ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ (అరబిక్: حركة المقاومة الاسلامية ‎, Ḥarakat al-Muqāwamah al-ʾIslāmiyyah ) [ , దీనిని హమాస్ అని పిలుస్తారు హమాస్ అనేది పాలస్తీనాలోని గాజా పరిదిలోని ఒక రాజకీయ, మతపరమైన ఉగ్రవాద సంస్థ. హమాస్ పూర్తి పేరు 'హర్కత్ అల్ ముఖావమా అల్-ఇస్లామియా'. పాలస్తీనాలోని రెండు రాజకీయ పక్షాల్లో ఇదొకటి. 1987లో వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరుసలేంలో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతాల్లో మొదటి ఇంతిదా (తిరుగుబాటు) ఉద్యమం జరిగింది. 1987లో స్థాపించబడిన పాలస్తీనా ఇస్లామిక్ సున్నీ సంస్థ. పాలస్తీనా స్వాతంత్ర్యం కోసం పోరాడుతుందని పేర్కొంటుంది, కానీ దాని లక్ష్యాలను సాధించడానికి హింసాత్మక మార్గాలను ఉపయోగిస్తుంది. 2006 పాలస్తీనా ఎన్నికలలో, హమాస్ పార్లమెంటులోని 132 సీట్లలో 74 స్థానాలను గెలుచుకుంది, గాజా స్ట్రిప్‌పై నియంత్రణ సాధించింది.

ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్
حركة المقاومة الإسلامية
పార్టీ ప్రతినిధిఫౌజీ బర్హౌమ్
చైర్మన్ఇస్మాయిల్ హనియే
డిప్యూటీ చైర్మన్సలేహ్ అల్-అరోరి
స్థాపకులు
స్థాపన తేదీడిసెంబరు 10, 1987; 36 సంవత్సరాల క్రితం (1987-12-10)
విభజనముస్లిం సోదరసమాజం
ప్రధాన కార్యాలయంగాజా సిటీ, గాజా స్ట్రిప్
సైనిక విభాగంIzz ad-Din al-Qassam Brigades
మతంసున్నీ ఇస్లాం
రాజకీయ కూటమిపాలస్తీనా బలగాల కూటమి
Party flag

హమాస్ యొక్క ఉగ్రవాద చర్యలలో రాకెట్ దాడులు, హత్యలు, బంధీ తీసుకోవడం, ఆత్మాహుతి దాడులు ఉన్నాయి. హమాస్ దాడుల కారణంగా ఇజ్రాయెల్‌లో వందలాది మంది పౌరులు మరణించారు.[1][2]

దీని వ్యవస్థాపకుడు, షేక్ అహ్మద్ యాసిన్, స్థానిక పాలస్తీనా అరబ్, ఇతర ప్రధాన నాయకులు కూడా పాలస్తీనాలో పుట్టి పెరిగారు, చాలా కాలం పాటు ఇజ్రాయెల్ పాలనను చూశారు. హమాస్ స్థాపన యొక్క ఉద్దేశం నేటి ఇజ్రాయెల్‌తో సహా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న పాలస్తీనాను విముక్తి చేయడం.[3]

హమాస్ యొక్క ఉగ్రవాద చర్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా విమర్శించబడ్డాయి. యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్ వంటి అనేక దేశాలు, సంస్థలు హమాస్‌ను ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి.అయితే, ఇరాన్, ఈజిప్ట్, రష్యా, టర్కీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా  వంటి దేశాలు, యునైటెడ్ నేషన్స్,, భద్రతా మండలి దానిని తీవ్రవాద సంస్థగా పరిగణించదు.

మూలాలు

మార్చు
  1. telugu, NT News (2023-10-10). "Israel-Hamas War | మా భూభాగంలో 1500 మంది హమాస్‌ మిలిటెంట్ల మృతదేహాలు.. ప్రకటించిన ఇజ్రాయెల్‌ సైన్యం". www.ntnews.com. Retrieved 2023-10-10.
  2. "Israel-Hamas Attacks: ఇజ్రాయిల్-హమాస్ మధ్య దాడులు ప్రతీకార దాడుల్లో వందలాది మంది మృతి". Zee News Telugu. 2023-10-07. Retrieved 2023-10-10.
  3. "MSN". www.msn.com. Retrieved 2023-10-10.
"https://te.wikipedia.org/w/index.php?title=హమాస్&oldid=4220099" నుండి వెలికితీశారు