స్వామీ ఘోరకనాథ్ శిష్యుడు యోగి స్వాత్వారామ[1] సంస్కృతములో రచించిన హఠయోగ ప్రదీపిక, హఠయోగములో ప్రాచీన పుస్తకముగా చెప్పబడుతున్నది. 11వ శతాబ్దములో వ్రాయబడిన ఈ గ్రంథము పురాతన సంస్కృత గ్రంథములతో పాటు స్వాత్వారామ ప్రతిపాదించిన యోగ ముద్రలు కూడా ఉన్నాయి. వీటిలో ఆసనాలు, ప్రాణాయామము, చక్రములు,కుండలిని, బంధములు, క్రియలు, శక్తి, నాడి, ముద్ర ఇంకా ఇతర విషయములు ఉన్నాయి. 1924లో మద్రాసులోని ప్రాచ్యలిఖిత భాండాగారంలోని ఈ గ్రంథం దొరకగా దానిని దొరస్వామయ్య అనువదించారు.[2] ఈనాడు అనేక ఆధునిక ఇంగ్లీషు అనువాదములు దొరుకుతున్నవి.

హఠయోగ ప్రదీపిక ఆంగ్ల అనువాద పుస్తక ముఖచిత్రం.

రెండు స్రవంతులైన యిద (మానసిక), పింగళ (భౌతిక) శక్తులను ఉపయోగించి, షుషుమ నాడి (స్వీయ శక్తి)ని ఉద్గారించడానికి, శరీరంలోని వివిధ ప్రదేశాలలో వెన్నెముక ప్రాథమిక స్థానం నుండి తల పైభాగంవరకూ గల, కాస్మిక్ శక్తి కేంద్రాలను, సమాధి పొందేంత వరకు, వివిధ చక్రముల ద్వారా ప్రేరేపించవలెను.

అతి లోతైన ఏకాగ్రతలద్వారా, శారీరక మానసికాలపై పట్టు సాధించి, మేధోజలాల స్తంభనలవరకూ సాధనలు చేసి, స్వీయబ్రాహ్మణాన్ని పొందడమే హఠయోగం. అకుంఠిత దీక్షతో సాధన చేసే హఠయోగము, సాధకుణ్ణి రాజ యోగ శిఖరాలకు చేర్చుతుందని భావిస్తారు.

పాశ్చాత్య దేశాలలో, హఠయోగము వ్యాయామ శిక్షణా పద్ధతిగా ప్రాచుర్యము పొందినది. హఠయోగ అసలు మానసిక ఉద్దేశ్యాలను అర్థం చేసుకొనక, కేవలం భౌతిక సాధనలు మాత్రమే జరుగుతున్నవి. ప్రస్తుతము, 3 కోట్ల అమెరికా ప్రజలు హఠయోగాన్ని సాధన చేస్తున్నారని అంచనా. అయితే భారత ఉపఖండములో మాత్రం నేటికీ హఠయోగము సంప్రాదాయ పద్ధతిలోనే అనుసరించబడుతున్నది. 20వ శతాబ్దములో అంతర్జాతీయ చైతన్య స్రవంతిలోకి ప్రవేశించిన అనేక గొప్ప యోగులను అందించిన, వ్యవస్థీకృత సంస్థల అజమాయిషీలేని సాంప్రదాయ గురు-శిష్య సంబంధము భారత, నేపాలీ, కొన్ని టిబెట్ వర్గాలలో నేటికీ సజీవంగా ఉన్నది.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. చెరువు, లక్ష్మీనారాయణ శాస్త్రి (2008). యోగసర్వస్వము (PDF). తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు.
  2. ఓ.వై., దొరసామయ్య (1924). హఠయోగ ప్రదీపిక (మొదటి ముద్రణ ed.). మద్రాసు: అమెరికన్ డైమ్డ్ ముద్రాక్షరశాల. p. 1. Retrieved 27 October 2014.