ఈశాన్య భారత రాష్ట్రాలు, బంగ్లాదేశులలో కనిపించే హజాంగు ప్రజలు భారత ఉపఖండానికి చెందిన గిరిజన ప్రజలలో ఒకజాతిగా గుర్తించబడు తున్నారు . [1] హజాంగులలో ఎక్కువ భాగం భారతదేశంలోనే స్థిరపడ్డారు. హజాంగులు రైతులు ప్రధానంగా వరిపంట పండిస్తుంటారు.[2]వారు గారో పర్వతాలలోకి తేమ-క్షేత్ర సాగును తీసుకువచ్చినట్లు భావిస్తున్నారు. ఇక్కడ గారో ప్రజలు వ్యవసాయం చేయడానికి " స్లాషు, బర్ను " పద్ధతిని ఉపయోగించారు. హజాంగుకు భారతదేశంలో షెడ్యూల్డు తెగ హోదా ఉంది.[3][4]

Hajong
Hajong girls performing folk dance during the Hornbill Festival.
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
 India71,800
 Bangladesh8,000
భాషలు
Hajong
మతం
Hinduism, Dyaoism, Christianity

ఆవిర్భావం

మార్చు
 
Hajong women fishing with 'Jakha' a traditional fishing implement.

హజాంగు ఇండో-టిబెటను సమూహానికి చెందినది తెగ. తెగ మూలం, దాని పేరు, భారతదేశానికి వలస రావడం మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది రచయితలు సువార్తికుడు సిడ్నీ ఎండ్లే, బి.సి. యూరోపియను వలసరాజ్యాల శక్తుల సమయంలో సమాజాలలో ప్రాచుర్యం పొందిన మౌలికవాద క్రైస్తవ జాతివాద సిద్ధాంతాలకు అనుగుణంగా హాజాంగులు గొప్ప "బోడో జాతి" శాఖ అని అలెన్ అభిప్రాయపడ్డాడు. వారు టిబట్టు పీఠభూమి (ఆధునిక క్వింఘై) నుండి ఈశాన్య భారతదేశానికి బ్రహ్మపుత్ర, టిస్టా నదులు, వాటి ఉపనదుల వెంట వచ్చి సంకుషు లోయలో వ్యాపించారు. హజాంగులు వారి పూర్వీకుల నివాసం ప్రస్తుత అస్సాంలోని నల్బరి జిల్లా ప్రాంతంలో ఉందని హజోంగ్సు పేర్కొన్నారు. 'హజోంగు' అర్ధాన్ని 'హజో వారసులు' అని గ్రహించవచ్చు.[5] హజాంఘులలో ప్రాచుర్యం పొందిన ఒక పురాణం ఆధారంగా వారు సూర్యవంశీ (హజాంగులోని సుర్జో బంగ్-షి) లేదా సుర్జో లేదా బిలా (సూర్య దేవుడు)వారసులు, క్షత్రియులు.[6] ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశు సరిహద్దులలో ఉనికిలో ఉన్న తక్కువ అధ్యయనం చేసిన ఎండోగామసు బోడో-కాచారి తెగలో ఇది ఒకటి.[7]

హజాంగు తెగల వంశాలు

మార్చు

హజాంగులలో ఐదు వేర్వేరు వంశాలు ఉన్నాయి (హజోంగ్ భాసా: నిక్ని). ఒకే వంశంలో వివాహం నిషేధించబడింది. వారి సంస్కృతి వంశం నుండి వంశానికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది:

  • కొరేబరి
  • డొస్కిన
  • సు- సుంగ్యా
  • బరో హజారి
  • మెస్పర్యా

వివాహాలు

మార్చు

హజాంగులు ఎండోగామసు ప్రజలు.[8] హజాంగు సమాజంలో ఉండే మాతృస్వామ్యం హిందూ మతం ప్రభావంతో క్షీణించింది. ఇది హజాంగు సమాజంలో పితృస్వామ్యం ఆధిపత్యం వైపు దారితీసింది. హజాంగు సంస్కృతిలో శృంగారం ప్రేమ, వితంతు పునర్వివాహాలు అనుమతించబడ్డాయి. హజోంగు ప్రజలలో ఏకస్వామ్యం ఆదర్శంగా ఉంది. హజోంగు సమాజంలో అధిక కట్నం విధానం లేదు. హజాంగులు కన్యాశుల్కం లేదా వరకట్నాలను పాన్ అని పిలుస్తారు. హజాంగులలో వితంతువులను తిరిగి వివాహం చేసుకోవడానికి అనుమతి ఉంది. ఈ రకమైన వివాహాన్ని హజోంగులో హాంగు లేదా సంగా అంటారు.

హజాంగులు హిందువులు, హిందూ ఆచారాలను పాటిస్తారు. హిందూకరణ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు. హజాంగులలో ఆనిమిస్టికు నమ్మకాలు ఇప్పటికీ ప్రబలంగా ఉన్నాయి. హిందూ పూర్వ కాలం నాటి ఆచారాలు, నమ్మకాల గురించి పెద్దగా తెలియదు. [6]

 
సంప్రదాయ హజాంగు ధాన్యాగారం

భౌగోళిక విస్తరణ

మార్చు

హజాంగు ప్రజలు ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశు అంతటా విస్తరించి ఉన్నారు. భారతదేశ సరిహద్దులో వీరు సంఖ్యాపరంగా అధికంగా ఉన్నారు. మేఘాలయలోని గారో, ఖాసి పర్వతాలలో (అధికంగా నైరుతి గారో పర్వత జిల్లా) బంగ్లాదేశు సరిహద్దులో హజాంగు అధికంగా కనిపిస్తారు. వారు దిగువ అస్సాం, ధెమాజీ, ఎగువ అస్సాంలోని ధుబ్రీ, గోల్పారా జిల్లాలలో, అరుణాచల ప్రదేశులో నివసిస్తున్నారు.[9] చిట్టగాంగు విభాగంలో (ధృవీకరించబడని నివేదికలు ఉన్నప్పటికీ), బంగ్లాదేశులోని ఉత్తర ఢాకా విభాగంలో హజాంగులు నివసిస్తున్నట్లు భావిస్తున్నారు. పశ్చిమాన షెర్పూరు జిల్లా నుండి తూర్పున సునంగంజు జిల్లా వరకు విస్తరించి ఉన్న సరిహద్దు భూభాగం ఇరుకైన భూభాగ పట్టీని హజాంగు సమాజం దక్షిణ కేంద్రంగా పరిగణించవచ్చు.[2]

హజాంగు ప్రజలు తమ సొంత భాషను కలిగి ఉన్నారు. ఇది ముందుగా టిబెటో-బర్మను భాషగా ఉందేది.[10] కానీ ఇప్పుడు టిబెటో-బర్మను మూలాలతో ఇండో-ఆర్య భాషగా పరిగణించబడుతుంది. ఇది 175,000 కంటే అధికమైన హజాంగు ప్రజలకు ఇది వాడుక భాషగా ఉంది. ఇది తూర్పు నగరి లిపి, లాటిను లిపిలో వ్రాయబడింది. ఇందులో చాలా సంస్కృత రుణ పదాలు ఉన్నాయి. హజోంగు ఫొనాలజీకి అదనపు అచ్చు ఉంది. ఇది ఇతర ఇండో-ఆర్య భాషలలో లేదు. కానీ టిబెటో-బర్మను కుటుంబానికి విలక్షణమైనది.[11] హజాంగు శబ్దశాస్త్రంలో కొంత అచ్చు ఉచ్ఛారణ, ముగింపులో హల్లులను ఉపయోగించడం ఉన్నాయి.

దుస్తులు

మార్చు
 
అర్గాను

సాంప్రదాయకంగా మహిళా ప్రజలు ప్రధానంగా పాతిను ధరిస్తారు. ఇది చుట్టూ లంగాను ధరిస్తుంది. ఇది శరీరం ఎగువ, దిగువ భాగాన్ని నుండి కాలు వరకు కప్పేస్తుంది. ఉన్నత తరగతిలోని మహిళలు పొడవైన పాథినును ధరించారు. ఇది నేలతాకేలా ఉంటుంది. అయితే దిగువ తరగతిలోని మహిళలు కొంచెం పొట్టిగా ఉండే పాథిను ధరించారు. ఇది చీలమండకు చేరుకునే పొడవు ఉంటుంది. పాటిను అనేది చారల, రంగురంగుల, దీర్ఘచతురస్రాకార వస్త్రం, ఇది కాన్ అని పిలువబడే ఎరుపు చారలు, చపా అని పిలువబడే మందపాటి వేర్వేరు రంగుల ప్రత్యామ్నాయ పొరలతో ఉంటుంది. పాతిన్లను మహిళలు తమ కుటుంబ మగ్గాల (బానా లేదా తాత్) మీద నేస్తారు. ఇది చేతులతో పనిచేస్తుంది. దీనిని వాడడానికి పాదాల వాడకం అవసరం లేదు. మహిళల శరీరం పై భాగం పార్సా లేదా ఆర్గాను చేత కప్పబడి ఉంటుంది. ఆధునిక హజాంగు మహిళలు అప్పుడప్పుడు గారో, మిజో తెగల మాదిరిగానే నడుము నుండి చీలమండ వరకు శరీరం దిగువ భాగాన్ని కప్పడానికి 'పాటిన్' ధరిస్తారు.

పురుషులు చేతితో నేసిన నింగ్తీ ధరిస్తారు. నడుము వస్త్రం గామ్సాను శరీరం దిగువ భాగాన్ని కప్పడానికి ఉపయోగిస్తారు. శీతాకాలంలో కొంపెసు అనే కండువాను ఉపయోగిస్తారు.

సంప్రదాయ ఆభరణాలు

మార్చు

సాంప్రదాయ ఆభరణాలు కొన్ని:

 
హజాంగుల సంప్రదాయ ఆభరణాలు
 
కంకుర్య
 
హార్సుహరు లేక చంద్రహారం - మహిళలు ధరించే హారం
  • హర్సురా లేదా చంద్రహారం - మహిళలు ధరించే వెండి హారము.
  • కటాబాజు - వెండితో చేసిన ఆర్ములెట్ల జత.
  • గాలాహిచా - ఒక టార్కు.
  • బుయిలా - వెండితో చేసిన గాజుల జత.
  • కాదు - బంగారంతో చేసిన ముక్కెర.
  • నోలోక్ - వెండితో చేసిన ముక్కెర.
  • కోరోంఫులు - వెండితో చేసిన చెవిపోగులు.
  • కంకుర్య - బంగారంతో చేసిన చెవిపోగులు.
  • బక్ గుంజ్రీ లేదా గుజురాతి - వెండితో చేసిన కడియం (చీలమండలమ్లో మహిళలు ధరించే ఆభరణాలు).
  • బక్ ఖారు - వెండితో చేసిన కాళ్ళ చుట్టూ పురుషులు ధరించే కడియం.

సంగీత వాయిద్యాలు

మార్చు

హజాంగులు తమ సొంత సంగీత వాయిద్యాలను కలిగి ఉన్నారు. అవి ధులుక్, ఖుల్, రసమండలి, దోతారా మొదలైనవి.

  • ధులుక్ - ప్రతి చివర పొరలతో కూడిన పెద్ద డ్రం రెండు చివరల నుండి ఆడబడుతుంది.
  • ఖుల్ - ఇత్తడితో చేసిన చిన్న తాళాల జత.
  • దోతారా - తీగల వాయిద్యం.
  • ధాపా కుర్తాల్ - సింబల్స్.
  • హరిండో - సాంప్రదాయ వయోలిను.

సంస్కృతం

మార్చు

హజాంగులు చాలా గొప్ప సంస్కృతిని కలిగి ఉన్నారు. హజాంగు సంస్కృతి బాగా ప్రభావవంతంమైనది. మేఘాలయ కోచెలు, బనైలు, దలు వంటి ఇతర తెగల భాష, దుస్తులు, సంస్కృతి మిద ఇది విపరీతమైన ప్రభావాన్ని చూపింది. పాతిన్ అని పిలువబడే వారి ప్రకాశవంతమైన చారల ఎరుపు రంగు దుస్తులు ధరించి హాజాంగు మహిళలను సులభంగా గుర్తించవచ్చు. సాంప్రదాయకంగా, అనేక ప్రస్తుత గ్రామాలలో మహిళలు తమ సొంత పాతిన్, ఫులా అగోన్, ఫులా కొంపెస్, గామ్సా, వారి ఇంటి దుస్తులను తయారుచేసే నేత కార్మికులుగా ఉంటారు.[12]

సాంప్రదాయ హజాంగు ఇళ్ళు ప్రాంగణంలో కేంద్రీకృతమైన ప్రత్యేక భవనాలను కలిగి ఉంటాయి. అంతస్తులు మట్టి, గోడలు ఆవు పేడతో పూతపూసిన చేయబడిన చీల్చిన వెదురుతో నిర్మించబడుతుంటాయి.[13] హజోంగ్ ఇంట్లో భవనాలు:

హజాంగుల నివాసగృహాలలో విభాగాలు:

  • భట్ ఘోర్ - భోజనశాల, పడకగది.
  • అఖ్లి ఘోర్ - వంటగది
  • కశ్రీ ఘోర్ - అతిథులకు సదుపాయాలతో వసతిగృహం
  • ఖుప్రా (జూరా) ఘోర్ - వివాహితుడైన కొడుకు లేదా కుమార్తె కోసం పడకగది
  • చాంగ్ ఘోర్ - ధాన్యాగారం
  • ధికి ఘోర్ - ధాన్యం దంచే గది
  • గులి ఘోర్ - పశువుల షెడ్డు.
  • డియావో ఘోర్ - రోజువారీ ప్రార్థన, ఆరాధన కోసం పూజ గది

వరి పెంపకానికి అవసరమైన పనిముట్లతో పాటు, గృహాలలో అనేక వెదురు చేపలుపట్టే పనిముట్లు ఉన్నాయి.[14] ప్రధానమైన ఆహారం అన్నాన్ని కూరగాయలతో తింటారు. ప్రత్యేక సందర్భాలలో బియ్యాన్ని పొడిని చేసి, పిథా అని పిలిచే ఆవిరితో చేసే వంటకం లేదా నూనెలో వేగించే కేకులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సాంప్రదాయకంగా ఇష్టమైన మాంసాహారంగా తాబేలును తింటారు.[15]

సాంప్రదాయ హజాంగు వంటకాలు:

డింగ్పురా - ఒక ప్రత్యేక రకం వెదురులో వండిన తీపి బియ్యం లిబాహకు - బియ్యపు పిండి నుంచి తయారవుతుంది బుక్ని భట్టు - పులియబెట్టిన బియ్యం బిసి భట్టు - ఆవిరి మీద వండిన ఒక రకమైన జిగట & తీపి బియ్యం భాతువాహకు - బియ్యం పిండి & చేపలతో వండిన కూర పుటామాస్ - అరటి దూటలో చుట్టడం ద్వారా వండిన చిన్న చేపలు. చున్సాహక్ - ప్రత్యేక అతిథి కోసం వండిన చిన్న మొత్తంలో కూరగాయలు తుప్లా భట్ - అరటి ఆకులతో చుట్టబడి వండిన బియ్యం ఖర్పాని - కూరగాయలు పొడి చేపలు, సోడాతో ఉడకబెట్టడం చుంగహక్ - వెదురులో కూరను కూరి దాని నోటి గాలిచొరబడకుండా కట్టివేసి వండేకూర.

 
బిర్పాటు-చిటా

సంప్రదాయ కళలు, హస్థకళలు

మార్చు

హజాంగు కళలలో బిరాపటు-చితా ఉన్నాయి. వీటిని ఐరో ఘోరు గోడ మీద ఐరో (లు) పెళ్లి వేడుకల సందర్భంగా చిత్రీకరిస్తారు. 'చాన్ బిలా అకావా' అని పిలువబడే బీరాపట్-చితా ఆల్డోలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పక్షులు, పడవలు, పల్లకీలు పిత్లీ, సింధూరం, కోహ్లు అని పిలిచే పొడి బియ్యంతో చిత్రిస్తారు. నాగదేవత కాని డియావో మారోయి పూజ కోసం మెర్ తయారీలో ఇతర కళాకృతులు జరుగుతాయి. మెర్లో కని దేవా ఆరాధన కోసం ఉద్దేశించిన వివిధ దేవతలు, ఇతర శుభ చిహ్నాలు చిత్రించబడతాయి.. హజాంగులలో మరొక ప్రసిద్ధ జానపద కళ కాగితం కటింగు. వివాహాలు, ఇతర పండుగ సందర్భాలలో విస్తృతమైన డిజైన్లతో పేపరు కోతలను తలుపుల మీద వేలాడదీస్తారు. ఉత్సవ అరటి చెట్లను తరచుగా క్లిష్టమైన కాగితపు కోతలతో అలంకరిస్తారు.

హజాంగు తెగల పండుగలు

మార్చు
 
యువ హజాంగు నృత్యకారులు

హజాంగు ప్రజలు దుర్గా పూజ, కామాఖ్యా పూజ వంటి హిందూ పండుగలను జరుపుకుంటారు. అలాగే వారు తమ స్వంత కొన్ని సాంప్రదాయ పండుగలను కూడా జరుపుకుంటారు. దీనిని హజాంగు షమను డయోషి లేదా నుంగ్టాంగు నిర్వహిస్తారు. బస్తు పూజ విగ్రహారాధనలో పాల్గొనదు. దీనిని గ్రామ ప్రాంగణం వెలుపల ఒక నిర్దిష్ట ప్రదేశంలో జరుపుకుంటారు. మైమెననుసింగులో చోర్మాగా, భారతదేశంలో చోర్ఖిలా అని పిలవబడే మరొక పండుగను జర్పుకుంటారు. మేఘాలయలోని నైరుతి గారో పర్వత జిల్లాల్లో అక్టోబరు నెలలో చోర్ఖిలా అనే పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా యువకుల బృందం గ్రామంలో ఇంటి నుండి ఇంటికి వెళుతుంది. లేదా గ్రామం నుండి గ్రామానికి వెళుతుంది. ఉందులో సంగీతం, జానపద కథలను ప్రదర్శించబడతాయి. కొన్నిసార్లు రామాయణం నుండి కథలు. పార్టీలు వారి పనితీరుకు ప్రతిఫలంగా కొంత బియ్యం లేదా డబ్బును అందుకుంటాయి. ప్రతి వ్యక్తి, యువకులు, పెద్దవారు ఈ నాటకాన్ని చూడటానికి వస్తారు కాబట్టి, కాబోయే వధూవరులను ఎంచుకోవడానికి చేసే అవకాశంగా ఇది పరిగణించబడుతుంది.[16] హజాంగులు తమ రుతుపవన పూర్వ పంట పండుగను 'బిస్వా' అని పిలుస్తారు. కని పూజ, కాట్కా పూజ, కూడా చేస్తారు.

హజాంగు ప్రజలు వారి సాంప్రదాయ మతపరమైన ఆచారాలను కూడా పాటిస్తారు. మచాంగు డయావో, జరాంగు డయావో, భుటు, ముయిలే డయావో, జుగ్ని డయావో, దైని వంటి కొన్ని దుష్టశక్తులను హాజాంగులు నమ్ముతారు. వారు కాళి, దుర్గా, లక్ష్మి, సరస్వతి, కామాఖ్యా, మనసా, బసంతి వంటి వివిధ దేవతలను ఆరాధిస్తారు. హజాంగులలో కార్తీకు పూజను కాట్కా పూజ అని, మనసా పూజను కని డయావో పూజ అని పిలుస్తారు. లక్ష్మి పూజ రోజును 'కుజాయి ఘోరు' అని పిలుస్తారు. [17] బస్తు పూజలో తాబేళ్లు, పావురాలను బస్తు కోసం బలి చేస్తారు. [18]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "The Hajong". The Independent (Bangladesh newspaper). 27 March 2008. Archived from the original on 25 జూలై 2011. Retrieved 1 May 2011.
  2. 2.0 2.1 Ahmad, S., A. Kim, S. Kim, and M. Sangma. (2005). The Hajong of Bangladesh: A sociolinguistic survey. http://www.sil.org/resources/publications/entry/42943.
  3. "List of notified Scheduled Tribes" (PDF). Archived from the original (PDF) on 2013-11-07. Retrieved 2019-12-17.
  4. Research paper by Dr. Khema Sonowal (2014). Tribes of North-East India: A Study on ‘Hajongs’ http://theglobaljournals.com/gra/file.php?val=February_2014_1393595039_2cd81_83.pdf
  5. Hajong, B. (2002). The Hajongs and their struggle. Assam, Janata Press. p. 2-3.
  6. 6.0 6.1 Hajong, B. (2002). The Hajongs and their struggle. Assam, Janata Press. p. 1-2.
  7. "GRIN - the Hajong of Assam. An Ethnographic Profile of a Least Studied Bodo-Kachari Tribe".
  8. Hajong, B. (2002). The Hajongs and their struggle. Assam, Janata Press. p. 29.
  9. Kinny, E. and I. Zeliang. (2005). A Sociolinguistic survey among the Hajong of India. Unpublished manuscript.
  10. Hajong, B. (2002). The Hajongs and their struggle. Assam, Janata Press. Foreword(2) by Satyendra Narayan Goswami 2001.
  11. Guts, Y. (2007). Phonological description of the Hajong language. Masters Thesis. Amsterdam, Vrije Universiteit; p 59.
  12. Hajong, B. (2002). The Hajongs and their struggle. Assam, Janata Press. p. 20.
  13. Hajong, B. (2002). The Hajongs and their struggle. Assam, Janata Press. p. 11.
  14. Hajong, B. (2002). The Hajongs and their struggle. Assam, Janata Press. p. 14.
  15. Hajong, B. (2002). The Hajongs and their struggle. Assam, Janata Press. p. 16.
  16. Hajong, B. (2002). The Hajongs and their struggle. Assam, Janata Press. p. 44-45.
  17. Hajong, B. (2002). The Hajongs and their struggle. Assam, Janata Press. p. 41.
  18. Hajong, B. (2002). The Hajongs and their struggle. Assam, Janata Press. p. 42.
  • Biren Hajong & Sushmita Hajong (2002) The Hajongs and their Struggle

మూస:Hill tribes of Northeast India