కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో గల హయాత్ బక్షీ బేగం సమాధి

మా సాహెబా గా ప్రసిద్ధి చెందిన హయాత్ బక్షీ బేగం భాగ్యనగర స్థాపకుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏకైక సంతానము. గోల్కొండ ఆరవ సుల్తాను సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా భార్య మరియు ఏడవ సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా యొక్క తల్లి.

చరిత్ర, నేపథ్యంసవరించు

 
హయత్ బక్షి మజీదు ఆవరణములో ఒక బోర్డు

కులీ కుతుబ్ షాకు మగ సంతానము లేనందున తన కూతురు హయాత్ బక్షీ బేగాన్ని తన తమ్ముడు మహమ్మద్ అమీన్ కుమారుడైన మహమ్మద్ సుల్తాన్ (మహమ్మద్ కుతుబ్ షా) కు ఇచ్చి వివాహము చేసి, మహమ్మద్ సుల్తాన్‌ను తన వారసునిగా ప్రకటించాడు.[1] ఈ వివాహము 1607లో హైదరాబాదు నగరాన్నంతా అలంకరించి, నెలరోజులపాటు వేడుకలతో ఘనంగా జరిపించాడు కులీ కుతుబ్ షా. మహమ్మద్ కుతుబ్ షాకు ముగ్గురు కుమారులు మరియు కుమార్తెలు. వీరిలో ఏడవ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా కూడా ఒకడు.

హయాత్ బక్షీ బేగం దృఢమైన వ్యక్తిత్వం కల మహిళ. ఈమె ప్రభావం భర్తపై మొండుగా ఉండేది. తన కొడుకు యొక్క పాలనాకాలంలో తను మరణించే వరకు దాదాపు తనే సుల్తానుగా వ్యవహరించింది. ఈమె 1667 ఫిబ్రవరి 24న మరణించింది.

ఇతర విశేషాలుసవరించు

 
హయత్ బక్షి మసీదు
 
హయత్ బక్షీ మజీదు...
  • మా సాహెబా స్మృత్యర్ధం హైదరాబాదు నగర పరిసరాల్లో, అప్పటి మల్లేపల్లి గ్రామంలోని పొలాలకు నీరందించడానికి నిర్మించిన చెరువు 'మాసాహెబా ట్యాంకు'గా ప్రసిద్ధి చెందింది. ఇదే ప్రస్తుతపు నగరములోని మాసబ్‌టాంక్ ప్రాంతం.
  • ఈమె తన పేరు మీదుగా భాగ్యనగరము శివార్లలో సూరత్ - మచిలీపట్నము చారిత్రక వర్తక రహదారి పైన హయాత్‌నగర్‌ స్థాపించింది. ఈమె ఎన్నడూ స్వయంగా పరిపాలించక పోయినా కుతుబ్ షాహీ సమాధులలో ఈమెకు ప్రత్యేక సమాధి ఉండటము విశేషము.
  • హయత్ నగర్ లో వున్న పెద్ద మసీదు ఈమె పేరుమీద హయత్ బక్షి మజీదుగా పేరు గాంచింది.

మూలాలుసవరించు

  1. Mohammad Quli Qutb Shah By Masud Husain, Masʻūd Ḥusain K̲h̲ān̲, Sahitya Akademi పేజీ.18 [1]