47. కామమ్మ కథ
  48. శాంత గోవిందనామములు
  49. కుశలవుల యుద్ధము
  50. షత్త్రింశతత్వ కీర్తనలు
  51. శివ కీర్తనలు

మూలాలు

మార్చు