హయహయ రాజ్యం
మహాభారతం కావ్యంలో సూచించిన హయహయ రాజ్యం (హయహయ, హైహేయా, హీహేయా మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు) మధ్య, పశ్చిమ భారతదేశంలో యదువంశ (చంద్రవంశం) రాజులు పాలించిన రాజ్యాలలో ఒకటి. దీనిని రావణుడిని ఓడించిన శక్తివంతమైన కర్తవీర్య అర్జునుడు (యదు మనవడు) పాలించాడు. ప్రస్తుత మధ్యప్రదేశులోని నర్మదా నది ఒడ్డున ఉన్న మహీష్మతి దాని రాజధాని. వారు భారతదేశంలోని అనేక ఇతర రాజ్యాలను జయించినప్పటికీ యోధులైన భార్గవులతో శత్రుత్వం వారి మరణానికి దారితీసింది. భార్గవ నాయకుడు పరశురాముడు ఆధ్వర్యంలో వారు నిర్మూలించబడ్డారు. తాలజంఘా అనేది హెహేయా అనుబంధ రాజ్యం (బహుశా దీనికి తూర్పున ఉండి ఉండవచ్చు).
హయహయ వంశాలు
మార్చుఐదు గణాల (వంశాలు) సమాఖ్య, వారు యదు వంశజాతులుగా పేర్కొనబడ్డారు. హరివంశ పురాణం (34.1898) ఆధారంగా హయహయుడు యదు ముని మనవడు, సహస్రాజితు మనవడు.[1] విష్ణు పురాణం (IV.11) లో, ఐదు హయహాయ వంశాలు కలిసి తాలజంఘులుగా పేర్కొనబడ్డాయి.[2] ఐదు హయహయ వంశాల సమాఖ్య; వితిహోత్రా, శర్యత, భోజా, అవంతి, తుండికేరా.[2] హయహయులు పశ్చిమ మధ్యప్రదేశులోని ప్రస్తుత మాళ్వా ప్రాంతానికి చెందినవారు. పురాణాలు హైహయాలు అవంతిని పాలించిన మొదటి పాలక రాజవంశంగా పేర్కొన్నాయి.[3]
మాహిష్మతి స్థాపన
మార్చుహరివంశ (33.1847) లో వారి భవిష్యత్తు రాజధాని నగరం మహిష్మతి (నేటి మధ్యప్రదేశులో) స్థాపించిన గౌరవం రాజు మహీష్మంతుడు సహంజా కుమారుడు, యదు వంశస్థుడు (హయహయ వంశం ద్వారా). మరొక పురాణకథనం ఇది రాజు పూర్వీకులలో ఒకరైన ముచుకుందుడిని మహిష్మతి స్థాపకుడిగా పేర్కొంది. ఆయన రిక్ష పర్వతాలలో మహిష్మతి, పూరికా నగరాలను నిర్మించాడని పేర్కొంది. [4]
పద్మ పురాణం (VI.115) ఆధారంగా ఈ నగరం వాస్తవానికి ఒక నిర్దిష్ట మహిషా చేత స్థాపించబడింది.[5]
కార్తావిర్యార్జునుడు ఆయన వారసులు
మార్చుమహాభారతం, పురాణాల ఆధారంగా అత్యంత ప్రసిద్ధ హయహయ రాజు కర్తావీర్య అర్జునుడు[6] సహస్రబాహు (వేయి భుజములు) కలవాడు. ఆయనను చక్రవర్తి అని పిలిచేవారు. ఆయన పేరు ఋగ్వేదం (VIII.45.26) లో కనుగొనబడింది.[7] ఆయన చివరికి నాగ అధిపతి అయిన కార్కోటకుడు నాగా నుండి మహిష్మతి నగరాన్ని స్వాధీనం చేసుకుని దానిని తన కోట-రాజధానిగా చేసుకున్నాడు.[6] వాయు పురాణం ఆధారంగా ఆయన లంక మీద దాడి చేసి రావణుడిని ఖైదీని తీసుకున్నాడు.[8] అర్జునుడు దత్తాత్రేయుడిని ఆశ్రయించి అతనికి శిష్యుడిగా ఉన్నాడు. [9] అర్జునుడి కుమారులు జమదగ్ని ఋషిని చంపారు. ప్రతీకారంగా జమదగ్ని కుమారుడు పరశురాముడు అర్జునుడిని చంపాడు. అర్జునుడికి చాలా మంది కుమారులు ఉన్నారు. ఆయన కుమారుడు జయధ్వజ ఆయన తరువాత రాజ్యపాలన చేసాడు.[6]
వితిహోత్రులు
మార్చుహయహయులు ఎక్కువగా వారిలో ఆధిపత్య వంశం పేరుతో పిలువబడ్డారు - వితిహోత్రాలు (లేదా విటాహోత్రాలు లేదా విటావ్యాలు). పురాణాల ఆధారంగా వితిహోత్రుడు కర్తావీర్యార్జునుడి మనవడు, తాలఝంగుడి పెద్ద కుమారుడు. పురాణాలలో ఇద్దరు వితిహోత్రా పాలకులు పేర్లు ఉన్నాయి: వితిహోత్రుడి కుమారుడు అనంతుడు, అనంతుడి కుమారుడు దుర్జయ అమిత్రకర్షన [2] హయహయ భూభాగవిస్తరణలో ఉన్న మద్య గంగా లోయకు వితియోత్ర పాలకుల విస్తరణను ఇక్ష్వాకు రాజు సాగరుడు ఆపివేశారు.[10] దిఘానికాయ ప్రాంతానికి చెందిన మహాగోవిందసూతాంత అవంతి రాజు వెస్సాభు (విశ్వభూ), ఆయన రాజధాని మహిస్సతి (మహిష్మతి) గురించి ప్రస్తావించారు. బహుశా ఆయన వితిహోత్రా పాలకుడై ఉంటాడు.[11] బహుశా తరువాతి వితిహోత్రుల పాలనలో అవంతి ప్రాంతం మొత్తం రెండు రాజ్యాలుగా అభివృద్ధి చెందింది. వింధ్యాలచే విభజించబడి మహిష్మతి, ఉజ్జయిని (ప్రస్తుత ఉజ్జయిని) ప్రధాన నగరాలుగా చేసుకుని పాలించాయి. మత్స్య పురాణం (5.37) ఆధారంగా రిపుంజయ మంత్రులలో ఒకరైన పులికా ఉజ్జయిని చివరి వితిహోత్రా రాజును చంపి తన కుమారుడు ప్రద్యోతను కొత్త రాజుగా చేసాడు. [12]
హయహయులు అనేక మంది వేదాలు నేర్చుకున్నారని చెబుతారు.[13]
మధ్యయుగ హయహయులు
మార్చుకలాచురీలు, కేరళలోని మూషికవంశస్థులు పాలించిన మూషిక రాజ్యం వంటి అనేక ప్రారంభ మధ్యయుగ రాజవంశాలు తాము హైహాయుల నుండి వచ్చామని పేర్కొన్నారు.[14] తూర్పు భారతదేశంలోని హయహయులు మధ్యయుగ కాలంలో ఇస్లామిస్టుల ఆక్రమణదారులతో పోరాడారు.[15]
మహాభారతంలో మూలాలు
మార్చుఇక్షాకు రాజులతో సంఘర్షణలు
మార్చుకోసల రాజ్యానికి రాజు అయోధ్య నుండి పాలించాడు. ఆయన ప్రాచీన భారతదేశంలో ప్రసిద్ధ రాజ వంశం అయిన ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. సాగరను జదు కుమారుడిగా (MBh 12,56)పేర్కొనబడ్డాడు. ఆయనకు 60,000 మంది కుమారులు ఉన్నారని రామాయణ ఇతిహాసం పేర్కొన్నది.
ఇక్వాకు రాజు సాగరుడు హయహయలును, తాలఝంఘులను ఓడించాడని చెబుతారు. ఆయన సైనిక కులం మొత్తాన్ని లొంగదీసుకున్నాడు. (మహాభారతం 3,106)
హయహయులు, వత్సరాజ్య తాలజఘులు
మార్చు- (మహాభారతం 13,20) హయహయులు, తాలఝంఘుల మూలాలు వత్స రాజ్యంలో ఉండవచ్చని భావిస్తున్నారు. హఠాస్వ, సుదేవా, దివోదాస, ప్రతార్దానా నాలుగు తరాల కాశీ రాజుల పాలనలో వత్స రాజ్యంలోని పాలకులను హయహయులు, వితహవ్యులు అని పిలుస్తారు. వితహవ్య రాజు ఆధ్వర్యంలో పొరుగు దేశం కాశీ మీద దాడి చేశారు. వారిలో చివరివాడైన ప్రతర్ధనుడు హయహయులను ఓడించి, వారిని వత్స రాజ్యం నుండి బహిష్కరించాడు. కాశీ రాజులు కూడా ఇక్ష్వాకు వంశావళిలో జన్మించారు. ఇది వారితో హయహయుల సంఘర్షణలకు బీజం కావచ్చు.
హర్యాస్వుడి పాలనలో
మార్చుశర్యాతి వంశంలో (మనువుకు (మనుతి (మహాభారతం 1,75%) జన్మించిన అనేకమంది కుమారులలో శర్యాతి, ఇక్ష్వాకు ఇద్దరు ఉన్నారు), ఇద్దరు రాజులు జన్మించారు. వత్స ఇద్దరు కుమారులు హయహయ, తాలఝంగా. హైహయుడికి 19 మంది భార్యలు, 100 మంది కుమారులు ఉన్నారు. వీరందరూ అత్యంత యుద్ధోత్సాహులు. కాశీని పాలించిన రాజు హర్యస్వుడు దివోదాసకు తాత. హయహయ రాజు కుమారుడైన వితాహవ్యసుడు కాశీ రాజ్యం మీద దాడి చేశారు. గంగా, యమునా నదుల మధ్య ఉన్న ఆ దేశంలోకి ప్రవేశించి హర్యస్వుడు రాజుతో యుద్ధం చేసి అక్కడ ఉన్న రాజును చంపాడు. హయహయ కుమారులు నిర్భయంగా వత్స దేశంలోని తమ సొంత నగరానికి తిరిగి వెళ్లారు.
సుదేవుడి పాలనలో
మార్చుఇంతలో హర్యశ్వుడి కుమారుడు సుదేవా కొత్త పాలకుడిగా కాశీ సింహాసనం మీద అధిష్టింపజేయబడ్డాడు. వీతహవ్య 100 మంది కుమారులు మరోసారి తన ఆధిపత్యాన్ని తెలియజేస్తూ కాశీని ఆక్రమించి యుద్ధంలో ఓడించడానికి ముందు ఆ నీతిమంతుడైన యువరాజు సుదేవుడు కొంతకాలం తన రాజ్యాన్ని పరిపాలించాడు. సుదేవ రాజును ఓడించిన తరువాత హయహయ విజేతలు తమ సొంత నగరానికి తిరిగి వచ్చారు.
దివోదాసుడి పాలనలో
మార్చుఆ తరువాత సుదేవ కుమారుడైన దివోదాసను కాశీ సింహాసనం అధిష్టింపజేసారు. యువరాజుల పరాక్రమం గుర్తించిన వీతహవ్య కుమారులు కొంతకాలం కాశీరాజ్యం మీద దండెత్తలేదు. రాజు దివోదాస ఇంద్రుని ఆజ్ఞతో బరనాసి (వారణాసి లేదా బనారసు) నగరాన్ని పునర్నిర్మించి బలపరిచారు. వారు కాశీనగరాన్ని దుకాణాలు, వ్యాపారవీధులు, సకలసౌకర్యాలతో, సకలాంగసుందరంగా తీర్చిదిద్ది విస్తరించారు. నగర భూభాగాలు గంగా ఒడ్డు నుండి గోమతి దక్షిణ ఒడ్డు వరకు ఉత్తరం వైపు విస్తరించి రెండవ అమరావతి (ఇంద్ర నగరం) ను పోలి ఉన్నాయి. హయహయులు మరోసారి దాడి కాశీ నగరం మీద దాడి చేశారు. తన రాజధాని నుండి హయహయుల దాడిని ఎదుర్కొన్న రాజు దివోదాసు యుద్ధంలో వెయ్యి రోజులకాలం శత్రువుతో పోరాడాడి చివరికి అనేకమంది అనుచరులను, జంతువులను కోల్పోయి చాలా బాధలు అనుభవించాడు. దివోదాస రాజు సైన్యాన్ని కోల్పోవడమే కాక ఖజానా కూడా ఖాళీ అయింది. తరువాత ఆయన గురువు బృహస్పతి కుమారుడు భరద్వాజను రక్షించాలని కోరుకుని దివోదాసు తన రాజధానిని వదిలి పారిపోయాడు.
దివోదాసుడి కుమారుడు ప్రతర్ధన ప్రతీకారం
మార్చువితాహవ్యుల మీద ప్రతీకారం తీర్చుకోగల ధైర్యవంతుడైన కొడుకు కోసం దివోదాస ఆకాంక్షించాడు. తన గురువు భరద్వాజ ఆశీస్సులతో ప్రతార్దన అనే కుమారుడిని పొందాడు. ప్రతర్ధన యుద్ధంలో బాగా నైపుణ్యం సాధిస్తాడ్జూ. దివోదాసు తన కొడుకును కాశీ సింహాసనం మీద అధిష్టింపజేసాడు. వితహవ్య కుమారులకు వ్యతిరేకంగా సైన్యాలను నడిపించమని కోరాడు. ఆయన తన రధం మీద అధిరోహించి గంగానదిని వేగంగా దాటి తన సైన్యాన్ని అనుసరించి వీతహవ్య నగరానికి వ్యతిరేకంగా ముందుకు సాగాడు. వీతహవ్యులు తమ నగరం నుండి తమ రధాలను అధిరోహించి ప్రతార్దనుడి మీద వివిధ రకాల ఆయుధాలను వర్షంలా కురిపించారు. ప్రతార్ధనా యుద్ధంచేసి వారందరినీ చంపాడు. యుద్ధంలో హైహాయ రాజు వీతహవ్యుడు, ఆయన కుమారులు, బంధువులందరూ చనిపోయారు. ఆయన గురువు భృగువు దగ్గరకు పోయి రక్షణ కోరాడు. భృగువు ఆయనకు సన్యాసదీక్ష ఇచ్చాడు. వీతహవ్యుడి వంశావళిలో జన్మించిన శౌనక మహర్షి ఉగ్రశ్రవణుడి నుండి మహాభారతాన్ని విని మహర్షులకు వినిపించాడు.
హయహయ రాజు కార్తవీర్యార్జునుడు
మార్చువేయి బాహువులు కలిగిన కార్తవీర్యార్జునుడు ఒక గొప్ప రాజుగా, దత్తాత్రేయ భక్తుడిగా వర్ణించబడింది. వెయ్యి చేతులతో (వెయ్యి మంది పరిచారకులు ఆయన చేతులుగా వ్యవహరించడం, అతని ఆజ్ఞలను అమలు చేయడానికి ఇది ప్రతీకగా భావించబడుతుంది). గొప్ప అందం శక్తివంతమైన కార్తవీర్యార్జునుడు పూర్వపు రోజులలో భూమండలం అంతటినీ పాలించాడని ప్రతీతి. ఆయనకు రాజధాని మహీష్మతి నగరంలో ఉంది. అసాధ్యమైన పరాక్రమంతో యాదవ క్షత్రియుల హయహయ జాతికి చెందిన కార్తవీర్యుడి రాజ్యానికి సముద్రాలు మాత్రమే హద్దులుగా ఉన్నాయి. క్షత్రియ క్రమం విధులను అనుసరిస్తూ వినయం, వేద జ్ఞానం కలిగిన కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడికి (మహాభారతం 13,152) పెద్ద మొత్తంలో సంపదను ఇచ్చాడు.
ఇతర హయహయ రాజు
మార్చు- వీతహవ్య రాజును వత్స కుమారుడిగా పేర్కొన్నారు (మహాభారతం 13,30)
- ఉడ్వర్తా రాజు తన జాతికి నిర్మూలించాడు (మహాభారతం 5,74)
- హయహయ రాజు, తార్క్ష్య అనే ఋషి మధ్య సంభాషణ (మహాభారతం: 3,183 వద్ద) ప్రస్తావించబడింది.
- హయహయ రాజర్షిగా, సుమిత్తోర పేరుతో (మహాభారతం: 12,124 వద్ద) పేర్కొనబడింది. (మహాభారతం 12,125 వద్ద) సుమిత్ర మిత్ర కుమారుడిగా పేర్కొనబడింది.
భార్ఘవులతో శతృత్వం
మార్చుభృగువంశానికి చెందిన గురువులకు హయహయ తెగ మద్య తలెత్తిన సంఘర్షణ మహాభారతంలోని వివిధ ప్రదేశాలలో ప్రస్తావించబడింది. భార్గవుల నాయకుడు జమదగ్ని కుమారుడు పరశురాముడు హయహయ రాజు కార్తవీర్యార్జునుడిని చంపేస్తాడు. వివాదం అక్కడతో ముగియలేదు. భార్గవులు భారతదేశం అంతటా వెళ్లి అనేక మంది క్షత్రియు రాజులను చంపారు. వారిలో ఎక్కువ మంది కార్తవీర్య అర్జునుడి బంధువులు ఉన్నారు. (మహాభారతం 1,104)
హిమాలయాలలో (మహాభారతం 12,49)ని గంధమదాన పర్వతాల వద్ద మహాదేవుడి నుండి శక్తివంతమైన పరశువుని పొందిన భార్గవ రాముడు భూమి మీద అసమానమైన శక్తిగా అవతరించాడు. కృతవీర్యుడి కుమారుడు క్షత్రియవంశజాతుడు అయిన అర్జుననామాంకితుడు హయహయుల పాలకుడు, గొప్ప బలవంతుడు, ధర్మవత్రనుడు, గొప్ప ఋషి దత్తాత్రేయుడి దయతో వెయ్యి బాహువులతో యుద్ధం చేసి మొత్తం భూమిని, పర్వతాలు, ఏడు ద్వీపాలను స్వాధీనం చేసుకుని చాలా శక్తివంతమైన చక్రవర్తిగా మారాడు. (12,49)
హయహయ తెగకు చెందిన శక్తివంతమైన ప్రభువు అయిన కార్తవీర్య అర్జునుడు భార్ఘవులతో ఏర్పడిన పగ కారణంగా జమదగ్నిని చంపి ఆయన కుమారుడైన భార్ఘవ రాముడి (పరశురాముడు) చేత చంపబడ్డాడు. (మహాభారతం3,115)
గిరిజన యుద్ధాల సూచనలు
మార్చు"భార్గవ రామ, కార్తవీర్య అర్జునుడు నాయకులను మాత్రమే చాలా చోట్ల ప్రస్తావించినప్పటికీ ఈ వివాదంలో చాలా మంది పాల్గొన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఇది రెండు తెగల మధ్య, తరతరాలుగా సంఘర్షణలు కావచ్చు."[ఆధారం చూపాలి]
ఒకప్పుడు బ్రాహ్మణులు తమ తపశ్శక్తిని అధికరింపజేసుకుని అత్యంత శక్తితో హయహయ వంశానికి చెందిన క్షత్రియులను యుద్ధంలో ఎదుర్కొన్నాడు. వైశ్యులు, శూద్రులు కూడా బ్రాహ్మణులను అనుసరించారు. తద్వారా మూడు జాతులకు చెందిన ప్రజలు ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకొనగా మరొకవైపున్న క్షత్రియులు మరొక వైపు ఒంటరిగా ఉన్నారు. తరువాత జరిగిన యుద్ధాలలో మూడు జాతులకు చెందిన ప్రజలు పదేపదే విడిపోయారు. ఒంటరి క్షత్రియులు తమకు వ్యతిరేకంగా ఉన్న పెద్ద సైన్యాన్ని ఓడించారు. అప్పుడు బ్రాహ్మణులలో అత్యుత్తమమైనవారు క్షత్రియులనే దీనికి కారణం ఏమిటని అడిగారు. క్షత్రియులు వారితో ఇలా అన్నారు, "యుద్ధంలో గొప్ప తెలివితేటలు కలిగిన ఒక వ్యక్తి ఆదేశాలను మేము పాటిస్తాము, అదే సమయంలో మీరు ఒకరితో ఒకరు విడిపోయి మీ వ్యక్తిగత అవగాహన ప్రకారం నడుస్తారు." అప్పుడు బ్రాహ్మణులు తమలో ఒకరిని తమ సేనాపతిగా నియమించారు. వీరు ధైర్యవంతులు, విధాన మార్గాలను అనుసరించారు. ఆపై వారు హయహయ క్షత్రియులను ఓడించడంలో విజయం సాధించారు. (మహాభారతం 5,157)
వివాద సారాంశం
మార్చుభార్గవ రాముడు, తన తండ్రి జమదగ్నిని చంపి, ఆయన ధేనువును దొంగిలించి, శత్రువులచే జయించబడని కర్తావీర్యులను చంపారు.
ఆయన తన విల్లుతో ఆయన 64 సార్లు దండయాత్రచేసి 10,000 క్షత్రియులను చంపాడు. ఆ వధలో బ్రాహ్మణులను ద్వేషించే దంతకుర దేశానికి చెందిన 14,000 మంది క్షత్రియులను హతమార్చాడు. హయహయులలో ఆయన తన చిన్న కర్రతో 1000 మంది క్షత్రుయులను, కత్తితో 1000 క్షత్రియులను, ఉరితీసి 1000 మంది క్షత్రియులను హతమార్చాడు. భార్ఘవరాముడు తన ప్రతీకారవాంఛతో 10,000 క్షత్రియులను హతమార్చాడు. శత్రువులు పలికిన ఆగ్రహోక్తులను విని ఆయన నిశ్శబ్దంగా భరించలేకపోయాడు. భృగువంశజుడైన భార్గవరాముడితో బ్రాహ్మణులు మొరపెట్టుకున్నప్పుడు కోపోద్రిక్తుడై పరశురాముడు కాశ్మీరాలు, దారదాలు, కుంతిలు, క్షుద్రకులు, మాళవులు, అంగాలు, వంగాలు, కళింగాలు, విదేహాలు, తామ్రలిప్తులకు వ్యతిరేకంగా పోరాడి వారి పాలకులను హతమారుస్తూ ముందుకు సాగాడు. ఆయన ప్రాంతం నుండి ప్రాంతానికి ప్రయాణిస్తూ ఆయన వేలాదిమంది హయహయ-క్షత్రియులను హతమార్చింది. రక్తం వరదను సృష్టించడం ద్వారా కురుక్షేత్రంలో శమంతకపంచకం అనే ఐదు సరస్సులను క్షత్రియరక్తంతో నింపి మొత్తం 18 ద్వీపాలను తన అధీనంలోకి తీసుకునివచ్చాడు. ఆయన 100 యాగాలను నిర్వహించాడు.(మహాభారతం:7, 68)
ఇవి కూడా చూడండి
మార్చుఈ సమూహంలోని ఇతర రాజ్యాలు:
మూలాలు
మార్చు- ↑ Pargiter, F.E. (1972) [1922]. Ancient Indian Historical Tradition, Delhi: Motilal Banarsidass, p.87.
- ↑ 2.0 2.1 2.2 Pargiter, F.E. (1972) [1922]. Ancient Indian Historical Tradition, Delhi: Motilal Banarsidass, p.102.
- ↑ Raychaudhuri, H.C. (1972) Political History of Ancient India, Calcutta: University of Calcutta, pp.130-1.
- ↑ PK Bhattacharya (1977). Historical Geography of Madhya Pradesh from Early Records. Motilal Banarsidass. pp. 170–175. ISBN 978-81-208-3394-4.
- ↑ Pargiter, F.E. (1972) [1922]. Ancient Indian Historical Tradition, Delhi: Motilal Banarsidass, pp.263,263fn3.
- ↑ 6.0 6.1 6.2 Pargiter, F.E. (1972) [1922]. Ancient Indian Historical Tradition, Delhi: Motilal Banarsidass, p.265-7
- ↑ Misra, V.S. (2007). Ancient Indian Dynasties, Mumbai: Bharatiya Vidya Bhavan, ISBN 81-7276-413-8, pp.157-8
- ↑ Dowson, John (1984). A Classical Dictionary of Hindu Mythology, and Religion, Geography, History. Calcutta: Rupa & Co. p. 152.
- ↑ Pargiter, F.E. (1972) [1922]. Ancient Indian Historical Tradition, Delhi: Motilal Banarsidass, p.229.
- ↑ Thapar, Romila (1996). Ancient Indian Social History Some Interpretations, New Delhi: Orient Longman, ISBN 81-250-0808-X, p.299
- ↑ Bhattacharyya, P. K. (1977). Historical Geography of Madhya Pradesh from Early Records. Delhi: Motilal Banarsidass. pp. 118–9. ISBN 978-81-208-3394-4. The ISBN printed in the book (0-8426-909-1) is invalid, causing a checksum error.
- ↑ Raizada, Ajit (1992). Ujjayini (in Hindi), Bhopal: Directorate of Archaeology & Museums, Government of Madhya Pradesh, p.21
- ↑ Sarmah, Thaneswar The Bharadvajas in Ancient India, p.69
- ↑ Thapar, Romila (1996). Ancient Indian Social History Some Interpretations, New Delhi: Orient Longman, ISBN 81-250-0808-X, p.282
- ↑ Rajaguru, Satyanarayan. History of the Gaṅgas, p.59
- Kisari Mohan Ganguli, The Mahabharata of Krishna-Dwaipayana Vyasa Translated into English Prose, 1883–1896.
- Sastri, K. A. Nilakanta, ed. (1988) [1967], Age of the Nandas and Mauryas (Second ed.), Delhi: Motilal Banarsidass, ISBN 81-208-0465-1