స్వాతిచినుకు సందెవేళలో

వేటూరి సుందరరామమూర్తి రచించిన పాట


స్వాతి చినుకు సందె వేళలో లేలేత వణుకు అందగత్తెలో
మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటే
చలే కొరుకుతుంటే చెలే ఉరుకుతుంటే
భలేగుంది పడుచు ముచ్చట హోయ్
భలే కదా గాలి ఇచ్చట

స్వాతి చినుకు సందె వేళలో లేలేత వలపు అందగాడిలో
ఈడే ఉరుముతుంటే నీడే తరుముతుంటే
సరాగాలతోటే స్వరాలల్లుకుంటే
పద అంది పడుచు పూపొద హొయ్
ఇదే కదా చిలిపి ఆపద

ఈ గాలితో ఒకే చలి ఈ దెబ్బతో అదే బలి
ఈ తేమతో ఒకే గిలి ఈ పట్టుతో సరే సరి
నీ తీగకే గాలాడక నా వీణలే అల్లాడగా
నరాలన్ని వేడి పదాలెన్నో పాడ
వరాలిచ్చిపోరా వరించానులేరా
చల్లని జల్లుల సన్నని గిల్లుడు సాగిన వేళ కురిసిన

ఈ వానల కధేమిటో నా ఒంటిలో సొదెందుకో
నీ కంటిలో కసేమిటో నా కంటిని తడెందుకో
తొలి వానల గిలిగింతలో పెనవేసిన కవ్వింతలో
ఎదే మాట రాక పెదాలందు ఆడ
శ్రుతే మించిపోయి లయె రేగిపోగా
మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళ మెరిసిన