స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం

విశాఖపట్నంలో ఉన్న ఇండోర్ స్టేడియం

స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న ఇండోర్ స్టేడియం. వివిధ రకాల కార్యక్రమాలకోసం ఉపయోగించే ఈ స్టేడియం రేసపువానిపాలెం ప్రాంతంలో ఉంది.[1] వైజాగ్‌లోని పురాతన స్టేడియంలలో ఒకటిగా గుర్తించబడిన ఈ స్టేడియంలో 2,500 సీటింగ్ సామర్థ్యం ఉంది. మహా విశాఖ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ స్టేడియంలో పాఠశాలల వార్షిక సమావేశాలు, స్వచ్ఛ సర్వేక్షన్ ప్రచారాలు, క్రీడా కార్యక్రమాలు, కోవిడ్ టీకా డ్రైవ్‌ల వంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడ్డాయి.[2]

స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం
Locationరేసపువానిపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Ownerమహా విశాఖ నగరపాలక సంస్థ
Operatorమహా విశాఖ నగరపాలక సంస్థ
Capacity2,500
Website
[1]
రేసపువానిపాలెం
సమీపప్రాంతం
రేసపువానిపాలెం is located in Visakhapatnam
రేసపువానిపాలెం
రేసపువానిపాలెం
రేసపువానిపాలెం ప్రాంతం ఉనికి
Coordinates: 17°44′00″N 83°18′55″E / 17.733310°N 83.315314°E / 17.733310; 83.315314
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530013

కార్యక్రమాలు - క్రీడలు మార్చు

  1. ఈ స్టేడియంలో 2019 అక్టోబరు 12న ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దీపం వెలిగించి టోర్నమెంట్ ను ప్రాంరంభించాడు.[3]
  2. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 2014 జూలై నెలలో తొమ్మిది రోజులపాటు శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవం జరిగింది.[4]
  3. 2018 జనవరిలో జివి భారత్ ఆంధ్ర బ్యాడ్మింటన్ లీగ్ -2018 ప్రారంభ మ్యాజ్ జరిగింది.[5]
  4. 2018 ఫిబ్రవరిలో వైజాగ్ జిల్లా కబడ్డీ లీగ్ జరిగింది.[6]
  5. 2018 ఆగస్టులో ప్రో మాస్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్ (పిఎమ్‌బిఎల్) జరిగింది.[7]
  6. ఎన్నికల ఓట్ల లెక్కింపులు, కరోనా టీకాలు[8] జరిగాయి

మూలాలు మార్చు

  1. "All set for MLCÂ votes counting". The New Indian Express. Retrieved 2017-09-02.
  2. "Can you guess these places by their popular landmarks in Vizag?". Vizag (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-21. Retrieved 2021-07-18.
  3. India, The Hans (2019-10-13). "Vizag to be developed as sports hub". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-07-18.
  4. "Photos of the week: Andhra Pradesh and Telangana". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2014-07-27. Retrieved 2021-07-18.
  5. India, The Hans (2018-01-21). "City shuttlers romp home". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-07-18.
  6. India, The Hans (2018-02-21). "14 teams to take part in Kabaddi League". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-07-18.
  7. India, The Hans (2018-08-02). "Himalayan Tigers wins Pro Masters Badminton League trophy". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-07-18.
  8. "Coronavaccine: విశాఖలో బారులు". EENADU. Retrieved 2021-07-18.