హంసధ్వని రాగం
హంసధ్వని రాగం హంస ధ్వని అంటే ఉచ్చ్ శ్వాస.. నిచ్ శ్వాసల ప్రక్రియనే హంస జపం దాని మూలం ఓకారం ముకారం ఉకారం శబ్ధ తరంగమే ధ్వని .హంసద్వని రాగం నాదమే బ్రహ్మం (Hamsadhvani, సంస్కృతం: हम्सध्वनि) కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలలో ఒక జన్య రాగం.[1] దీనిని సామాన్యంగా ధీర శంకరాభరణం జన్యంగా భావిస్తారు.
రాగ లక్షణాలు
మార్చుహంసధ్వని రాగం లో మధ్యమం గాని ధైవతం గాని లేవు. దీనిలోని స్వరాల ఆరోహణ అవరోహణలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ārohaṇa : S R2 G3 P N3 S
avarohaṇa : S N3 P G3 R2 S
ఈ రాగంలోని స్వరాలు: షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం, కాకళి నిషాధం.
రచనలు
మార్చుహంసధ్వని రాగం లో చాలా కీర్తనలు సాంప్రదాయ, సినీ సంగీతంలో ఉన్నాయి. ఇది సామాన్యంగా కచేరీ ప్రారంభంలో గానం చేయబడుతుంది. చాలా కీర్తనలు విఘ్నేశ్వరుని ప్రార్ధనగా రచించబడ్డాయి.
- రఘుకుల నాయక, శ్రీ రఘుకుల - త్యాగరాజ స్వామి
- గజవదన బేడువే - పురందర దాసు
- గం గణపతే - ముత్తయ్య భాగవతార్
- వాతాపి గణపతిం భజే - ముత్తుస్వామి దీక్షితులు
మూలాలు
మార్చు- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications