హరికాంభోజి రాగము
(హరికాంభోజి రాగం నుండి దారిమార్పు చెందింది)
హరికాంభోజి రాగము కర్ణాటక సంగీతంలో 28వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు
మార్చు- ఆరోహణ : స రిగా మ ప ధని స
- (S R2 G3 M1 P D2 N2 S)
- అవరోహణ : సని ధ ప మగా రి స
- (S N2 D2 P M1 G3 R2 S)
ఈ రాగంలోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి ధైవతము, కైశికి నిషాధము. ఇది 64 వ మేళకర్త రాగమైన వాచస్పతికి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.
ప్రసిద్ధ రచనలు
మార్చు- రామా నను బ్రోవరా, ఎంతరా నీతన, దినమణి వంశ - త్యాగరాజు కృతులు.
హరికాంభోజి జన్యరాగాలు
మార్చుహరికాంభోజిలో చాలా జన్య రాగాలు ఉన్నాయి. వీనిలో కాంభోజి అత్యంత ప్రసిద్ధిచెందినది. ఇతర రాగాలు, మోహన, అంధోళిక, బహుదారి, ఖమాచ్, కేదారగౌళ, నటకురింజి, నవరస కన్నడ, శహన, శృతి, యదుకుల కాంభోజి.
కాంభోజి రాగము
మార్చు- ఉదాహరణలు
- ఇక్ష్వాకు కుల తిలక యికనైన పలుకవె రామచంద్రా - రామదాసు కీర్తన.
- ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైన - రామదాసు కీర్తన.
- ఎక్కడి కర్మములడ్డుపడెనో ఏమి సేయుదునో - రామదాసు కీర్తన.
- కట కట నీదు సంకల్ప మెట్టిదో గాని - రామదాసు కీర్తన.
- రక్షించు రక్షించు రక్షించు రక్షించు - రామదాసు కీర్తన.
యదుకుల కాంభోజి రాగము
మార్చు- ఉదాహరణలు
- అది కాదు భజన మనసా - త్యాగరాజు కీర్తన
- రామునివారమైనాము - రామదాసు కీర్తన.
- పాహిమాం శ్రీరామయంటే పలుకవైతివి - రామదాసు కీర్తన.
ఖమాచ్ రాగము
మార్చు- ఉదాహరణలు
- రామ జోగిమందు కొనరే ఓ జనులారా - రామదాసు కీర్తన.
- రామ రామ శ్రీరామ రామ - రామదాసు కీర్తన.
- వందనము రఘునాయక ఆనందము శ్రీరఘునాయకా - రామదాసు కీర్తన.
కేదారగౌళ రాగము
మార్చు- ఉదాహరణలు
- రామహో సీతా రామహో - రామదాసు కీర్తన.
- బిడియమేల నిక మోక్షమిచ్చి - రామదాసు కీర్తన.
సురటి రాగము
మార్చు- ఉదాహరణలు
- మరువకను నీ దివ్యనామ - రామదాసు కీర్తన.
ళహన రాగము
మార్చు- ఉదాహరణ
- రామ నీ దయ రాదుగా పతిత పావన - రామదాసు కీర్తన.
మూలాలు
మార్చు- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్