స్పూర్తి ప్రదాతలు
"స్ఫూర్తి ప్రదాతలు” "స్ఫూర్తి ప్రదాతలు” ఇరవైమంది విశిష్ట వ్యక్తుల జీవిత రేఖలను ఎ.రజాహుస్సేన్ ఈ చిన్న పుస్తకంలో ప్రదర్శించారు. వీరిలో కొందరు సాధారణ మానవుల కన్నా భిన్నంగా, దేహ సంబంధమైన ఇబ్బందులున్నా ఆయారంగాల్లో అసాధారణ ప్రజ్ఞ ప్రదర్శించిన వ్యక్తులు. అటువంటివారిలో ఫిడేలు నాయుడు గారు, సంజీవరాయశర్మ గారలను గురించి ఈ చిరుపొత్తంలో అద్భుతంగా చిత్రించారు. ఇందులో వర్నించబడిన కథానాయకులు కొందరు సజీవులు, కొందరు కీర్తిశేషులు. అధ్యాపకులు ఈ స్ఫూర్తి ప్రదాతలను విద్యార్థులకు పరిచయం చేసేందుకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పైడిరాజు బొమ్మలతో పరిచయంలేనివారు వారి జీవితం గురించి మొదటిసారి ఈపుస్తకంలో చదవచ్చు. ప్రకృతి ముద్దుబిడ్డ జాజి పరిచయం ప్రత్యేకం. సినిమా నటులు, పారిశ్రామిక వేత్తలను గురించి ఎవరైనా రాస్తారు. ఈ మట్టిలో దాగిన మాణిక్యాల పరిచయం అభినందించదగిన ప్రయత్నం.
మూలాలు:Tirnga Musalman Publications, 11-5-410,Flat no 402, Lili Block, N.K.Apartments, Red hills, Hyd. 500 004. Ph 9063167117.