స్నో వరల్డ్
స్నో వరల్డ్ అనగా రెండు ఎకరాల (0.81 హెక్టార్లు) స్థలంలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్న ఒక వినోద ఉద్యానవనం. ఇందిరా పార్క్ పక్కన, హుస్సేన్ సాగర్ సరస్సు వెంబడి ఉన్న ఈ పార్క్ 28 జనవరి 2004 న ప్రారంభించబడింది.
Location | హైదరాబాద్, తెలంగాణా, భారతదేశం |
---|---|
Coordinates | 17°30′54″N 78°28′51″E / 17.514877°N 78.48087°E |
Owner | ఓషన్ పార్క్ మల్టీటెక్ లిమిటెడ్.[1] |
Opened | 28 జనవరి 2004[2] |
Operating season | సంవత్సరం మొత్తం |
Area | 2 ఎకరాలు (0.81 హె.) |
నేపథ్యం
మార్చుఓషన్ పార్క్ మల్టీటెక్ లిమిటెడ్ సంవత్సరానికి రూ.3.6 మిలియన్ల (US$60,000) చొప్పున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి 33 ఏళ్ల పాటు 2 ఎకరాల (0.81 హెక్టార్లు) ప్లాట్ ను లీజుకు తీసుకుంది. లీజు మొత్తం ప్రతి సంవత్సరం 5% పెంచబడుతుంది. రూ.20 మిలియన్ల ఖర్చుతో నిర్మితమై 17,000 చదరపు అడుగుల (1,600 m2) సౌకర్యంతో ఉన్న దీని రూపకర్త నితీష్ రాయ్, ఇతను భారత ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్, రూపకర్తగా బాగా గుర్తింపు. ఈ ప్రత్యేక స్నో సౌకర్యం స్థానిక పర్యాటక శాఖ సహకారంతో నిర్మింతమైంది, ఇది భారతదేశంలో మొదటిది, ప్రపంచంలో అతిపెద్దది, మలేషియా, సింగపూర్ లో ఉన్నటు వంటి స్నో పార్క్ ల తరువాత మూడవది. జనవరి 28, 2004 న అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు.
సౌకర్యాలు
మార్చురెండు వందల టన్నుల కృత్రిమ మంచును ఇక్కడ గచ్చు మీద పొరలుగా వేశారు, ఈ మంచు కరిగి ప్రవహించకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మంచు యొక్క పై పొర శుభ్రపరుస్తారు, దీనిలో అదనంగా రెండు మూడు టన్నుల మంచు ఉత్పత్తి చేసే సౌకర్యాలున్నాయి, ఈ మ్ంచును పై పొరగా ఉపయోగిస్తారు. కృత్రిమ మంచుగళ్లు తయారు చేయడానికి ఆస్ట్రేలియా నుండి తెప్పించిన పేటెంట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు.
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ A, Roy Chowdhury (12 December 2003). "Blizzard zone". The Hindu. Archived from the original on 4 జూన్ 2011. Retrieved 2 October 2010.
- ↑ Chunduri, Mridula (28 January 2004). "Wait a bit longer to play in the snow". The Times of India. Archived from the original on 3 నవంబరు 2012. Retrieved 2 October 2010.