సాలెగూడు

(స్పైడర్ వెబ్ నుండి దారిమార్పు చెందింది)

సాలెగూడు అనగా సాలెపురుగు గూడు, దీనిని ఆంగ్లంలో "స్పైడర్ వెబ్" అంటారు. ఇది జిగురుగా ఉండే ఒక వల వంటిది, సాలెపురుగులు తనకు కావలసిన ఆహారాన్ని బంధించేందుకు వాటి ఉదరము నుంచి స్రవించే పట్టు వంటి దారంతో దీనిని తయారు చేస్తాయి. కీటకాలు ఎగురుతూ వచ్చి, లేదా ప్రాకుతూ వచ్చి ఈ వెబ్ లో చిక్కుకున్నపుడు అవి తప్పించుకోలేవు, అప్పుడు సాలీడు ఆ కీటకాలను తినేస్తుంది. అత్యధిక సాలెగూడులు చాలా సన్నగా ఉంటాయి, కానీ చాలా బలంగా కూడా ఉంటాయి. వివిధ రకాల సాలీడులు వివిధ రకాల సాలెగూడులను తయారు చేస్తాయి. సాలెపురుగులు ఆహారాన్ని బంధించేందుకు వివిధ ప్రదేశాల్లో అనేక రకాలుగా ఈ వెబ్స్ ను తయారు చేస్తాయి.

సాలెపురుగు గూడు నిర్మాణమును అనుసరించి వరల్డ్ వైడ్ వెబ్ అనే పేరు తీసుకొనబడింది.
వెస్ట్రన్ ఆస్ట్రేలియా, కరిజిని లో గుండ్రంగా చుట్టవలె అల్లబడిన సాలెపురుగు గూడు

అద్భుతమైన నిర్మాణం

మార్చు
'లారినియోయిడ్స్ కార్న్యూటస్ దాని గూడును నిర్మిస్తుంది.

సాలెగూడు ఒక అద్భుతమైన నిర్మాణం, అనేక రకాల సాలెగూడులలో ఎనిమిది కోణాలు గల అష్టభుజి గూడూలు ఉంటాయి, ప్రామాణికమైన శాస్త్రపరికరంతో కొల్చినా ఆ జిగురు దారపు గీతలు సరిసమానంగా ఉంటాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు

యితర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సాలెగూడు&oldid=3682558" నుండి వెలికితీశారు