హరిప్రసాద్ చౌరాసియా

భారతీయ బంసూరి విద్వాంసుడు

పండిత్ హరిప్రసాద్ చౌరాసియా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన గొప్ప వేణుగాన విద్వాంసుడు. అతని సంగీతము వీనులవిందైనదే కాక, కొన్ని ప్రత్యేక శైలి మాంద్యములలో గొప్పది. హిందుస్థాన్ సాంప్రదాయ వాయిద్యాలలో నేర్పరి. హరిప్రసాద్ చౌరాసియా( జూలై 1,1938) అలహాబాదులో జన్మించాడు. అతని తండ్రి మల్లయోధుడు. హరిప్రసాద్ చౌరాసియా నాలుగవ యేటనే అతని తల్లి మరణించింది. తండ్రి భయంతో కొన్ని రోజులు వ్యాయామ శాలకు వెళ్ళినా, రహస్యంగా సంగీతం నేర్చుకొని, మిత్రుడి ఇంటిలో సాధన చేసేవాడు. హరిప్రసాద్ తన 15 యేట, పొరుగు వాడైన పండిట్ రాజారాం వద్ద గాత్రసంగీతం నేర్చుకొనడం ప్రారంభించాడు. తరువాత వారణాసికి చెందిన పండిట్ భోలానాథ్ పర్యవేక్షణలో వేణువు వాయించడం నేర్చుకొన్నాడు. చాలా కాలం తరువాత, ఆల్ ఇండియా రేడియోలో కచేరీలు ఇస్తున్నప్పుడు , ఆయనకు బాబా అల్లావుద్దీన్ ఖాన్ కూతురు అన్నపూర్ణాదేవి నుండి కొంత శిక్షణ లభించింది. ఆయన తన ప్రతిభానైపుణ్యంతో వేణుగాయనంలో శాస్త్రీయపద్ధతులనూ, ఆధునిక పోకడలనూ అవలంబించాడు. సంతూర్ వాద్యసంగీతకారుడు పండిట్ శివకుమార్ శర్మతో కలిసి ఆయన ఎన్నో కచేరీలు చేశాడు. వారి జుగల్‌బందీ శివ-హరి గా ప్రసిద్ధినొందినది. ఆయన పాశ్చాత్య సంగీత కళాకారులు ,John McLaughlin, Jan Garbarek, Yehudi Menuhin, Jean Pierre Raamphal వంటి వారలతో కలిసి కచేరీలు ఇచ్చాడు. ఆయన గాత్రసంగీతకారిణి, అనూరాధను వివాహం చేసుకొన్నాడు.

హరిప్రసాద్ చౌరాసియా

వ్యక్తిగత సమాచారం
జననం (1938-07-01) 1938 జూలై 1 (వయసు 85)
ప్రాంతము అలహాబాదు, ఇండియా
సంగీత రీతి హిందుస్తానీ సంగీతము
వృత్తి సంగీతకారుడు, వేణు విద్వాంసుడు
వాయిద్యం వేణువు
Website www.hariprasadchaurasia.com
చెప్పుకోదగిన వాయుద్యాలు
వెదురు పిల్లనగ్రోవి (బాఁసురీ)

అవార్డులు మార్చు

ముఖ్యమైన ఆల్బమ్‌లు మార్చు

1.కృష్ణధ్వని 60 2. హరిప్రసాద్ చౌరాసియా-ఫ్లూట్ 3.మార్నింగ్ రాగాలు 4.Call of the Valley 5.Immortal Series 6.Pure Joy 7. గ్రేట్ జుగల్‌బందీలు 8. గోల్డెన్ రాగా కలెక్షన్ 9.The Greatest hits of Hariprasad Chaurasia

హిందీ సినిమా సంగీతం మార్చు

చాందిని, డర్, లంహే, సిల్సిలా, ఫాస్‌లే, విజయ్, సాహిబాన్.

తెలుగు సినిమా సంగీతం మార్చు

సిరివెన్నెల సినిమాలో పాటలకు వేణుగాన సహకారం అందించింది హరిప్రసాద్ చౌరాసియానే. బాలమిత్రుల కథ సినిమాలో ప్రజాదరణ పొందిన గున్నమామిడి కొమ్మ మీద అనే పాటకు వేణుగాన సహకారం అందించింది కూడా ఆయనే.[ఆధారం చూపాలి]

ఇవికూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

  • హరిప్రసాద్ చౌరాసియా-అధికారిక వెబ్సైటు : లింక్

మూలాలు మార్చు