స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు

స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు నిర్దేశించిన పీడనం కన్న ఎక్కువ పీడనం ఏర్పడినపుడు స్టీము స్వయం ప్రేరితంగా తెరచుకుని ద్రవాలను లేదా వాయువులను (నీటి ఆవిరి కూడా ఒకరకంగా వాయు రూపమే)విడుదలచేయు ఒక ఉపకరణం[1].ఈ వ్యాసంలో బాయిలరు మీద అమర్చి వాడు స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వును గురించి వివరించబడింది. బాయిలరులలో మాములుగా బాయిలరు పనిచేయు పీడనానికి మించి పీడనం ఏర్పడినపుడు, ఆ పీడనం ఎక్కువ సేపు అలా కోనసాగినపుడు,అధికంగా ఏర్పడిన పీడన వత్తిడి బాయిలరు షెల్ మీద తీవ్ర ప్రభావం చూపి, బాయిలరు పేలి పొయ్యి తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం కల్గును. బాయిలరులో బాయిలరు పనిచేయు పీడనం కన్నఎక్కువ పీడనంలో స్టీము ఏర్పడినపుడు,ఈ సేఫ్టి వాల్వు తెరచుకుని అధికంగా ఏర్పడిన స్టీమును బయటి వాతావరణం లోకి విడుదల చేయును. బాయిలరుకు రెండు సేఫ్టి వాల్వులు/రక్షక కవాటాలు బిగింపబడి వుండును. అలాబిగించిన రెండు సేఫ్టి వాల్వులలో ఒకటి బాయిలరు పనిచేయు పీడనం కన్న అరకేజీ ఎక్కువ వత్తిడిలో తెరచుకునేలా మరొకటి వర్కింగు ప్రెసరు కన్న ఒక కేజీ ఎక్కువ పీడనం వద్ద తెరచు కునేలా స్థిరపరుస్తారు.ఏదైనకారణం వలన మొదటి వాల్వు తెరచు కొననిచో రెండవ వాల్వు తెరచు కొనడం వలన ప్రమాదం తప్పును.

స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు
స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు రేఖా చిత్రం

సేఫ్టి వాల్వులలోని కొన్నిరకాలుసవరించు

 • డైరెక్టు స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు
 • లివరు అండ్ వెయిట్ లోడెడ్ సేఫ్టి వాల్వు
 • హై లిఫ్ట్ సేఫ్టి వాల్వు
 • ఫుల్ లిఫ్ట్ సేఫ్టి వాల్వు

స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు నిర్మాణంసవరించు

సేఫ్టి వాల్వ్ /వాల్వు ప్రధాన భాగం కాస్ట్ ఐరన్/పోత ఇనుముతో చేయబడి 90 డిగ్రీల కోణంలో ఫ్లాంజిలు వున్న రెండు పైపు వంటిబాగాలు కల్గివుండును.నిలుగు ఫ్లాంజి భాగం బాయిలరు షెల్/డ్రమ్ము పైనున్న ఉక్కు పైపు ఫ్లాంజికి బోల్టుల సహాయంతో బిగింపబడి వుండును. రెండవ పక్క ఫ్లాంజికి ఒక ఉక్కు పైపు బోట్లులతో బిగింపబడి, బాయిలరు షెడ్ బయటి వరకు,వుండును. సేఫ్టి వాల్వు తెరచుకున్నప్పుడు బాయిలరు నుండి విడుదల అయ్యిన స్టీము ఈ పైపు ద్వారా బయటికి వెళ్ళును. పోత ఇనుము బాడీ నిలువు భాగంలో లోపలమందమైన పైపువంటి నిర్మాణం వుండి దాని రంధ్రం మీద స్టీలుతో చేసిన నునుపైన ఉపరితలం వున్న వాలు సిటింగు బిగించి వుండును. దీని మీద వాల్వు డిస్క్ ఉండును. ఈ వాల్వు డిస్క్ వాల్వు సిటింగు రంధ్రాన్ని మాములు సమయాల్లో కప్పి వుంచును.ఇది కూడా నునుపైన ఉపరితలం కల్గి వుండును.వాల్వ్ సిటింగుపైన వాల్వుడిస్కువు వుంచిన రెండు కలిసిన ప్రాంతంలోఎటువంటి ఖాళి లేకుండా అతుక్కు పోయినట్లు వుండును.డిస్కు పైభాగానికి పొడవైన ఒక స్టీలు కడ్డి/rod వుండును. స్టీలు స్పిండీల్ రాడ్ పొడవుగా వుండి,ఈ రాడ్/స్టీలు కడ్డీ చుట్టూ పోత ఇనుము బాడీ పై భాగాన స్ప్రింగు హౌసింగు వుండును. హెలికల్ స్టీలు స్ప్రింగ్ ఒక చివర వాల్వు డిస్క్ ను పట్టుకుని వుండగా స్ప్రింగు రెండవ చివర డిస్క్ రాడు పైభాగాన వుండును. స్ప్రింగు హౌసింగ్ పైన వున్నఒక నట్/నట్టు(మరలు ఉన్న కడ్ది) కు బిగించిన బోల్టును తిప్పడం వలన స్ప్రింగు దగ్గరగా నొక్కబడి వాల్వు డిస్క్ ను బలంగా వాల్వు సిటింగు మీద నొక్కడం వలన వాల్వు సిటింగు, వాల్గు డిస్కు మధ్య ఎటువంటి ఖాళి లేనందున బాయిలరు మామూలు పీడనంలో వున్నప్పుడు స్టీము బయటికి రాదు.బొల్టు వంటిదానితో డిస్కు రాడ్/కడ్డిని మీద స్ప్రింగును దగ్గరగా నొక్కడం వలన వాల్వు డిస్కు మీద వత్తిడి కలగడం వలన వాల్వు డిస్కు వాల్వు సిటింగు మీద గట్టిగా నొక్కబడి వుండును.స్ప్రింగు ఈ విధంగా వాల్వు డిస్కు మీద కలుగు చేయు ఫోర్సు/బలాన్ని డౌన్ వర్డ్ ఫోర్సు అంటారు[2].

స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు లోని భాగాలుసవరించు

 • 1.బాడీ
 • 2.నాజిల్
 • 3.నాజిల్
 • 4.వాల్ సిటింగ్ రింగు
 • 5. వాల్వుడిస్కు(మూత)
 • 6.డిస్కు హోల్డరు
 • 7.గైడు
 • 8.స్పిండిల్/ స్టీలుకడ్డి
 • 9.స్టీలు స్ప్రింగు
 • 10.స్ప్రింగు హౌసింగు/ బోనేట్
 • 11.సరిదిద్దు స్క్రూ/ అడ్జస్టబుల్ స్క్రూ
 • 12.లివరు హ్యాండిల్
 • 13.క్యాప్ లేదా పైకప్పుమూత

బాడీకి ఉన్న టేపరు (అనగా కింద విశాలంగా వుండి పైన తక్కువ వ్యాసంతో రంధ్రాన్ని కల్గి వున్న నిర్మాణం) నాజిల్ అనేది బాయిలరు స్టీము ప్రవేశ మార్గం. డిస్కు అనేది నాజిల్ రంధ్రాన్ని,మూసివుంచే మూత. స్పిండీల్ రాడ్ అనేది పొడవుగావున్నస్తుపాకార స్టీలుకడ్డీ. దీని ఒకచివర డిస్కు పైన్నున గైడరులోకి వుండును. రొండో చివర మరలు వుండి దానికి ఒక నట్టు(nut)వుండును.స్పిండిల్ రాడుకు గైడరు కన్న పైభాగంలో స్థిరంగా వున్న వర్తులాకార ప్లేటువుండును.దీని మీద స్రింగు కింది భాగం కూర్చోని/ఆని వుండును. పైభాగాన సులభంగా స్పిండిలు మీద పైకి కిందికి కదిలే మరో వర్తులాకార ప్లేటువుండును.దీనిని స్ప్రింగు పైభాగాన వుంచెదరు. పై ప్లేటును ఆనుకుని స్పింగు హౌసింగు పైన వున్నఒకనట్టు వంటి దానిలో తిరిగే అడ్జస్టబుల్ స్క్రూ వుండును. ఈ అడ్జస్టబుల్ స్క్రూను నట్టులో పైకి కిందికి కదిలించడం వలన స్పింగు వదులుగా బిగుతుగా అగును. స్ప్రింగును దగ్గరగా నోక్కేకొలది వాల్వు డిస్కు మీద అధోపీడనం పెరుగును.వదులు చేసిన డిస్కు మీద అదో పీడనం తగ్గును. స్రింగు చుట్టూ, బాడీ మీద రక్షణగా స్ప్రింగు హౌసింగు వుండును.లివరు అనే స్టీలు హ్యాండిలును కీలు సహాయన స్పిండిలు పైభాగాన కలిపి వుండును.అప్పుడప్పుడు సేఫ్టి వాల్వు పని చేయుచున్నదా లేదా బిగుసుకు పోయిందాయని చేతితో లివరును పైకెత్తి నిర్దారణకై చేసుకోవచ్చు[1].

సేఫ్టి వాల్వు పనిచెయ్యు విధానంసవరించు

సాధారణ పరిస్థితిలో బాయిలరు,దాని పనిచేయు పీడనానికి లోబడి పనిచేయునపుడు, సేఫ్టివాల్వు డిస్కు మీద స్టీము కల్గించు పీడనం/, తోపుడుశక్తి కన్న వాల్వు డిస్కుపై స్ప్రింగు కల్గించు పీడనం ఎక్కువగా వుండును.వాల్వు డిస్కుపై స్ప్రింగు కల్గించు వత్తిడి బలాన్ని డౌన్‌వర్డ్ ఫోర్స్(అధోపీడన బలం),స్టీము వాల్వుపై కల్గించే వత్తిడి బలాన్ని ఉర్ధ్యపీడనబలం అంటారు.బాయిలరు మాములుగా పనిచేయునపుడు స్టీము ఉర్ద్య పీడన బలంకన్న స్ప్రింగు కల్గించు అధోపీడన బలంఎక్కువ కావున వాల్వు మూసుకుని వుండును. ఏదైనా కారణంచే బాయిలరులో ఏర్పడిన స్టీమును వాడనప్పుడు, బాయిలరులో స్టీము ఘనపరిమాణం పెరిగి,స్టీము పీడనం బాయిలరు పనిచేయు పీడన మితికన్నా ఎక్కువ అవ్వుతుంది.ఎప్పుడైతే బాయిలరులో మామూలు పనిచేయు పీడనాని కన్నఎక్కువ పీడనంతో స్టీము ఏర్పడు తుందో,స్టీము యొక్క ఉర్ద్య పీడన బలం స్ప్రింగు కల్గించు అధో పీడన బలం కన్నఎక్కువ ఎక్కువ కావడం వలన వాల్వు డిస్కు తెరచుకుని అధికంగా ఏర్పడిన స్టీము పక్కగొట్టం ద్వారా బయటికి వచ్చును.తిరిగి బాయిలరోని స్టీము అధిక పీడనం తగ్గి,స్ప్రింగు అదో పీడనబలం ఎక్కువ కాగానే వాల్వు డిస్కు వాల్వు సిటింగు రింగును మూసివేయును[3].

బయటి వీడియో లింకులుసవరించు

ఇవి కూడా చదవండిసవరించు

ఆధారాలు/మూలాలుసవరించు

 1. 1.0 1.1 "Safety Valve ~ Boiler Mountings". mech-engineeringbd.blogspot.in. Retrieved 16-01-2018. Check date values in: |accessdate= (help)
 2. "Why Are Relief Valves Used In A Boiler?". brighthubengineering.com. Retrieved 16-01-2018. Check date values in: |accessdate= (help)
 3. "Description of spring loaded safety valve:". mechanical-engineering-info.blogspot.in. Retrieved 16-01-2018. Check date values in: |accessdate= (help)