స్వామి నిర్మలానంద

కలకత్తాలో తులసి చరణ్ దత్తగా జన్మించిన నిర్మలానంద, భారతదేశానికి చెందిన 19వ శతాబ్దపు ఆధ్యాత్మికవేత్త, హిందూ సన్యాసి అయిన రామకృష్ణకు ప్రత్యక్ష శిష్యుడు. దక్షిణ భారతదేశంలో, కేరళ, బెంగుళూరు, తమిళనాడు, USA (బ్రూక్లిన్‌లో), బర్మా, బంగ్లాదేశ్‌లో రామకృష్ణ మఠం, మిషన్‌ను స్థాపించడంలో నిర్మలానంద కీలక పాత్ర పోషించారు.[1]

స్వామి నిర్మలానంద
జననంతులసి చరణ్ దత్తా
(1863-12-23)1863 డిసెంబరు 23
కలకత్తా, బెంగాల్, ఇండియా
నిర్యాణము1938 ఏప్రిల్ 26(1938-04-26) (వయసు 74)
ఒట్టపాలెం, కేరళ, బ్రిటిష్ ఇండియా
గురువురామకృష్ణ పరమహంస
తత్వంఅద్వైతం

ఆధ్యాత్మిక జీవితం మార్చు

తులసి, తన ఇతర సోదర శిష్యుల వలె, వివేకానంద నుండి తన సన్యాస ప్రతిజ్ఞను పొందారు, నిర్మలానంద (నిర్మల - కళంకం లేకుండా") అనే కొత్త పేరును పొందారు. బారానగర్, అలంబజార్ మఠం రెండింటిలోనూ సోదర శిష్యులకు సేవ చేయడంలో నిర్మలానంద రామకృష్ణానందకు సహాయం చేస్తూ, అవిశ్రాంతంగా పనిచేసేవాడు.[2]

సూక్తి మార్చు

స్వామి నిర్మలానంద చెప్పిన ప్రముఖ సూక్తుల్లో ముఖ్యమైంది "ధ్యానంలో నిజమైన పురోగతి సాధించాలంటే, మీరు ఏ పనిలో నిమగ్నమైనా, మనస్సులో కొంత భాగాన్ని ఎల్లప్పుడూ భగవంతుడికి ఇవ్వాలి. మీరు అలా చేయగలిగితే, మీరు ధ్యానానికి కూర్చున్న వెంటనే మీ మనస్సు ఏకాగ్రత పొందుతుంది. చిన్నపాటి సాధన ద్వారా భగవంతుని ఆలోచనను అన్ని పరిస్థితులలోనూ నిరంతరం ఉంచుకోవచ్చు. మీకు పంటి నొప్పి ఉందనుకోండి, నిరంతర నొప్పి ఉన్నప్పటికీ మీరు మీ రోజువారీ విధులకు హాజరు కాలేకపోతున్నారా? అంటే లేదు కదా! అలాగే కొద్దిపాటి అభ్యాసం ద్వారా మీరు ఒక్క క్షణం కూడా భగవంతుని ఆలోచనను వదులుకోలేని స్థితికి చేరుకుంటారు."[3]

మూలాలు మార్చు

  1. "Swami Nirmalananda: His life and teachings" (PDF). vivekananda.net. Retrieved 23 January 2014.
  2. "Swami Nirmalananda, his Life and Teachings Page 18" (PDF). vivekananda.net. Retrieved 23 November 2011.
  3. The Memoirs of Sri Ramakrishna, by Swami Abhedananda, 1907, an English translation of the Sri Sri Ramakrishna Kathamrita by M, page 454