స్వామి అద్వైతానంద

ఆధ్యాత్మికవేత్త

అద్వైతానంద (28 ఆగష్టు 1828 - 28 డిసెంబర్ 1909) పందొమ్మిదవ శతాబ్దం చివరలో బెంగాల్ నుండి వచ్చిన ఒక హిందూ సన్యాసి. ఇతను రామకృష్ణ ప్రత్యక్ష శిష్యులలో ఒకరు, ఇతడిని బూరో గోపాల్ లేదా వృద్ధ గోపాల్ అని కూడా పిలుస్తారు. అతను రామకృష్ణ కంటే పెద్దవాడు, పెద్ద వయస్సులో సన్యాసం తీసుకున్నాడు. రామకృష్ణ మిషన్ ప్రారంభ సంవత్సరాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.[1]

అద్వైతానంద
স্বামী অদ্বৈতানন্দ
Advaitananda.jpg
అద్వైతానంద
జననంగోపాల్ చంద్ర ఘోష్
1828
కలకత్తా, బెంగాల్
నిర్యాణము1909
కలకత్తా, బెంగాల్
గురువురామకృష్ణ పరమహంస
తత్వంవేదాంతం

సన్యాస జీవితంసవరించు

1887లో గోపాల్ ఇతర శిష్యులతో కలిసి సన్యాసం స్వీకరించి, అద్వైతానంద అని పిలువబడ్డాడు. బారానగర్ మఠంలో కొన్ని సంవత్సరాలు గడిపిన తరువాత, అద్వైతానంద బెనారస్ కు వెళ్లి అక్కడ సుమారు 5 సంవత్సరాలు బస చేశారు.

వివేకానంద భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, అద్వైతానంద రామకృష్ణ మఠం మారిన అలంబజార్‌కు తిరిగి వచ్చాడు. అనంతరం బేలూరు మఠంలో కొత్త మఠం ఏర్పాటయ్యాక ఎక్కువగా అక్కడే ఉంటూ తోటపని, ఇతర నిర్వహణ వ్యవహారాలు చూసుకునేవారు. తన వృద్ధాప్యంలో కూడా అతను స్వయం సమృద్ధిగా ఉన్నాడు. మఠానికి తిరిగి వచ్చిన తర్వాత, బేలూరులో కొత్తగా కొనుగోలు చేసిన భూమిని చదును చేయడం, అక్కడ ఉన్న పాత నిర్మాణాల మరమ్మతులను చూడటం అద్వైతానంద ప్రత్యేక విధి. అతను తన చివరి రోజుల వరకు తపస్సుతో జీవించాడు.

మరణంసవరించు

అతను విస్తృతంగా పర్యటించాడు ఉత్తరాన కేదార్‌నాథ్, బద్రీనారాయణ్, హరద్వార్, పశ్చిమాన ద్వారక, రామేశ్వరం, దక్షిణాన ఉన్న ఇతర ప్రదేశాలతో సహా ఇతర పవిత్ర స్థలాలను సందర్శించాడు. చారమదశలో కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ, 28 డిసెంబర్ 1909న తన 81వ ఏట మరణించాడు.

మూలాలుసవరించు

  1. The Disciples of Sri Ramakrishna, published by Advaita Ashrama, 1943, pages 134-135